శిప్ర వాక్యం

పాలి‘ట్రిక్స్’ అంతే మరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ యూపీ ముస్లిం నాయకుడు అజాం ఖాన్‌పై మండిపడింది. సినీనటి, భాజపా ఎంపీ అభ్యర్థి జయప్రదను అజాం ఖాన్ వ్యక్తిగతంగా విమర్శించడమే ఇందుకు కారణం. సమాజ్‌వాదీ పార్టీ నుంచి భాజపాలో చేరిన జయప్రద మరోసారి రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీలో ఇప్పటికీ ముస్లింలు, యాదవులు ప్రధాన భూమిక నిర్వహిస్తూ ఉంటారు. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ పాకిస్తాన్ ప్రయోజనాల కోసమే పనిచేస్తాడని యూపీ ప్రజల అభిప్రాయం. ములాయం మిత్రుడైన అమర్ సింగ్ తనకు రాజకీయాల్లో ‘గాడ్ ఫాదర్’ అని జయప్రద గతంలో చెప్పుకున్నారు. ఎస్పీలో ముస్లిం నాయకుడైన అజాం ఖాన్ తనను అవమానించడంతో ఆమె భాజపాలో చేరారు. జయప్రదపై ఖాన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీంతో అజాం ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అజాం ఖాన్ పాకిస్తానీ ఏజెంటు అని అందరికీ తెలుసు. అయినా అతని అనుగ్రహం కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రాధేయపడుతున్నాయి. యూపీలో జరిగే మత కల్లోలాల వెనుక ఖాన్ వంటి నేతల హస్తం ఉంటుందనే ఆరోపణలున్నాయి. సున్నిత మనస్కురాలైన జయప్రద కళారంగానికి పరిమితమైతే బాగుండేది. గజచర్మధారులు (థక్ స్కిన్స్) మాత్రమే రాజకీయాల్లో రాణించగలరు.
***
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఒక సాంకేతిక అద్భుతం. వీటి వల్ల శ్రమ, సమయం తగ్గుతుంది. ఒకప్పుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడేవారు. అప్పుడు దొంగ ఓట్లు భారీగా పడేవి. బ్యాలెట్ పేపర్లపై నీళ్లు, ఇంకు పోస్తుండేవారు. వీటిని లెక్కించడానికి చాలా సమయం పట్టేది. ఈవీఎంలను వాడడం మొదలయ్యాక అనేక ఆరోపణలు వస్తున్నాయి. ‘ఏ గుర్తుమీద నొక్కినా ఓటు కమలం పువ్వుకే పడుతోంది’ అనే ప్రచారం ఇటీవల మొదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఈవీఎంల్లో తప్పులు జరుగుతున్నాయని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించినపుడు చంద్రబాబుకు తిరిగి అధికారం దక్కింది. కాగా, ఇపుడు ఓటమి భయంతో చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నట్లు వైకాపా నేతలు విమర్శించారు. పోలింగ్‌లో ఈవీఎంలు ఎక్కడో ఒక చోట మొరాయిస్తున్న మాట నిజమే. అందుకు సాంకేతిక నిపుణులను పిలిచి సరిచేసుకోవాలి. ఏపీలో రాత్రి కూడా పోలింగ్ జరిగింది. ఎండాకాలంలో పగటి పూట కన్నా రాత్రి వేళ పోలింగ్ మంచిదేమో?
