క్రీడాభూమి

పంజాబ్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన తమిళనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిండిగల్ (తమళనాడు), డిసెంబర్ 1: రంజీట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా దుండిగల్‌లోని ఎన్‌పిఆర్ కళాశాల మైదానంలో మంగళవారం ఆతిథ్య తమిళనాడు, పంజాబ్ జట్ల మధ్య ప్రారంభమైన గ్రూప్-బి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే రోజు 21 వికెట్లు కూలాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు జట్టు కేవలం 68 పరుగులకే ఆలౌటై రంజీల్లో రెండవ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 1972-73 సీజన్‌లో ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్, అజిత్ వాడేకర్ తదితరులతో కూడిన బాంబే జట్టు కేవలం 61 పరుగులకే తమిళనాడును ఆలౌట్‌చేసి సంచలనం సృష్టించింది. కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టులో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పర్గత్ సింగ్ (0), యు.కౌల్ (13), మన్‌దీప్ సింగ్ (8) విఫలమైనప్పటికీ ఓపెనర్ జీవన్‌జ్యోత్ సింగ్ (29), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (49), ఎం.సిధానా (21), లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు బి.బ్రయిందర్ శరణ్ (33), రజ్వీందర్ సింగ్ (23) ఆదుకున్నారు. దీంతో పంజాబ్ జట్టు 57 ఓవర్లలో 206 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. తమిళనాడు బౌలర్లలో డిటి.చంద్రశేఖర్ 3 వికెట్లు, ఎం.రంగరాజన్, ఆర్‌ఎస్.షా రెండేసి వికెట్లు, జె.కౌశిక్ ఒక వికెట్ సాధించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు జట్టును పంజాబ్ బౌలర్లు గడగడలాడించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో తమిళనాడు ఘోరంగా విఫలమైంది. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జె.కౌశిక్ (30) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు చేయకుండానే పెవిలియన్‌కు పరుగు తీయడంతో ఆ జట్టు 23.4 ఓవర్లలో కేవలం 68 పరుగులకే కుప్పకూలింది. రంజీల్లో తమిళనాడుకు ఇది రెండవ అత్యల్ప స్కోరు. పంజాబ్ బౌలర్లలో రజ్వీందర్ సింగ్ అద్భుతంగా రాణించి కేవలం 29 పరుగులకే 6 వికెట్లు కైవసం చేసుకోగా, హర్భజన్ సింగ్ 3 వికెట్లు, ఎస్.లడ్డా ఒక వికెట్ అందుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ జట్టులో పర్గత్ సింగ్ 19 పరుగులు సాధించి రంగరాజన్ బౌలింగ్‌లో ముకుంద్‌కు దొరికిపోయాడు. అయితే ఓపెనర్ జీవన్‌జ్యోత్ సింగ్ (10), రజ్వీందర్ సింగ్ (0) అజేయంగా నిలువడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 36 పరుగులు రాబట్టిన పంజాబ్ జట్టు 174 పరుగుల ఆధిక్యత సాధించింది.