క్రీడాభూమి

ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్.. సెమీస్‌కు అద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్ఘడా (ఈజిప్టు), నవంబర్ 20: ఈజిప్టులోని హర్ఘడాలో జరుగుతున్న ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. దీంతో భారత్‌కు ఈ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయమైంది. ప్రస్తుతం ఈ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో బరిలో నిలిచిన భారత ఆటగాడు అద్వానీ ఒక్కడే. కెరీర్‌లో 15వ సారి ప్రపంచ టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్న అద్వానీ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 6-0 (70-62, 112-0(57), 107(90)-14, 83(50)-46, 114(108)-12, 64-27) ఫ్రేముల తేడాతో మాల్టాకు చెందిన అలెక్స్ బోర్గ్‌ను మట్టికరిపించాడు. ఫైనల్‌లో స్థానం కోసం అద్వానీ గ్రెగ్ కాసీ (ఐర్లాండ్)తో గానీ, లూకాస్ క్లెకర్స్ (జర్మనీ)తో గానీ తలపడాల్సి ఉంటుంది.
క్వార్టర్స్‌లో రఫత్ హబీబ్ ఓటమి
అయితే ఈ చాంపియన్‌షిప్ మాస్టర్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ఏకైక భారత ఆటగాడు రఫత్ హబీబ్ మెడల్ రౌండ్‌కు చేరడంలో విఫలమయ్యాడు. క్వార్టర్ ఫైనల్‌లో అతను మాల్టాకు చెందిన జాసన్ పెప్లో చేతిలో ఓటమిపాలయ్యాడు.