జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలన ముసుగులో బీజేపీ బేరసారాలు:శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి:మహారాష్టల్రో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్న వేళ పాత మిత్రులు బీజేపీ-శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ మూడు పార్టీల కూటమి అధికారాన్ని చేపట్టినా ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదని మాజీ సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఫడ్నవీస్‌పై విరుచుకుపడింది. కొత్త సమీకరణలు కొందరికి కడుపుబ్బరాన్ని కలిగిస్తున్నాయని ఎద్దేవా చేసింది. అలాగే తమకు 109 మంది సభ్యుల మద్దతు ఉందని త్వరలో తామే అధికారిన్ని చేపడతామని బీజేపీ అధ్యక్షుడు పాటిల్ చేసిన వ్యాఖ్యలపైన ఆ పత్రికలో ధీటైన సమాధానం వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తే 105 మంది సభ్యులు ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపించి ఇపుడు పారదర్శకత పాలన అందిస్తామని ఎలా చెబుతారని సామ్నాలో ప్రశ్నించింది. అనైతిక విధానాలు మహారాష్టల్రో చెల్లవని పేర్కొంది. 'రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ బేరసారాలకు దిగుతోంది' అంటూ ఆరోపించింది.