శిప్ర వాక్యం

గుడికి వెళ్లేవారంతా హిందువులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు తరుచుగా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. అమెరికాలోని చికాగో నగరంలో లతామంగేష్కర్ రోడ్డు ఉంది, ఆఫ్రికాలో మహాత్మా గాంధీ వీధి ఉంది.. అలాంటప్పుడు న్యూ ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు, అక్బరు రోడ్డు ఉంటే తప్పేమిటి? అని.. ఈ తర్కం నిజంగా అజ్ఞాన జనితం అనాలి. ఎందుకంటే లతామంగేష్కర్ ఒక సినిమా గాయని. ఆమె రాగాలను అభిమానించే వారు చికాగోలో ఉండవచ్చు, చైనాలోను ఉండవచ్చు. అలాగే గాంధీజీ శాంతిదూత, అహింసా జ్యోతి. ఆయనపై గౌరవం గలవారు ఎవరైనా ఏ దేశంలోనైనా గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. కాని- ఈ బాబరు ఎవరు? ఎక్కడి నుండో ఇండియాకు వచ్చి ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసి, మన సంపదను తన దేశానికి తరలించుకొని పోయినవాడు. అక్బరు, ఔరంగజేబు, స్టాలిన్, లెనిన్, మావో సేటుంగ్, హిట్లర్ వీరంతా నర హంతకులు- వారి పేర్లమీద స్మృతి చిహ్నాలేమిటి?
ప్రశ్న: దుర్మార్గులు హిందువులలో మాత్రం ఉండరా?
జవాబు: ఉన్నారు. అందుకే ఏ తల్లి కూడా తన సంతానానికి కంసుడు, రావణాసురుడు వంటి పేర్లు పెట్టుకోదు. లంకేశ్వరన్ వంటి పేర్లు పెట్టుకుంటున్నారు. అంతేకాదు మోహిసిన్, అక్బర్, ఇబ్రహీం వంటి పేర్లు పెట్టుకుంటున్నారు. వీరెవరూ ఈ దేశానికి, ఇక్కడి సంస్కృతికి చెందిన వారు కాదు. యూదులు అనే ఒక జాతికి వీరు నాయకులు.
ప్రశ్న: ఏసుప్రభువు శాంతి దూత. ఆయన పేరు పెట్టుకుంటే తప్పేమిటి?
జవాబు: ఏసు, బుద్ధుడు, బసవన్న, గాంధీ, దలైలామా వీరు శాంతి దూతలే. ఐతే ఏసు పేర అంతర్జాతీయ ఎవాంజిలికల్ సామ్రాజ్యవాదం వ్యాపించింది. అంటే ప్రపంచంలో ఏసు మాత్రమే దేవుడు- బైబిలు మాత్రమే ఏకైక సిద్ధాంత గ్రంథం. అంతకుమించి మరొకటి ప్రపంచంలో ఉండరాదు- అనే దానిని ‘్ఫండమెంటలిజం’ అంటారు. దానికే మత వ్ఢ్యౌం అని పేరు. వాటికన్‌లోని పోప్ చాలాసార్లు- ‘ప్రపంచంలో ఎన్నో గొర్రెలు తప్పిపోయినవి- వాటిని రక్షించవలసిన బాధ్యత మనపై ఉన్నది’అని ప్రకటించాడు.
ఇదే ఫండమెంటలిజం కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలోనూ ఉంది. ఆయన రాసిన ‘దాస్ కాపిటల్’ మాత్రమే ప్రమాణ గ్రంథం. మార్క్సు మాత్రమే ఏకైక రక్షకుడు. సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం పొందాలి- దీనికి ప్రత్యామ్నాయం లేదు- ఇలా ఆయన ప్రచారం సాగింది. ఇస్లాంలో కూడా ఖురాన్ మాత్రమే పరమగ్రంథం. మహమ్మదు ప్రవక్తను మాత్రమే నమ్మాలి- అలా చేయని వారిని హింసించండి అని ఇస్లాం బోధించింది.
