జాతీయ వార్తలు

సోనియా కుటుంబ భద్రత ఎత్తివేతపై కాంగ్రెస్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సోనియా కుటుంబ సభ్యులకు ఇచ్చే ఎస్పీజీ భద్రత ఏత్తివేతపై ఈరోజు లోకసభలో కాంగ్రెస్ ఆందోళన చేసింది. సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకసభలో కాంగ్రెస్ విపక్ష నేత అధిర్ రంజన్ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఎస్పీజీ భద్రత తొలగించలేదని, ఇపుడు ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు. ఎస్పీజీ భద్రత తొలగింపుపై ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ప్రభుత్వం స్పందించక పోవటంతో సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి ఆందోళన చేశారు. ఇరవై మంది కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయారు. ఆ తరువాత వాకౌట్ చేశారు.