రాష్ట్రీయం

బ్రాహ్మణ యువతకు నైపుణ్య శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దరఖాస్తులకు 30వ తేదీ గడువు

హైదరాబాద్, నవంబర్ 23: నిరుద్యోగ బ్రాహ్మణ యుతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపిలోని 13 జిల్లాల్లో గల నిరుద్యోగ బ్రాహ్మణ యువత ఈ శిక్షణ పొందవచ్చని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ వెంకట్ చెంగవల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ సైన్స్, లేదా ఐటిఐ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్‌లో ఉత్తీర్ణులైన వారికి సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్, నిర్వహణ విభాగంలో 25 రోజుల పాటు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో శిక్షణ అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి రిటైల్ ఇండస్ట్రీ విభాగంలో 12 రోజుల శిక్షణను విశాఖ, విజయవాడ, తిరుపతిలో, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్, ఇంటర్వూలను ఎదుర్కొనడం, ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి విభాగాల్లో 18 రోజుల పాటు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఎండి ఆ ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు మేనేజింగ్ సెల్ఫ్, మాస్టరింగ్ నాలెడ్జ్ (టెక్నికల్ సహా), ఇంటర్వ్యూలో ప్రతిభ చూపించడం వంటి విభాగాల్లో 15 రోజుల పాటు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఐటి/సిఎస్‌ఇ) అభ్యర్థులు తమ కోర్ సబ్జెక్టులకు సంబంధించి 45 రోజుల పాటు అమలాపురం, విజయవాడ, విశాఖ, తిరుపతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (జావా, డాట్‌నెట్, టెస్టింగ్), కమ్యూనికేషన్, అప్టిట్యూడ్ విభాగాల్లో 18 రోజుల శిక్షణను విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో ఇవ్వనున్నట్లు ఎండి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. www.andhrabrahmin.org వెభ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను పంపించాలని సూచించారు.