జాతీయ వార్తలు

చిదంబరాన్ని పరామర్శించిన సోనియా, మన్మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈరోజు తీహార్ జైలుకి వెళ్లి మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని పరామర్శించారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌లో విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేందుకు లంచం తీసుకున్న‌ట్లు చిదంబ‌రంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆగ‌స్టు 21వ తేదీన చిదంబ‌రాన్ని అరెస్టు చేశారు. సోనియా, మ‌న్మోహాన్ వ‌చ్చి త‌న‌ను క‌ల‌వ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చిదంబ‌రం వెల్ల‌డించారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో నేత‌ డి.శివ‌కుమార్ కూడా జైలులో ఉన్నారు.