AADIVAVRAM - Others

సంగీత వాయద్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణ
కర్ణాటక సంగీతంలో ప్రముఖ స్థానం వహించేది వీణ. వీణలో రుద్రవీణ, మహానాటక వీణ, విచిత్ర వీణ, చిత్రవీణ వంటి రకాలున్నప్పటికీ ప్రస్తుతం ప్రాచుర్యంలోనూ, వాడుకలోనూ ఉన్నది సరస్వతి వీణ. ఇందులో 24 మెట్లు, నాలుగు ప్రధాన తీగెలు ఉంటాయి. నేల మీద బాసింపట్టు వేసుకుని కూర్చొని మాత్రమే వీణ వాయించగలం. వీణ గుర్తు చేసుకోగానే మన కళ్ల ముందు కదలాడేది వీణ వాయిస్తున్న సరస్వతీ దేవి రూపం.
మృదంగం
దక్షిణ భారతదేశానికి చెందిన వాయిద్యం మృదంగం. కర్ణాటక శాస్ర్తియ సంగీతంలో ప్రసిద్ధమైన పక్క వాయిద్యం మృదంగం. మృగ్ అంటే మట్టి లేదా భూమి. అంగ్ అంటే అంగం. శరీర భాగం అని అర్థం. మృదంగం రెండువైపులా శబ్దాన్ని పలికించగలిగే డ్రమ్ము. పురాణ కాలంలో పరమశివుడు తాండవ నృత్యం చేసినప్పుడు వినాయకుడు, నంది లాంటి వారు ఈ మృదంగాన్ని వాయించారని ప్రతీతి. అందుకే ఇది దేవవాయిద్యంగా ప్రసిద్ధి చెందింది.
సితార
పశ్చిమ దేశాల్లో అందరికీ బాగా తెలిసిన భారతీయ సంగీత వాయిద్య సితార. మధ్యయుగాల నుండీ హిందుస్థానీ శాస్ర్తియ సంగీతంలో సితార వాడకం మొదలైంది. పండిట్ రవిశంకర్ పశ్చిమ దేశాల్లో బీటిల్స్ లాంటి పాపులర్ రాక్ గ్రూపుల సహాయంతో భారతీయ సంగీతాన్ని పరిచయం చేయడం వలన వారికి సితార గురించిన అవగాహనతోపాటు అభిరుచి కలిగింది. విలక్షణమైన సితారలో 18, 19 లేదా 20 వరకూ తీగెలుంటాయి.
తబలా
హిందుస్థానీ శాస్ర్తియ సంగీతంలో ప్రధాన వాయిద్యం తబలా. శాస్ర్తియ సంగీతంలోనూ, పాపులర్ సంగీతంలోనూ, మతపరమైన భజనల్లోనూ ఇలా అనేక సంగీత కార్యక్రమాలలో తబలా సహకారం మరువలేనిది. 13వ శతాబ్దానికి చెందిన ముస్లిం పర్షియన్ కవి అమీర్‌ఖుస్రో మృదంగాన్ని రెండు భాగాలుగా విడగొట్టి ఈ తబలాని కనిపెట్టాడని ప్రతీతి. మతపరమైన ముద్ర నుండి ఈ తబలా వాయిద్యం అందరికీ ఇష్టమైన సంగీత వాయిద్యంగా ప్రాచుర్యాన్ని పొందింది.

-పి.వి.రమణకుమార్