క్రీడాభూమి

డి లాంగేను పిలిపించుకున్న దక్షిణాఫ్రికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: ఫిలాండర్, డేల్ స్టెయిన్ గాయాల కారణంగా బలహీనపడిన తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ మర్చెంట్ డి లాంగేను భారత్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకోసం పిలిపించింది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో తగిలిన తొడ కండరాల గాయంనుంచి స్టెయిన్ బాగానే కోలుకుంటున్నప్పటికీ ఈ నెల 25నుంచి నాగపూర్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టులో అతను ఆడడం అనుమానమేనని క్రికెట్ సౌతాఫ్రికా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, బెంగళూరులో రెండో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సందర్భంగా ఫుట్‌బాల్ ఆడుతూ ఫిలాండర్ చీలమండకు గాయం కావడంతో చికిత్స కోసం అతను స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. డిలాంగే భారత్‌తో దక్షిణాఫ్రికా ఆడిన టి-20 జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అతను ఇప్పటివరకు రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. చివరగా 2012లో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. జట్టులో ఇప్పుడూ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్న ముగ్గురు సీమర్లు మోమె మోర్కెల్, కగిసో రబడా, కైల్ అబోట్ మాత్రమే ఉన్నారని, స్టెయిన్ ఇంకా పూర్తిగా కోలుకోనందున ఈ ముగ్గురిలో ఎవరైనా ఆడలేని పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయం కోసం లాంగేను పిలిపిస్తున్నామని దక్షిణాఫ్రికా జట్టు కోచ్ రస్సెల్ డొమింగో చెప్పాడు.