శిప్ర వాక్యం

నియంతల రాజ్యం.. వ్యక్తిస్వేచ్ఛ మృగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల ఒకటవ తేదీన చైనాలో ఒక సంఘటన జరిగింది. సన్‌వెన్ గ్యాంగ్ అనే ఓ విశ్రాంత విద్యావేత్త టెలివిజన్ ఇంటర్వ్యూలో చైనా ప్రభుత్వ విధానాలపై తన విశే్లషణ ఇస్తూ పాలకుల చర్యలను తీవ్రంగా విమర్శించాడు. అంతే..! సన్‌వెన్ గ్యాంగ్ అతని ఇంట్లో నుంచి ఆకస్మికంగా అదృశ్యమైపోయాడు. ఈ సంఘటన షన్‌డాంగ్ రాష్ట్రం తూర్పు ప్రాంతంలోని జీవన్ పట్టణంలో జరిగింది. సన్ వయస్సు 85 సంవత్సరాలు. గ్యాంగ్ అదృశ్యమైన సంగతి ప్రపంచానికి తెలిసి ఉండేదే కాదు. కానీ, టెలివిజన్ ప్రోగ్రాం నడుస్తూ ఉండగా మధ్యలో అతనిని రెడ్‌ఆర్మీ అరెస్టుచేయటం వల్ల టి.వి. కెమెరాల్లో అది రికార్డు అయింది.
ఎనిమిది మంది రెడ్ ఆర్మీకి చెందిన వ్యక్తులు సన్‌ను పట్టుకోవడానికి రాగా ఆయన- ‘నాకు వాక్ స్వాతంత్య్రం ఉంది- నా అభిప్రాయాలు నన్ను చెప్పనివ్వండి’ అని తన వాదన వినిపించాడు. అవే ఆయన చివరిగా రికార్డు చేసిన మాటలు. ఆ తర్వాత టీవీ స్క్రీన్ మీద సన్ అదృశ్యమైపోవడంతో వీక్షకులు విస్మయం చెందారు. చైనా ఆఫ్రికాలో చెక్‌బుక్ దౌత్యం ప్రారంభించింది. దానిని సన్ వ్యతిరేకించాడు. ‘మన దేశ ప్రజలకు తినడానికి తిండి లేదు. మా డబ్బు ఆఫ్రికాలో కుప్పలుగా పోయటం ఏమిటి?’ అని సన్ ప్రశ్నిస్తూ ఒక నెలక్రితం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఒక లేఖ వ్రాశాడు. పాలకుల ఆర్థిక విధానం చైనా దేశాన్ని ముంచుతుందని సన్ తన ప్రసంగంలోను, లేఖలోను పేర్కొన్నట్లు ఎ.ఎఫ్.పి వార్తాసంస్థ భోగట్టా. ఇంతపాటి విమర్శకు కూడా నియంత అయిన జిన్‌పింగ్ భరించలేకపోయాడు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆఫ్రికాకు బయలుదేరుతున్న సమయంలో ఈ చర్చా కార్యక్రమాన్ని వి.ఓ.ఏ టీవీ చానల్ నిర్వహించింది. ఈ సంఘటన భారతదేశంలో ఎంతమంది దృష్టికి వచ్చిందో తెలియదు. కానీ, ఇందులో రెండు ప్రధానాంశాలు ఉన్నాయి. ‘వెదురు తెరల వెనుక’ ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలియటం లేదు.. చైనాలో వ్యక్తిస్వేచ్ఛ లేదు. భావస్వేచ్ఛ లేదు. మన దేశంలోని వామపక్ష నేతలు ఏచూరి సీతారాం, ప్రకాశ్ కారత్, తమ్మినేని వీరభద్రం, బి.వి.రాఘవులు, బృందా కారత్ చెబుతున్నట్లు ‘చైనా భూలోక స్వర్గం’ కానే కాదు. ఐతే ఈ విషయాలు బయటకు పొక్కకుండా అక్కడి నియంతలు జాగ్రత్తపడుతుంటారు. రష్యాలో 1970వ దశకంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తున్నది. అధ్యక్షుడు నికితా కృశే్చవ్ ఒక సభలో ఉపన్యసిస్తున్నాడు. అప్పుడు శ్రోతల నుండి ఒక ఉత్తరం ఆయన వద్దకు వచ్చింది. ‘నీవు స్టాలిన్ ముందు బట్టలు విప్పుకొని డాన్సుచేసిన మాట నిజమా? కాదా? బుల్గానిన్‌కు తొత్తుగా ఎందుకు వ్యవహరించావు?’ అని ఆ లేఖలో ఉంది. కృశే్చవ్ ఆ ఉత్తరాన్ని చదువుకొని వెంటనే ‘ఈ లేఖ వ్రాసింది ఎవరో లేచి నిలబడండి’ అని ప్రశ్నించాడు. అక్కడ ఉన్న వారిలో ఎవరూ నిలబడలేదు. అప్పుడు కృశే్చవ్ ఇలా అన్నాడు. ‘నీవు ఎందుకు నిలబడ లేదో నాకు తెలుసు- బుల్గానిన్ ముందు గెంతవలసి వచ్చింది. నికితా కృశే్చవ్ చనిపోయిన తర్వాత ఆ వార్త భారతదేశానికి చేరింది. కాని దాదాపు ఆరునెలల తర్వాత కాని సోవియట్ రేడియో తమ దేశ ప్రజలకు ఆ వార్తను తెలియజేయలేదు. ఈ వాస్తవాలు చరిత్రలో నిక్షిప్తమైనాయి. రష్యా ప్రభుత్వాన్ని ‘ఇనుప తెరల వెనుక’ అంటారు. చైనా ప్రభుత్వాన్ని ‘వెదురు తెరల వెనుక’ అంటారు.
మరి భారత్ మాటేమిటి?
1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువుకావడంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. వెంటనే ఆమె దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాజ్యాంగం ప్రసాదించిన 19ఎ-బి అధికరణలను రద్దుచేసి, ప్రజలకు వాక్‌స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం లేకుండా చేసింది. కొన్ని వేలమందిని జైళ్ళలో పెట్టించింది. అలా జైలుపాలైన వారిలో రచయితలు, మేధావులు, ప్రజాస్వామ్య ప్రియులు ఎంతోమంది ఉన్నారు. ఇందిరమ్మ ఇంతకీ ఇంత దుర్మార్గం ఎందుకు చేసింది? .. ఇది నియంతల లక్షణం. ఫాసిజం, కమ్యూనిజం, మిలటరీ డిక్టేటర్ షిప్ అనేవి పర్యాయ పదాలు.
పేద ప్రజల కోసం ఫ్రెంచి విప్లవం వచ్చింది. ఆ తర్వాత అంతకన్నా భయంకరమైన నెపోలియన్ బోనపార్టీ నియంతృత్వం వచ్చింది. రష్యాలో 1977 తర్వాత, చైనాలో 1948 ఇలాగే జరిగింది. ఆయా దేశాల ప్రజలు పొగనుండి సెగలోకి పోయారు. వారి ఆర్థిక వ్యవస్థ పెనం మీది నుండి పొయ్యిలోకి చేరినట్లయింది. ఐనా ఈ విషయాలను కమ్యూనిస్టు నేతలు బాహ్య ప్రపంచానికి తెలియనివ్వరు. ఇది నియంతల దుర్మార్గం. అందుకే 1990 రష్యా విచ్ఛిన్నమైపోయింది. చైనా తన అంతర్గత బలహీనతలను తిరుగుబాట్లను తప్పించుకోవటం కోసం, ప్రజల దృష్టిని మళ్లించటం కోసం దక్షిణ సముద్రం వద్ద ఘర్షణలు సృష్టించి జపాన్‌పై తిరగబడింది. టిబెట్‌లో బ్రహ్మపుత్రపై భార జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించింది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాలను ముంచబోతున్నది. జల విద్యుత్ ప్రాజెక్టుతో విధ్వంసం 2019 తర్వాత జరుగుతుందని ఇంజనీర్లు చాలా కాలం క్రితమే విశే్లషించారు. ఇలాంటి భయంకరమైన వివరాలు పత్రికలలో ఎందుకు రావటం లేదు? చైనా నియంతలు, వారికి దాసోహమైన ఎల్లో జర్నలిస్టులు ఇలాంటి వార్తలను అణచివేస్తున్నారు.
