Others

‘శివశంకరి.. శివానంద లహరి..’ - నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జగదేకవీరుని కథ’ చిత్రం చివరలో ఘంటసాల ఆలపించిన పూర్తి సంగీత భరితమైన ఈ పాట అందరూ ఇష్టపడేదే. శాప కారణంగా రాయిలా మారిన ఓ గంధర్వుడికి శాప విమోచనం చేయడంకోసం రాకుమారుడు సంగీతాన్ని పాడాల్సి వస్తుంది. సంగీతంతో రాళ్లు కరగాలి. పూర్వకాలంలో సంగీతంతో వర్షాలు కురిపించిన మహామహులను గురించి విన్నాం. అదేవిధంగా ఈ చిత్రంలో సంగీతంతో పెద్ద కొండరాయిని కరిగించే సవాలును కథానాయకుడు ఎదుర్కొంటాడు. ఒక వ్యక్తి వాయిద్యాలు వాయిస్తూ పాట పాడాలి. అదెలా సాధ్యం? అందుకే చిత్రంలో కథాపరంగా కథానాయకుడికి ఓ మంత్రాన్ని నేర్పించారు. అదే ‘ఓం.. నేకో హమ్మస్మీ’. ఈ మంత్రంతో సినిమాలో నలుగురు కథానాయికలతో ఆడిపాడిన హీరో, ఇక్కడా అదే మంత్రంతో ఐదుగురు వ్యక్తులుగా మారతాడు. ఒకరు గాయకుడిగా, మిగతా నలుగురూ వాద్య సహకారం అందించేవారుగా మారతారు. అంతటితో గాయకుడు మంద్రంగా సాకీని ఆలపిస్తూ శివశంకరి.. అని ప్రారంభిస్తాడు. అలా మంద్ర గోదారిలా ప్రారంభమైన ఆ గానం ప్రచండ గోదారిలా సాగడంతో ప్రకృతిలోని ప్రతి అణువణువూ పులకరిస్తుంది. ఆ గానానికి మేఘాలు వస్తాయి. రాళ్లు కరుగుతాయి. కొండ బండలో ఉన్న మునీశ్వరుడు కరిగి నీరై శాప విమోచనం పొందుతాడు. అలా ఈ చిత్రంలో ముగింపు సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. కథానాయకుడు ప్రతాప్ అమృతాన్ని కురియజేయుమా.. మహిమ చూపవా.. దీనపాలనము చేయవే అని ఆలపిస్తాడు. మానవుడు కాదు, మాధవుడు అనిపించుకునే రాగాలాపన ఈ పాటలో కనిపిస్తుంది. జగాలన్నిటినీ హాయి గొలిపేలా ఘంటసాల ఈ పాటను ఆలపించిన తీరు అత్యద్భుతం. దానికి తగ్గట్టు పెండ్యాల నాగేశ్వరరావు బాణీలను సమకూర్చిన విధానం అందరికీ నచ్చుతుంది. అందుకే ఈ పాటంటే నాకెంతో ఇష్టం. -సపారె దేవరాజ్, ఆదోని