ప్రశ్న: హిందువులలో వైష్ణవులు, శైవులు, బౌద్ధులు, జైనులు లోగడ కొట్టుకున్నారు కదా?
జవాబు: నిజమే అది మత వ్ఢ్యౌమే. అది అవైదికం. ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్న పరమ సత్యం ఒక్కటే. దానిని పండితులు అనేక మార్గాల్లో వ్యాఖ్యానించారని ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. అంటే హిందువులకు శివుడు, విష్ణువు, సూర్యుడు, హనుమంతుడు, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, రాముడు, కృష్ణుడూ ఇలా ఎందరో దేవీదేవతలున్నారు. వీరు గాక ఎందరో సిద్ధపురుషులు, గురువులు ఉన్నారు. వారిని కూడా ప్రజలు గౌరవిస్తారు.
ప్రశ్న: సిద్ధపురుషులు అన్ని మతాలలోను ఉన్నారు..
జవాబు: వారిని భారతీయులు గౌరవించారు. ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ సమాధి ఉంది. కాని ఆఫ్ఘనిస్థాన్‌లో బుద్ధుని అతిపెద్ద విగ్రహాన్ని నేలకూల్చారు. ఇటీవల ‘సూడో అంబేద్కరిస్టులు’ హిందువులను హింసించటం, అవమానించటం మాత్రమే కాదు.. హిందూ వారి ధర్మగ్రంథాలను తగలబెట్టటం మొదలుపెట్టారు. దీన్ని కూడా ఫండమెంటలిజం అంటారు.
ఈ ఏడాది మార్చి 25న తెలంగాణలోని నిర్మల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారి విగ్రహం ఊరేగింపుపై ఇతర మతస్థులు దండయాత్ర చేశారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇలా చరిత్రలో కొన్ని వేలసార్లు జరిగింది. క్రూసేడర్లు, జీహాదీలు, కమ్యూనిస్టులు ఇలా విధ్వంసానికి దిగుతుంటారు. వారికి తమ మతం తప్ప, పరమతాలను సహించే ధోరణి ఉండదు. శ్రీరంగం శ్రీనివాసరావు వంటి కవులు అరవింద యోగి వంటి మహాపురుషులను నిందించటం తెలిసిందే.
ప్రశ్న: హిందువులు సహనశీలురు. కాబట్టి ఓర్పు వహించాలి..
జవాబు: నిజమే- ఐతే నిన్ను చంపడానికి ఎదుటివాడు తుపాకీతో వస్తుంటే చూస్తూ ఊరుకోవటం సహనం అనిపించుకోదు. పిరికితనం అవుతుంది. దీనిని స్వతంత్ర వీర దామోదర వినాయక సావర్కర్ ‘సద్గుణ వికృతి’ అని తన గ్రంథంలో వర్ణించాడు. పాము ఎవరినీ కరవనక్కరలేదు.. కాని దానిపై ఎవరైనా రాళ్లువేస్తే కనీసం బుసకొట్టాలి.
తాను చెప్పిన అహింసా సిద్ధాంతానికి తను జీవించి ఉండగానే తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పటం చూచి గాంధీజీ కంట తడిపెట్టుకున్నాడు. చైనానుండి ఎర్రదండు టిబెట్టులోకి ప్రవేశించి 10 లక్షల మంది బౌద్ధులను చంపివేసింది. 6 లక్షల బౌద్ధ విహారాలు నేలమట్టమయినాయి. అయినా దలైలామా నోరెత్తలేకపోయాడు. ఇది శాంతిదూత లక్షణం కాదు. కేవలం అసమర్ధత. బలవంతునికి మాత్రమే శాంతిని గూర్చి మాట్లాడే అధికారం ఉంటుంది. బలహీనుడు శాంతిని గూర్చి మాట్లాడితే అది పిరికితనం అనిపించుకుంటుంది.
ప్రశ్న: పరమత సహనం హిందువుల లక్షణం..