కాగా, భారత దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. ఇక్కడ రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎవరైనా తిట్టవచ్చు. ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీని విపక్షాల వారు ఎంత నీచంగానైనా నోరారా తిట్టవచ్చు. జంతువులతో పోల్చవచ్చు. రాజకీయాల్లో తమకు పడని నేతలను వారి ప్రత్యర్థులు ఎన్ని మాటలైనా అనవచ్చు. ఎలాంటి నిందలైనా వేయవచ్చు. ఇది మన భారత్‌లో ఉన్న వ్యక్తిస్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ. హద్దులు లేని స్వేచ్ఛ.
మన దేశంలో హిందువుల దేవుళ్లను, పురాణాలను ఎవరైనా విమర్శించవచ్చు. పురాణాల్లోని ప్రసిద్ధ పాత్రలను ఎగతాళి చేయవచ్చు. హిందువుల మనోభావాలను కించపరుస్తూ పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాయవచ్చు. ‘ఇది హిందూ సంస్కృతి కాదు, పంది సంస్కృతి’ అన్నాడు ఓ మార్క్సిస్టు రచయిత. ‘్భరతమాతను కారం దంచిన రోకలిలో దంచండి’ అన్నాడో దిగంబర కవి. హిందువులు ఆరాధించే సీతాదేవిని, ద్రౌపదిని, సావిత్రిని అసభ్య పదజాలంతో ఎవరైనా తిట్టవచ్చు. రామాయణ విషవృక్షాలు వ్రాయవచ్చు. కులం పేరిట దూషిస్తూ కొందరు రచనలు చేసినా వామపక్ష మేధావులు, కుహనా లౌకికవాదులు వౌనం వహిస్తారే తప్ప, అలాంటి తప్పుడు రాతలను ఖండించరు.
ప్రధాని నరేంద్ర మోదీని నూటొక్కసార్లు తుపాకీతో కాల్చి చంపండని ఆ మధ్య పత్రికా విలేఖరుల సమావేశంలో సిపిఐ ఆలిండియా సెక్రటరీ కె.నారాయణ ఆవేశంగా అన్నారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ, చైనాలో పాలకులను విమర్శించినందుకు ఓ వ్యక్తిని అదృశ్యం చేశారు. ఆఫ్రికాతో ఆర్థిక ఒప్పందం నచ్చటం లేదని చిన్న విమర్శ చేసినందుకు సన్ చైనాలో అదృశ్యమైపోయాడు. ‘మాకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావాలి’ అని చైనాలో గతంలో శాంతియుత సత్యాగ్రహం చేసిన ఆందోళనకారులను రెడ్ ఆర్మీ కాల్చి చంపింది. ‘మాకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనా పద్ధతి పనికిరాదు’ అని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది.
‘మా దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదు. సైనిక పాలన చాలా మంచిది’ అని గతంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ సైతం ప్రకటించారు. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను మన నాయకులు దుర్వినియోగం చేసుకుంటున్నారు. లేకుంటే నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద తిరుగుతున్న రాహుల్ గాంధీని భారత ప్రధాని చేయాలని కాంగ్రెస్ వారు కోరుకుంటున్నారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్ సహా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన 2 కోట్ల మంది చొరబాటుదార్ల ఓట్లతో భారత ప్రధాని కావాలని కోరుకుంటోంది. ఇలాంటి విషయాలపై ఆలోచించే తీరిక మన నేతలకు, ప్రజలకూ ఉండడం లేదు.
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్