Others

శ్రద్ధగా స్పెషల్‌సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించినా సరైన కమర్షియల్ బ్రేక్‌ను అందుకోలేకపోయింది అందాల భామ శ్రద్ధాదాస్. పలు చిత్రాల్లో రెండో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భామ ఈమధ్య బాలీవుడ్‌లో కూడా ఓ చిత్రంలో నటించింది. మరోవైపు ప్రత్యేక పాటల్లో నర్తిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శ్రద్ధాదాస్ ‘డిక్టేటర్’ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ ప్రత్యేక పాట కోసం ఇలియానా, నయనతారలను చేయమన్నా. వారు కుదరదని చెప్పడంతో ఫైనల్‌గా ఆ ఛాన్స్ శ్రద్ధాదాస్‌కు దక్కింది. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్ ఈ అవకాశం కొట్టేయడంతో పాటు ఈ సినిమాపై కూడా భారీ ఆశలు పెట్టుకుంది.