AADIVAVRAM - Others

నేడు-రేపు (స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షీరాబ్దిజ తల్లిదండ్రులు ఆ ఆదివారం తమ బంధువుల గురించి మాట్లాడుకుంటున్నారు.
‘నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు. ఇద్దర్నీ సమానంగానే పెంచాడు. పెద్దవాడు కాఫీ పొడి షాప్ పెట్టుకుని తక్కువ సంపాదిస్తున్నాడు. రెండో వాడు సివిల్స్ పాసై రాష్ట్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు’ క్షీరాబ్దిజ తల్లి చెప్పింది.
‘తప్పు మీ తమ్ముడిది కాదు. ఆయన పెద్ద కొడుకుదే. సివిల్స్‌కి కూర్చోమని, ఒట్టి డిగ్రీతో మంచి ఉద్యోగం రాదని మీ తమ్ముడు ఎంత చెప్పినా వాడు వినలేదు’ భర్త చెప్పాడు.
‘పరీక్షలకి కూర్చున్నాడుగా?’
‘చదవకుండా వెళ్లి పరీక్ష రాయడం అంటే పరీక్షలకి కూర్చోకపోవడంతో సమానం అని నా ఉద్దేశం. అదే వాడి తమ్ముడు అహోరాత్రులు కష్టపడి చదివి మరీ పరీక్షలో నెగ్గాడు. దీన్నిబట్టి మనకో జీవిత సత్యం అర్థవౌతోంది’ క్షీరాబ్దిజ తండ్రి చెప్పాడు.
‘ఎవరి కర్మకి వారే బాధ్యులు. అవునా?’ ఆవిడ అడిగింది.
‘కాదు. అది వేదాంతం. నేను చెప్పేది ప్రాక్టికల్ లైఫ్ గురించి’
‘ఆ జీవిత సత్యం ఏమిటి నాన్నా?’ క్షీరాబ్దిజ ఆసక్తిగా ప్రశ్నించింది.
‘ఇందాక వాట్స్‌ఏప్‌లో నాకు వచ్చిన కొటేషన్ గుర్తొస్తోంది. మన జీవితం నిన్న పరచిన ఇటుకలతో నిర్మించబడుతుంది. ఈ రోజు మనం ఎంత బలంగా, సజావుగా ఇటుకలని పరచి గోడలు నిర్మిస్తాం అన్న దాన్నిబట్టి రేపు వచ్చే జీవితం నిర్ణయించబడుతుంది’
‘నాకు సరిగా అర్థం కాలేదు’ క్షీరాబ్దిజ చెప్పింది.
తల్లి సన్నగా నవ్వి అడిగింది.
‘నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాసులోకి వచ్చావు?’
‘్ఫర్త్‌క్లాస్’
‘ఈ క్లాస్‌లోకి రావడానికి నువ్వు ఎన్ని క్లాసులు పాసయ్యావు?’ మళ్లీ అడిగింది.
‘మూడు క్లాసులు’
‘గతంలో బలమైన గోడ కట్టడం అంటే ఇదే. ఇప్పుడు బాగా చదివి ఫోర్త్ కూడా పాసైతేనే ఫిఫ్త్‌లో చేరతావు’
‘అర్థమైంది. ఇదివరకు చేసిన దానికి ఫలితం ఈ రోజుకి కానీ కనపడదు. అలాగే ఈ రోజుకి చేసింది రేపెప్పుడో ఉపయోగపడుతుంది తప్ప ఇప్పుడు కాదు. అవునా?’ క్షీర చెప్పింది.
‘అవును. అరగంట తర్వాత, ఐదు గంటల తర్వాత, రేపో, ఎప్పుడో, అంటే ఇప్పుడు చేసేది భవిష్యత్తులోనే ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటికిప్పుడు ఫలితం ఉండదని చాలామంది భవిష్యత్తు కోసం చేయాల్సింది చేయకుండా కూర్చుంటారు. అది మూర్ఖత్వం అవుతుంది’ తండ్రి వివరించాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి