ఆంధ్రప్రదేశ్‌

శివ తాండవం సాక్షాత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూన్ 19: గర్భాలయంలో కొలువైన శివయ్య లింగ స్వరూపంపై శివుని రూపం సాక్షాత్కరించడం భక్తులను పరవశింపచేసింది. పాలతో అభిషేకించిన శివలింగాన్ని నీటితో కడిగే సమయంలో ఈ అద్భుత రూపం దర్శనమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూరల లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ఈ వింత చోటుచేసుకుంది. గ్రామంలో గత ఏడాది మార్చి 25న శ్రీ పార్వతీ సమేత నాగమల్లేశ్వరస్వామివారి ఆలయం నిర్మించి, శివదేవుని ప్రతిష్ఠించారు. శని త్రయోదశి పర్వదినం కావడంతో శనివారం స్వామివారికి సాయంత్రం వరకు విశేష అభిషేకాలు జరిపి ఆలయం మూసివేశారు. ఆదివారం ఉదయం ఘంటా నరసింహమూర్తి అనే భక్తుడు తీసుకొచ్చిన పాలతో ఆలయ అర్చకుడు శివలింగానికి అభిషేకంచేశారు. అనంతరం లింగ స్వరూపాన్ని నీటితో ప్రక్షాళన చేసే సమయంలో తాండవ శివుని రూపం కన్పించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విషయాన్ని పండితులకు తెలిపారు. రుద్రభూమిలో శివాలయం నిర్మించడం వల్ల సాక్షాత్తు పరమశివుడే ఇలా దర్శనమిచ్చాడని, కొబ్బరినీరు, తేనె, ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకిస్తే స్వామివారి రౌద్రరూపం అదృశ్యమవుతుందని తెలిపారు. అలా చేసినా స్వామివారి రూపం కన్పిస్తూనే ఉండడంతో విషయం తెలుసుకున్న పలువురు భక్తులు జిల్లా నలుమూలల నుండి తరలివస్తున్నారు.

వైభవంగా ముగిసిన
శ్రీవారి జ్యేష్ఠ్భాషేకం
తిరుమల, జూన్ 19: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక జ్యేష్ఠ్భాషేక మహోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. కాగా తొలిరోజు వజ్రకవచంలో, రెండో రోజు ముత్యపు కవచంలో భక్తులను అలరించిన శ్రీ మలయప్ప స్వామివారు మూడోరోజు స్వర్ణకవచ ధారియై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలోని యాగశాలలో మహాశాంతి హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటు తరువాత శ్రీ మలయప్ప స్వామివారికి, ఉభయదేవేరులకు స్నపన తిరుమంజనం మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. తొలుత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు చివరగా పసుపుతో ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో జరుగు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.