శిప్ర వాక్యం

రాజకీయాల్లో మహిళకు మర్యాద ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చతుర్వేది ఉదంతం మన దేశ వర్తమాన రాజకీయాలకు అద్దం పడుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఆమె శివసేన పార్టీలో చే రింది. ఈ సందర్భంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, తమ పార్టీలో మహిళలకు పూర్తి రక్షణ, గౌరవం ఉంటాయని గొప్పగా ప్రకటించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందిన ప్రియాంక చతుర్వేది మధురలో ఉండగా గత సెప్టెంబర్‌లో సొంత పార్టీ కార్యకర్తలే ఆమెపై లైంగిక దాడికి దిగారు. ఆ ఘటనపై ఆమె పార్టీ అధిష్ఠాన వర్గానికి ఫిర్యాదు చేసింది. వెంటనే నిందితులను పార్టీ నుండి బహిష్కరించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో వారిని తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఈ వ్యవహారం నడిపింది కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. దీంతో ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ నుంచి నిష్క్రమించింది. రాజకీయాల్లో రాణించాలనుకొనే మహిళలకు వేధింపులు, గ్రూపు తగాదాలు తప్పవని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
జ్యోతిరాదిత్య గ్వాలియర్ రాజమాత కుమారుడు. అతడు ఈ స్థాయికి ఎందుకు దిగజారినట్లు? రాజకీయ పార్టీల్లో మహిళలకు అవమానాలు ఎదురుకావడం కొత్తేమీ కాదు. కేరళలో సీపీఎంకు చెందిన ఓ నాయకురాలు తనపై సొంత పార్టీ కార్యకర్తలు లైంగిక దాడులకు దిగుతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాంకు లేఖ రాస్తే- ఆయన దాన్ని బుట్టదాఖలు చేశాడు. తాను ఎందుకు వౌనం వహించాననే విషయమై ఏచూరి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రియాంక చతుర్వేది ఉదంతం కాంగ్రెస్ పార్టీ నైతిక స్థాయిని దిగజార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎందరెందరో ప్రముఖ వనితలు కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది?
***
న్యాయవ్యవస్థను, చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. ప్రధాని, రాష్టప్రతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, త్రివిధ దళాల అధిపతులను జాతి మొత్తం గౌరవించాలి. కానీ, నేడు అలా జరగటం లేదు. ‘ప్రధాని మోదీ దొంగ’ అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనడం సబబేనా? సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిర్ధారణ కావలసి ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో బయటపడింది. మరి.. ఆయనకు ‘్భరతరత్న’ పురస్కారం లభించింది. తనపై ఎవరైనా ఆరోపణలు చేస్తే న్యాయవ్యవస్థ మీద దాడి చేసినట్లే అని రంజన్ గొగోయ్ అన్నట్లు కథనం. ఒక పోలీస్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడితే- మొత్తం రక్షణ వ్యవస్థపైనే దాడి జరిగిందని అనలేం. హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో కొందరు సినీ ప్రముఖులను పోలీసులు విచారించారు. అంతమాత్రాన ఇది తెలుగు సినీ పరిశ్రమపై దాడి అనడం అసమంజసం. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌పైనా విచారణ జరగాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలోనే స్వలింగ సంపర్కం, శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశం వంటి వివాదాస్పద తీర్పులు వచ్చాయి. ప్రజలు ఆ తీర్పులను గౌరవించారు. న్యాయమూర్తిపై విచారణ జరపాల్సి వస్తే అది న్యాయ వ్యవస్థ మీద దాడి అని అనకూడదు. అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన నేరారోపణ అవుతుంది. వ్యక్తి, వ్యవస్థల మధ్య తేడాను గమనించాలి.
***
భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఇటీవల కాన్పూరుకు చెందిన డాక్టర్ భార్గవ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. ‘్భర్గవ మానసిక పరిస్థితి బాగోలేదు. అందుకని ఇలాంటి అకృత్యాలు చేస్తున్నాడు’ అని కుటుంబ సభ్యులు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఎన్నికల సమయం కాబట్టి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గుజరాత్‌లో ఓ వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి హార్ధిక్ పటేల్‌పైకి దూసుకొచ్చి చెంప ఛెళ్లుమనిపించాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. కేరళలోని వయనాడ్‌లో భాజపా అభ్యర్థి తుషార్ వెలపల్లిపై ఈమధ్య భౌతిక దాడి జరిగింది. వయనాడ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సీపీఎం ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో భాజపా పోటీ చేయడాన్ని ముస్లిం లీగ్ కార్యకర్తలు, మావోయిస్టులు సహించలేకపోతున్నారు.
