క్రీడాభూమి

దుమ్మురేపిన విండీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 3: మహిళల టి-20 ప్రపంచ కప్ టైటిల్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ‘హ్యాట్రిక్’ విజేత ఆస్ట్రేలియాను ఎనిమిది పరుగుల తేడాతో చిత్తుచేసి, మొదటిసారి టి-20 విశ్వవిజేతగా నిలిచింది. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 148 పరుగులు సాధించగా, విండీస్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ స్ట్ఫానీ టేలర్, హేలీ మాథ్యూస్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చి విండీస్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు.
బ్యాటింగ్ ఆరంభించిన రెండో ఓవర్ చివరి బంతికే అలిసా హీలీ (4) వికెట్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియాకు మరో ఓపెనర్ ఎలైస్ విలానీ, కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆదుకున్నారు. విలానీ 37 బంతుల్లో, తొమ్మిది ఫోర్లతో 52 పరుగులు చేసి దియేంద్ర డోటిన్ బౌలింగ్‌లో స్ట్ఫానీ టేలర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగింది. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద లానింగ్ వెనుదిరిగింది. ఆమె 49 బంతులు
ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 52 పరుగులు చేసి, అనీసా మహమ్మద్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిగింది. ఎలీస్ పెర్రీ 28 పరుగులు చేసి, డోటిన్ బౌలింగ్‌లో ఎల్‌బికాగా, ఎరిన్ ఒస్బర్న్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌటైంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేయగా, అప్పటికి అలెక్స్ బ్లాక్‌వెల్ (3), జెస్ జొనాసెన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో డొటిన్ 33 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా, హేలీ మాథ్యూస్, అనీసా మహమ్మద్ చెరొక వికెట్ సాధించారు.
ఆసీస్‌కు బ్రేక్
మహిళల విభాగంలో టి-20 వరల్డ్ కప్ 2009లో ఆరంభంకాగా, తొలి చాంపియన్‌గా ఇంగ్లాండ్ అవతరించింది. ఫైనల్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఆతర్వాత ఆస్ట్రేలియా శకం మొదలైంది. 2010లో న్యూజిలాండ్‌ను మూడు వికెట్లు, 2012లో ఇంగ్లాండ్‌ను నాలుగు వికెట్లు, 2014లో తిరిగి ఇంగ్లాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ‘హ్యాట్రిక్’ సాధించిన ఆస్ట్రేలియా దూకుడుకు ఈసారి వెస్టిండీస్ బ్రేక్ వేసింది. ఆసీస్ గౌరవ ప్రదమైన స్కోరు చేసినప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా విండీస్ ఓపెనర్లు హేలీ మాథ్యూస్, స్ట్ఫానీ టేలర్ వ్యూహాత్మకంగా ఆడారు. మొదటి వికెట్‌కు 120 పరుగులు జోడించారు. వేగంగా పరుగులు సాధించిన మాథ్యూస్ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేసి అలెక్స్ బ్లాక్‌వెల్ క్యాచ్ పట్టగా, క్రిస్టెన్ బీమ్స్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. మరో 24 పరుగుల తర్వాత టేలర్ కూడా అవుటైంది. ఆమె 57 బంతులు ఎదుర్కొని, ఆరు సిక్సర్లతో 59 పరుగులు సాధించి, రెనె ఫారెల్ బౌలింగ్‌లో జెస్ జొనాసెన్‌కు దొరికింది. 19వ ఓవర్ నాలుగో బంతికి 144 పరుగుల వద్ద విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. దియేంద్ర డోటిన్ (18), బ్రిట్నీ కూపర్ (3) మరో వికెట్ కూలకుండా జట్టును గెలిపించారు. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హేలీ మా థ్యూస్‌కు లభించగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కెప్టెన్ స్ట్ఫానీ టేలర్ స్వీకరించింది.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ సి అండ్ బి హేలీ మ్యాథ్యూస్ 4, ఎలైస్ విలానీ సి స్ట్ఫానీ టేలర్ బి దియేంద్ర డోటిన్ 52, మెగ్ లానింగ్ ఎల్‌బి అనీసా మహమ్మద్ 52, ఎలైస్ పెర్రీ ఎల్‌బి దియేంద్ర డోటిన్ 28, అలెక్స్ బ్లాక్‌వెల్ నాటౌట్ 3, ఎరిన్ ఒస్బర్న్ రనౌట్ 0, జెస్ జొనాసెన్ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1-15, 2-92, 3-134, 4-147, 5-147.
బౌలింగ్: షమిలియా కానెల్ 2-0-15-0, హేలీ మాథ్యూస్ 2-0-13-1, స్ట్ఫానీ టేలర్ 3-0-26-0, దియేంద్ర డోటిన్ 4-0-33-2, అఫీ ఫ్లెచర్ 1-0-9-0, అనిసా మహమ్మద్ 4-0-19-1, షకానా క్వింటైన్ 4-0-27-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ సి ఎలెక్స్ బ్లాక్‌వెల్ బి క్రిస్టెన్ బీమ్స్ 66, స్ట్ఫానీ టేలర్ సి జెస్ జొనాసెన్ బి రెనె ఫారెల్ 59, దియేంద్ర డోటిన్ 18 నాటౌట్, బ్రిట్నీ కూపర్ 3 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (19.3 ఓవర్లలో 2 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-120, 2-144.
బౌలింగ్: జెస్ జొనాసెన్ 4-0-26-0, ఎలైస్ పెర్రీ 3.3-0-27-0, మెగాన్ షట్ 3-0-26-0, రెనె ఫారెల్ 4-0-35-1, క్రిస్టెన్ బీమ్స్ 4-0-27-1, ఎరిన్ ఒస్బర్న్ 1-0-6-0.