శిప్ర వాక్యం

అధికారం కోసం అనైతిక పొత్తులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఎదురు దెబ్బలు తిన్నది. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి విజయావకాశాలు సన్నగిల్లుతాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వ పటిమ ప్రశ్నార్థకమైంది. యోగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక జరిగిన ఉపఎన్నికల్లో గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, ఖైరానా ఎంపీ స్థానాల్లో భాజపా ఓడిపోయింది. ఒక్కో చోట ఓటమికి ఒక్కో కారణం ఉంది. చెరకు రైతుల సమస్యల నేపథ్యంలో జరిగిన ఉపఎన్నికలో ఖైరానాలో భాజపాకు చేదు ఫలితం దక్కింది. ఈ స్థానంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి తబుస్సమ్ గెలిస్తే పాకిస్తాన్‌లో మిఠాయిలు పంచుకున్నారు. ఖైరానాలో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. గతంలో 51 శాతం బిజెపికి వచ్చిన ఓట్లు ఈసారి 47 శాతానికి వెళ్లాయి. ఇక్కడ రాష్ట్రీయ లోక్‌దళ్ తరఫున పోటీచేసిన మైనారిటీ వర్గం మహిళ తబుస్సమ్‌కు సమాజ్‌వాదీ, బహుజన సమాజ్, కమ్యూనిస్టు పార్టీలు, ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి.
మోదీని ఓడించాలన్నదే విపక్షాల ఏకైక నినాదం. మోదీ పెద్దనోట్లు రద్దు చేశాడని, పెట్రోల్ ధరలు పెంచేశాడని, జీఎస్‌టీ పేరిట పన్నులు విధించాడని విపక్షాలు భారీగా ప్రచారం చేశాయి. విపక్షలు చెబుతున్న ఈ కారణాలన్నీ నిజమే. పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. కాకుంటే కేరళలో స్థానిక సుంకం తగ్గించి లీటరు పెట్రోల్‌పై రూపాయి సబ్సిడీ ఇచ్చారు. ఇక ప్రతిపక్షాలకు మోదీ పాలన ఎందుకు ఇబ్బందికరంగా మారిందో ఆలోచించాలి. మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం వేల కోట్ల రూపాయలను విదేశీ బ్యాంకులకు తరలించారు. వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేటు కేసులు నడుస్తున్నాయి.
బిహార్‌కు చెందిన ఆర్‌జెడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలో ఆర్‌జెడి అభ్యర్థి ముస్లిముల మద్దతుతో విజయం సాధించాడు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నీతి మంతుడు. అతడు బిజెపితో జత కట్టినందున అవినీతి పరుడైనాడు. ఉత్తరప్రదేశ్‌లో మాజీ సీఎం మాయావతిపై చాలా ఆర్థిక నేరాలున్నాయి. న్యూ ఢిల్లీలోని ఆర్చిబిషప్ ఆస్వాల్ట్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ ‘హిందూ మతవాది మోదీని ఓడించండి’ అని బహిరంగంగా కోరాడు. ఇతడు రోములోని వాటికన్‌కు ప్రతినిధి. సోనియా, రాహుల్ గాంధీ కాథలిక్ మతస్థులు. ఎలాగైనా సరే ఇండియాలో హిందూ సంస్కృతిని నిర్మూలించాలంటూ వాటికన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. యూపీలో ఆర్‌ఎల్‌డి పార్టీ అధినేత అజిత్‌సింగ్ జాట్ కులానికి చెందినవాడు. కుల రాజకీయాలు తప్ప అతనికి మరేమీ తెలియవు. ఆయన తండ్రి చరణ్‌సింగ్‌ను గతంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిని చేసి లోక్‌సభ ముఖం కూడా చూడకముందే 40 రోజుల్లో రాజీనామా చేసేటట్లు వ్యూహం నడిపింది.
వరద వచ్చినప్పుడు చెట్టు మీదికి పాము, ముంగిసలు ఒకేసారి ఎక్కవచ్చు. అవి తాత్కాలికంగా తమ సహజ శత్రుత్వాన్ని మరచిపోవచ్చు. ఇలాగే ఖైరానాలో భాజపాను ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలిపాయి. సహజ శత్రువులు ఒక్కసారి మిత్రులైనారు. నిజానికి ఈ ఉపఎన్నికలో బిజెపి ఓట్ల శాతం పెద్దగా తగ్గలేదు. కాని విపక్షాల ఓట్లు చీలనందున బిజెపి ఓడిపోయింది. అలాగే, మోదీపై ఉన్న ద్వేషంతో కర్నాటకలో 38 సీట్లు గెలిచిన కుమారస్వామిని ముఖ్యమంత్రి గద్దెపై కాంగ్రెస్ కూర్చోబెట్టింది.
బిజెపి ఓటమిని క్రైస్తవులు, ముస్లిములు బలంగా కోరుకుంటున్నారు. స్వచ్ఛంద సేవ పేరుతో అమెరికా నుండి మతం మార్పిడుల కోసం వచ్చే ధనంపై నరేంద్ర మోదీ ఆంక్షలు విధించాడు. దీంతో చర్చి నిర్వాహకులకు కోపం వచ్చింది. జీహాదీ ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. ఇండియాను ఇస్లామిక్ స్టేట్‌గా మ్చాలని పాకిస్తాన్ అరబ్ రిపబ్లిక్‌లు శత విధాల ప్రయత్నిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవీకరణ దాదాపు పూర్తయ్యింది. ఈ రాష్ట్రాల్లో ఆగస్టు 15న జాతీయ జండా ఎగురవేయటం- మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలయింది. కేరళలో పరిస్థితి మరీ అన్యాయం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ‘బహిరంగ స్థలాల్లో జాతీయజెండాను ఎగురవేయరాదు’ అని శాసించాడు. మోదీ స్వదేశంలోనే కాదు.. చైనా, అమెరికా, పాకిస్తాన్, అరబ్ రిపబ్లిక్‌ల నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాడు. మోదీ బలం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల బలం. మోదీ బలహీనమైతే మళ్లీ మతాంతరీకరణలు యథేచ్ఛగా చేయవచ్చు. దేశ సంపదలు విదేశీ బ్యాంకులకు తరలించవచ్చు. ఇదీ ప్రతిపక్షాల వ్యూహం. అందుకనే మోదీని పాపాల భైరవుడిగా అభివర్ణిస్తున్నారు. మోదీ చేసిన పాపాలేమిటి? స్వచ్ఛ్భారత్, మేకిన్ ఇండియా నినాదాలు ఇవ్వడం పాపమా? నల్లధనాన్ని అరికట్టడం, జీహాదీ ఉగ్రవాదంపై పోరాటం పాపమా?
అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని మోదీ రద్దు చేయలేదు. ఆర్టికల్ 356ను కేరళపై విధించలేదు. అయోధ్య, మధురలలో ఆలయాలను నిర్మించలేదు. ముస్లిం ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును వెనక్కి తెప్పించలేదు. ఉమ్మడి పౌరసత్వం, పాఠ్య పుస్తకాల ప్రక్షాళన, సాహిత్య- సంగీత అకాడమీల్లో వామపక్షాల ఆధిపత్యాన్ని అడ్డుకోలేదు. యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని విపక్ష పార్టీలు కులాలపై ఆధారపడి విద్వేషాలను రగిలిస్తున్నాయి. ఖైరానాలో ఇదే జరిగింది. జాట్లు, యాదవులు, దళితులు హిందువులు కారా? వీరిని విడగొట్టి రాజకీయాలు చేస్తున్న విపక్షాలను భాజపా ఎదిరించలేదా? ఇటీవల బెంగాల్‌లో త్రిలోచన మెహత్ అనే దళిత విద్యార్థి (18) పంచాయతీ ఎన్నికలలో బిజెపికి మద్దతుగా పనిచేస్తే, విపక్ష పార్టీ కార్యకర్తలు అతడిని చెట్టుకు ఉరివేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ సంఘటన తర్వాత దులాల్ కుమార్ అనే మరో బిజెపి కార్యకర్తను హత్యచేశారు. దీనికి మాయావతి ఏం సమాధానం చెబుతారు?
1980లో జ్యోతిబసు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగ్చీ అనే దళితుణ్ణి సిపిఎం కార్యకర్తలు చంపారు. ఇప్పుడు త్రిలోచనా మెహతాను తృణమూల్ కాంగ్రెస్ వారు హత్యచేస్తే కమ్యూనిస్టులు మీగడ తిన్న పిల్లుల వలె కళ్లు మూసుకున్నారు. హైదరాబాద్‌లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు అల్లరి చేసిన మానవ హక్కుల సంఘాలు త్రిలోచన మెహతా విషయంలో ఎందుకు స్పందించలేదు? కేరళలో జరిగిన హత్యల జాబితా చూస్తే- అందులో అట్టడుగు వర్గాల వారు రైతులు, జాలర్లు ఉన్నారు. 1960వ దశకంలో రామకృష్ణ అనే అట్టడుగు వర్గానికి చెందిన హిందువును స్వయంగా కేరళలో హతమార్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్‌పై అప్పట్లో మొదటి ముద్దాయిగా కేసు నమోదు అయింది. దళితులను కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టిఎంసి, బిఎస్‌పి పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప వారి రక్షణ గూర్చి ఎటువంటి బాధ్యత లేదు.
బిజెపి తన ఓటింగ్ శాతం 51కి పెంచుకోవాలని ఆశిస్తున్నది. అంటే 2019 ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఏకం కావటం ఖాయం. కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు సైతం ఏకం కానున్నాయి. కర్నాటకలో దేవెగౌడ, కేరళలో సిపిఎం, ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో టిఆర్‌ఎస్, యూపిలో ఎస్‌పి,బిఎస్‌పి, బిహారులో ఆర్‌జెడి, మహారాష్టల్రో శివసేన, న్యూఢిల్లీలో ఆమ్‌ఆద్మీ- ఇట్లా చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి జాతీయ పార్టీ అయిన బిజెపికి సవాలు విసురుతున్నాయి. బిజెపి అంటే భారత్ జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవన పార్టీ. ‘్భరత్ స్వాతంత్య్రం వద్దు- వీరు ఇతరుల చేత పాలింపబడటం కోసం పుట్టిన వారు’- అని విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన మాటలు ఇప్పుడూ యదార్థం అనిపిస్తున్నాయి. బిజెపి అధికారంలో ఉంటుందా? ఉండదా? అనేది ప్రధానం కాదు. 1947లో లభించిన తన స్వాతంత్య్రాన్ని భారత్ నిలుపుకుంటుందా? లేదా? అనేదే ప్రధాన సమస్య. ప్రాంతీయ పార్టీల విజృంభణ ఆగకపోతే భారత దేశం మరోసారి విచ్ఛిన్నం కావటం ఖాయం. నరేంద్ర మోదీ చేతిలో ఇంకా పది నెలల సమయం ఉంది. చేయవలసిన మంచి పనులు త్వరత్వరగా చేస్తే బిజెపికి అస్తిత్వం ఉంటుంది. బడాబాబులు విదేశాలలో దాచిన భారీ సంపదను వెనుకకు తీసుకొని రాలేరా? ఆక్రమిత కాశ్మీరును ఇండియాలో కలుపలేరా? దేశద్రోహులను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? వీటికి భాజపా నాయకత్వం సమాధానం చెప్పాలి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్