జవాబు: అందుకే ఇండియాలో ఇన్ని వేల మసీదులు, చర్చిలు, కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు ఉన్నాయి. పాకిస్తాన్‌లోను, స్టాలిన్ గ్రాడ్‌లోను లేవు. ఐతే ఒక వ్యక్తి క్రైస్తవం, ఇస్లాం, మార్క్స్ సిద్ధాంతాన్ని స్వీకరించగానే- హిందూ దేవీదేవతలను ద్వేషించడం మొదలుపెడతాడు. తులసమ్మ తన పేరు విప్లవ కుమారిగా మార్చుకుంటుంది- మంగళసూత్రాలు, గాజులు, బొట్టు తీసివేస్తుంది. శివుణ్ణి, రాముణ్ణి, వెంకటేశ్వర స్వామిని తిడుతూ ఉంటుంది. వోల్గా, మిసిసిపీ వంటి నదులు తప్ప కొందరికి గంగానదిపై గౌరవం ఉండదు.
ప్రశ్న: ఇటీవల హిందువులలో చైతన్యం వచ్చి.. వారు సైతం తీవ్రవాదానికి దిగుతున్నారు.
జవాబు: గత వెయ్యి సంవత్సరాలుగా హిందువులు బానిసలుగా బ్రతికారు. ఇటీవల హిందూ రాజకీయ చైతన్యం గమనిస్తున్నాము. హిందువు అంటే గుడులకు, గోపురాలకు పరిమితమైనవాడు అని భావించేవారు.
1947 తర్వాత హిందూత్వంలో కొంత మార్పు స్పష్టంగా కన్పడుతున్నది. ‘ఇండియా హిందువుల మాతృదేశం’ అని సావర్కర్, గోల్వాల్కర్, జయేంద్ర సరస్వతి, దయానంద, వివేకానంద, అరవిందస్వామి, పరిపూర్ణానంద వంటివారు ప్రబోధించారు. ఇది రాజకీయ చైతన్యానికి దారితీసింది. దీని పరిణామమే 2014లో నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి కావటం. దీనిని అమెరికా, రష్యా, పాకిస్తాన్, చైనా వంటి నియంతృత్వ మత రాజ్యాలు సహించలేకపోతున్నాయి. నరేంద్ర మోదీని గద్దెదించండని హిందువులు కాని మణిశంకర అయ్యర్, రాహుల్ గాంధీ వంటివారు పోరాడుతున్నారు.
ప్రశ్న: తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు. వెంకటేశ్వరస్వామికి 7 కోట్ల వజ్ర కిరీటం సమర్పించాడు. యాదగిరి గుట్ట, వేములవాడలను వందల కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నాడు. అలాంటివారిని ఆదర్శంగా తీసుకోవాలి కదా!
జవాబు: గుడులకు పోయేవారంతా హిందువులు కాదు. ఇదొక మూల సూత్రం. విదేశాలకు వెళ్లేందుకు ‘వీసా’ వస్తుందన్న నమ్మకంతో చిలుకూరు బాలాజీ గుడికి చాలామంది వెళ్తుంటారు. వీరు నామమాత్ర హిందువులు. హిందూ దేవుళ్లంటే భక్తి ఉన్న కేసీఆర్ మజ్లిస్ పార్టీతో సన్నిహితంగా ఉండడం కొందరికి నచ్చదు.
రాజామాన్‌సింగ్ రోజూ ఉదయమే రుద్రాభిషేకం చేసి సైన్యం కలిసి రాణాప్రతాపుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేవాడు. ఇట్లా ఎందుకు చేస్తావని ప్రశ్నిస్తే అతడు చెప్పిన సమాధానం- ‘నాకు దైవభక్తి ఉంది- రాజభక్తీ ఉంది- నా దేవుడు శివుడు- నారాజు అక్బర్’. ఇటలీ నుంచి ఇండియాకు వచ్చి ఓ రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన ఆమెకు గుడి కట్టేవారిలో కనిపించేది ఈ రకమైన ‘రాజభక్తి’ మాత్రమే.

--ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్