జాతీయ వార్తలు

స్పీకర్ నిర్ణయం సరైందే.. కాని ఎన్నికల్లో పోటీ చేయవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే వారు 2023 వరకు పోటీ చేయకూడదంటూ నిషేధం విధించటాన్ని సమర్థించలేదు. అనర్హత విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని, వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, మంత్రి పదవులు కూడా చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అనర్హత అంశంపై హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించటంపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తప్పుపట్టింది. ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ ఏడాది జూలైలో కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా 17 మంది కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంలో ఆ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. మళ్లీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజకీయ సంక్షోభం తలెత్తినపుడు అప్పటి స్పీకర్ సురేశ్‌కుమార్ ఈ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటం, వారు 2023 ఎన్నికల వరకు పోటీ చేయటాన్ని నిషేధిస్తూ ప్రకటన చేయటం జరిగింది. స్పీకర్ ప్రకటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఏన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తయి అక్టోబర్ 25న తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. నేడు ఇచ్చిన తీర్పులో ధర్మాసనం వారి అనర్హత వేటును సమర్థిస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది.