రివ్యూ

మొదటి భాగమే.. హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** సైజ్ జీరో (ఫర్వాలేదు)

తారాగణం:
అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, ఊర్వశి, ప్రకాష్‌రాజ్, అలీ, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, అడివి శేషు తదితరులు
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాత: పరమ్ వి.పొట్లూరి
దర్శకత్వం:
ప్రకాష్‌రావు కోవెలమూడి

భారీ బడ్జెట్ సినిమాలు చూశాం. భారీ తారాగణం ప్లస్ మల్టీస్టారర్ మూవీస్‌కి జేజేలు పలికాం. భారీకాయం సినిమాల్ని తరచి విశే్లషించాం. కానీ- అనుష్కలాంటి జేజెమ్మ గ్లామర్‌ని పక్కనబెట్టి -డీగ్లామర్‌గా ఎవరికీ నచ్చని ‘ఎక్స్‌ఎక్స్‌ఎల్’లోకి మారిందంటే- ఆ పాత్రపట్ల ఆమెకున్న డెడికేషన్‌కీ జేజేలు చెప్పేద్దాం. భారీకాయం తాలూకు కథలు మనకి కొత్తేంకాదు. ఊబకాయం నీడల వెనుక -కష్టాలూ కన్నీళ్లూ.. ఏడుపులూ పెడబొబ్బలూ.. బోలెడన్ని సెంటిమెంట్ సీన్లూ.. ఉన్నప్పటికీ వాటిలో ‘హాస్యాన్ని’ వెతుక్కున్నాం. హాయిగా నవ్వుకొన్నాం. సరిగ్గా -రచయిత్రి మనోభావాల్లో మెదలిన ఒకానొక ‘సజీవ’ పాత్ర ఛాయ ఈ కథకి జీవం పోసింది. కాకపోతే- టైటిల్ ప్రకారం ‘సైజ్ జీరో’ ఉత్కంఠత పోనుపోను సామాజిక సమస్యగా మారటం జీర్ణించుకోలేని అంశం. అయినప్పటికీ -కొత్త కానె్సప్ట్‌గానూ.. ఒబెసిటీ సమస్యని భూతద్దంలో చూపి పబ్బం గడుపుకొనే హెల్త్ సెంటర్లని ఎండగట్టే ప్రయత్నంవల్ల కథ కథకాకండా పోయింది.
‘సైజ్ జీరో’ అంటే స్లిమ్‌గా.. చూడచక్కంగా ఉండే అమ్మాయి ఊహల్లో మెదలుతుంది. పోస్టర్లపై ఓ తొంభై కేజీల బోండాం దర్శనమిస్తే.. కీమా సమోసా తినటం మాటేమోగానీ.. ఉన్నపళంగా ఆ అమ్మాయి సాదాసీదా ‘అనుష్క’గా మారితే బావుణ్ణు, చూళ్లేక పోతున్నాం... అని తీర్మానించుకొని -్థయేటర్‌లోకి కేవలం అనుష్కవైపు మాత్రమే చూస్తే.. బతికిపోతారు. అంతేగానీ -కథేంటి? ఎక్కడ్నుంచీ ఎక్కడి వెళ్తోంది? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటి? కథా కమామీషు ఏమిటి? లాంటి సిల్లీ క్వొశ్చన్ల జోలికి వెళ్లకుండా ‘స్లిమ్’గా చూసేస్తే -హెల్త్ సెంటర్‌కి వెళ్లే బాధ తప్పుతుంది.
కథేంటో?
చిన్ననాటి నుంచీ ముద్దుగా బొద్దుగా.. ఆ...రోగ్యంగా ఉండే స్వీటీ అలియాస్ సౌందర్య (అనుష్క) -పెళ్లీడుకొచ్చేసరికి గుమ్మాలు పట్టనంతగా మారుతుంది. దీంతో వచ్చే పెళ్లికొడుకులంతా వెనక్కి వెళ్లిపోతూంటారు- బిత్తర చూపుల్తో. సౌందర్య పెళ్లి ‘్భరీ’ సమస్య అవుతుంది. కానీ- కీమా సమోసాలాంటి రాకుమారుడెవడో ఒకడు తన కోసం పుట్టి తపస్సు చేస్తూంటాడని సౌందర్య ఆలోచన. ఈ తతంగంలోనే -అభి (ఆర్య) పెళ్లిచూపులకు వస్తాడు. అతడొక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఇన్నాళ్లూ పెళ్లికొడుకులంతా సౌందర్యని రిజెక్ట్ చేస్తే.. ఏ కారణం లేకుండానే -అభిని రిజెక్ట్ చేస్తుంది సౌందర్య. కాకపోతే -తెలిసిన కుటుంబాలు కావటంవల్ల అభి-సౌందర్య మంచి నేస్తాల్లా మారతారు. రాన్రానూ అభిపట్ల ఉన్న అభిమానం సౌందర్య ఆలోచనల్లో ప్రేమగా రూపాంతరం చెందుతుంది.
ఈ తరుణంలోనే అభి -సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) ప్రేమలో పడతాడు. ఆమె ఒక ఎన్జీవో. అభి తీసిన డాక్యుమెంటరీ నచ్చడంతో ఇండియా వచ్చి అభితో కలిసి పనిచేయటానికి సిద్ధపడుతుంది. అది కాస్తా వీరిద్దరి ప్రేమకు దారితీస్తుంది. -మధ్యలో సౌందర్య పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. వచ్చిన పెళ్లికొడుకులకు తను నచ్చక.. నచ్చినవాడు మరో అమ్మాయి ప్రేమలో పడటంతో.. ఏదేమైనా -‘స్లిమ్’గా తయారై.. అభి దృష్టిని తనవైపు మళ్లించుకోవాలని తీర్మానించుకొంటుంది సౌందర్య.
ఉన్నపళంగా తొంభై కేజీల భామ... యాభై కేజీలకు పడిపోవటం ఎలా? సింపుల్.. తక్కువ టైంలో ‘స్లిమ్’గా మార్చే సైజ్ జీరో ట్రైనింగ్ క్లాస్‌లో చేరుతుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ ట్రైనర్ సత్యానంద్ (ప్రకాష్‌రాజ్). కొద్ది సమయంలో అక్కడ జరిగే మోసాలను పసిగడుతుంది. తక్షణ కర్తవ్యంగా సత్యానంద్‌పై యుద్ధం ప్రకటిస్తుంది. దీనికిగాను అభి, సిమ్రాన్‌లు కూడా అండగా నిలుస్తారు. సౌందర్య ‘సైజ్ జీరో’గా మారిందా? సత్యానంద్ మోసాలను బట్టబయలు చేసిందా? అభిని పెళ్లికి ఒప్పించిందా? లాంటి ప్రశ్నలన్నీ చివరాఖరుకి.
ఇప్పటివరకూ చూసిన అనుష్క వేరు. జేజెమ్మ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తోనూ.. రుద్రమదేవి, బాహుబలి లాంటి చిత్రాల్లో ఆమె కనబరచిన నటనగానీ.. చూసి తీయటి అనుభూతికి లోనైన ప్రేక్షకులు ‘సైజ్ జీరో’లో డిఫరెంట్ అనుష్కని చూస్తారు. కథ కూడా ఎంతో సాఫ్ట్‌గా మొదలై.. ఇంటర్వెల్ వరకూ తెగ ‘ఉబ్బేసి’ సెకండాఫ్‌కి వచ్చేప్పటికి ‘జీరో’గా మారింది. కానె్సప్ట్ ప్రకారం -ఎక్స్‌ఎక్స్‌ఎల్ బాడీని ఎవరు పెళ్లి చేసుకొంటారు? అన్నది. దీన్ని మరికాస్త డెవలప్ చేసుకుంటూ -కామెడీని సెకండ్ హాఫ్‌లోనూ పండిస్తే ‘కథ’ వేరే విధంగా ఉండేది. ఐతే -ఇప్పటివరకూ అనుష్క చేసిన కేరెక్టర్లన్నీ ఒక ఎతె్తైతే, ఇది వెరైటీ కేరెక్టర్. పూర్తిస్థాయి హాస్యాన్ని పంచుతూనే.. సెంటిమెంట్‌గా.. అక్కడక్కడ ఆలోచింపజేసే మాటల్తో అనుష్క సినీ ‘్భరాన్నంతా’ తనపైనే వేసుకొంది. ఆర్య క్యారెక్టర్ అంతగా ప్రభావితం చూపదు. అలాగే సోనాల్ కూడా. గ్లామర్ పరంగా ఓకే. ఆఖరున నాగార్జున, రానా, బాబీ సింహా, జీవా, తమన్నా, హన్సిక, శ్రీవిద్య, మంచు లక్ష్మి కనిపించటం కొసమెరుపు.
ఇక టెక్నికల్‌గా చూస్తే -అనుష్కని ‘బొద్దు’గా చూపించటంలో నిరవ్ షాహ్ ప్రత్యేకత చెప్పుకోదగ్గది. కాకపోతే -అనుష్కని చూస్తూంటే ‘్భరీ’గా ఉందన్న భావన కలగదు. ఇదే ఈ సినిమాకి మైనస్ -ప్లస్ పాయింట్ కూడా. అనుష్కని భారీగా చూట్టానికి ఇష్టపడని ప్రేక్షకుల మదిలో ‘జేజెమ్మ’ పర్సనాలిటీ ఫిక్స్ కావటం -లేదూ రుద్రమదేవిని చూసిన కళ్లతో ‘సైజ్ జీరో’గా అనిపించదు. విజువల్సన్నీ కలర్‌ఫుల్‌గా ఉండటంతో కథలేని లోటు కనిపించదు. కిరణ్ మాటలు బాగున్నాయి. దర్శకత్వ పరంగా -సినిమాలో సెకండ్ హాఫ్‌ని వదిలేశాడు. ఫస్ట్ హాఫ్‌లో చూపిన స్క్రీన్‌ప్లేగానీ.. కామెడీగానీ సెకండ్ హాఫ్‌లోనూ చూపించినట్లయితే ఈ సినిమాకి ‘జీరో’ మార్కులు తప్పేవి. ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అనుష్క అంటే ప్రాణం పెట్టే వారుంటే -కచ్చితంగా సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కథని పక్కన పెట్టాలి.

-ప్రనీల్