క్రీడాభూమి

ఢిల్లీ హాఫ్ మారథాన్ లెగెసె, లిమోకు టైటిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఇథియోపియాకు చెందిన బిర్హాను లెగెసె, కెన్యా అథ్లెట్ సింథియా లిమో ఆదివారం ఇక్కడ జరిగిన ఢిల్లీ హాఫ్ మారథాన్ రన్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో లెగెసె తన సహచరుడు మోసినెట్ జెరెమీ కంటే 25 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. తడెసె ఎరీకి మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో కెన్యా క్లీన్ స్వీప్ చేసింది. లిమో మొదటి స్థానాన్ని ఆక్రమించగా, హెలా కిప్రోప్, గ్లాడిస్ చెసిర్ వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు.
భారత్ తరఫున..
హాఫ్ మారథాన్‌లో పాల్గొన్న భారతీయుల్లో నితేంద్ర సింగ్ రావత్, లలిత బాబర్ పురుషులు, మహిళల టైటిళ్లను సాధించారు. రావత్ ఒక గంట, నాలుగు నిమిషాల, 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరగా, టి. గోపి, మహమ్మద్ యూనస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో బాబర్ ఒక గంట, 10 నిమిషాల 52 సెకన్లలో గమ్యాన్ని చేరింది. ఒపి జైషా, సుధా సింగ్ ద్వితీయ, తృతీయ స్థానాలను సంపాదించారు. ఈ ముగ్గురూ 2008లో కవితారావు ఒక గంట 17 నిమిషాల 12 సెకన్లతో స్థాపించిన రికార్డును అధిగమించడం విశేషం. బాబర్ కొత్త రికార్డు హోల్డర్‌గా గుర్తింపు సంపాదించింది.