***
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత కమ్యూనిజం ఎందుకు అదృశ్యం కాబోతోంది? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, త్రిపుర, బెంగాల్, కేరళ ప్రాంతాలు కమ్యూనిస్టులకు కంచుకోటలు. ఈరోజు వామపక్ష పార్టీల చిరునామా లేకుండా ఎందుకు పోయినట్లు? పోలీసులు, నక్సలైట్లు, ఇన్‌ఫార్మర్లు, ఆదివాసీలు మొత్తం 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత రక్తపాతం తర్వాత మావోయిస్టులు ఏం సాధించినట్లు? అంతర్జాతీయంగా అమెరికా తర్వాత అతి పెద్ద సామ్రాజ్యవాద దేశం చైనా. తైవాన్, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర అమెరికా, నేపాల్ వంటి దేశాలను చైనాకు వలస దేశాలుగా మార్చాలనే ప్రయత్నం జరిగింది. పారిశ్రామిక విప్లవ కాలం నాటి రష్యాకు నేటి రష్యాకు ఎలాంటి పోలికా లేదు. కృష్ణా జిల్లాలో రైతుకూలీ పోరాటాలు జరిపిన ప్రముఖుల కొడుకులు, తమ్ముళ్లు, అల్లుళ్లు అమెరికాలో ఉన్నారు.. హైదరాబాదులో స్టూడియోలు, హోటళ్లు కట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ వాస్తవాలను మనం విస్మరించలేము. తెలుగుదేశం, తెరాస పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలను కబళించివేశాయి. అట్టడుగు వర్గాల వారు మరోదారి లేక బిఎస్పీలో చేరుతున్నారు. పెద్దసంఖ్యలో గిరిజనులు భాజపాలో చేరుతున్నారు.
***
ఎన్నికల సమయంలో నేతలు మాటల తూటాలు పేలుస్తూ ఉంటారు. ఐతే అబద్ధాలు చెప్పకూడదు. 1980 ఎన్నికల సందర్భంగా ‘బ్లిడ్జ్’ పత్రిక సంపాదకుడు- భాజపా అగ్రనేత వాజపేయి బ్రిటీషు ఏజెంటుగా 1942లో పనిచేశాడని ఆరోపించారు. ఇది అబద్ధం అని అందరికీ తెలుసు. 1942లో ఇండియాలో కమ్యూనిస్టులు బ్రిటీషు ఏజెంట్లుగా పనిచేశారు. ఇది చారిత్రిక సత్యం. ‘మాకు యుద్ధంలో సహకరించండి’ అని బ్రిటీషు ప్రభుత్వం కోరితే కాంగ్రెస్ వారు బ్రిటీషు సంయుక్త దళాలకు సహకరించారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. రాహుల్ గాంధీ ఏ దేశ పౌరుడు? న్యూయార్క్‌లో బాప్టిజం పుట్టుకున్నాడు. కాబట్టి ఇతడు దత్తాత్రేయ గోత్రోర్భవుడైన బ్రాహ్మణుడు కాజాలడు. ఆయన 2004లో బ్రిటీషు పౌరసత్వం తీసుకున్నట్లు సాక్ష్యాధారాలున్నాయి. బ్యాంక్ ఆఫ్ లిమిటెడ్‌లో తాను బ్రిటీషు పౌరుణ్ణి అని పేర్కొన్నాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ డిగ్రీ 2004లో తీసుకున్నట్లు ఆయన ఎలక్షన్ అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. 2004లో కేంబ్రిడ్జి నుండి రాహుల్ గాంధీ అనే పేరుతో ఎవరూ చదువుకోలేదని నిర్ధారణ అయింది. రాహుల్ 11వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు తొలి అఫిడవిట్‌లో ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ ముందు ఎందుకు అబద్ధం చెప్పినట్లు? ఒక విదేశీ పౌరుడు భారత రాజ్యాంగం ప్రకారం ఇండియాలో పోటీచేసే అధికారం లేదు. దీనికి సుప్రీం కోర్టు ఏం సమాధానం చెపుతుందో చూడాలి. *

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్