***
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు ఆ పార్టీ వారు ‘కారు- సారు- పదహారు’ అన్నారు. పదహారు లోక్‌సభ స్థానాలను గెలవాలని దీని అర్థం. మరి పదిహేడవదైన హైదరాబాద్ ఎంపీ సీటును మజ్లీస్ పార్టీకి ధారాదత్తం చేశారు. పాతబస్తీలో అభివృద్ధి శూన్యం. అక్కడికి మెట్రోరైల్‌ను రానివ్వరు. ట్రిపుల్ తలాక్ షరియత్ ప్రకారం అమలులో ఉంటుంది. ఐనాసరే ఏ మహిళా సంఘాలు వారిని తప్పుపట్టవు. వీరి ప్రతాపం అంతా హిందువుల మీదనే. మజ్లిస్‌తో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. అందుకే మూకుమ్మడిగా ముస్లిం ఓట్లు టిఆర్‌ఎస్‌కు పడుతున్నాయి. ‘కారు-సారు- బేకారు’ అన్నారు ప్రతిపక్షాల వారు. తెరాస ప్రతాపం ముందు కాంగ్రెస్, భాజపా, తెజస, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చిత్తవుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ మంచి వాగ్ధాటి కలవారు. ప్రతిపక్షాలలో అలాంటి వక్తలు లేరు. యాదాద్రిని రెండవ తిరుపతిగా మార్చడం కేసీఆర్‌ను రక్షించింది. నిరంతర విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, కల్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రజలు నమ్మారు. కేసీఆర్ అబద్ధాలాడుతున్నారని విపక్షాల ఆరోపణ. మరి రాజకీయాల్లో నిజాలు చెప్పిన ఒక సచ్ఛీలుడి పేరుచెప్పండి చూద్దాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ఒక పెద్ద అబద్ధం. కేవలం ధర్మరాజ్యమే దీనికి ప్రత్యామ్నాయం. నిన్నటి దాకా గొంగళిని భుజాన వేసుకొని ఎర్రజెండా అంటూ ఎగిరి ఇవాళ సూటు బూటు ధరించిన గద్దర్ లాంటి వారిని తెలంగాణ సమాజం నమ్మలేకపోతున్నది. కేసీఆర్ సాధించిన మరో ఘన విజయం తెలంగాణలో కమ్యూనిజం లేకుండా చేయటం. నేటికీ తెలంగాణలో భూస్వామ్యవ్యవస్థ బలంగానే ఉన్నా, పేదలు సారును, కారును ఎందుకు నమ్ముతున్నారు? ఇక, ఏపీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు వైఎస్ జగన్‌ను నమ్ముతున్నారే కాని మరొక వ్యక్తిని, పార్టీని కాదు. ప్రజలందరూ మూర్ఖులని అనలేము కదా.
***
పంజాబ్‌లో కాంగ్రెస్ మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, ‘ముస్లింలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓటువేయండి. ఎందుకంటే మనదే ముస్లిముల పార్టీ- అసదుద్దీన్ ఒవైసీ మాట కూడా వినకండి’ అన్నాడు. కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ముస్లింలంతా జేడీఎస్‌కే ఓటువేయాలి’ అన్నాడు. భోపాల్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ- ‘ముస్లింల్లో కనీసం ఏభై శాతం మంది కాంగ్రెస్‌కే ఓటువేసి తీరాలి’ అన్నాడు. హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమకుమార్‌రెడ్డి ఇటీవల- ‘ముస్లింలు మాకు ఓటువేస్తే మసీదులకు ఉచిత కరంటు ఇప్పిస్తాం’ అన్నాడు. ఇండియాలోని ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో భాగం కారా? వారిని కాంగ్రెస్ వారు దశాబ్దాలుగా విడదీసి ఓటుబ్యాంకు కింద ఎందుకు వాడుకుంటున్నారు? అందరికీ ముస్లింల ఓట్లే కావాలి. మరి హిందువుల ఓట్ల మాటేమిటి?? నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, అజం ఖాన్‌లపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ‘చౌకీదార్ (మోదీ) చోర్ అని సుప్రీం కోర్టు చెప్పింది’ అన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ‘మేము ఎప్పుడు అలా అన్నాం?’ అని సుప్రీం కోర్టు ఎదురుప్రశ్న వేసింది. ఓట్లకోసం ఎన్నికల సమయంలో ఎలాపడితే అలా మాట్లాడవచ్చునా?
***
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ- ‘ప్రధాని ప్రేమ, అనురాగాలతో ప్రజలను చూడాలి.. కానీ మోదీ మాత్రం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడు’అన్నది. ప్రధాని మాత్రమే కాదు, అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకోవాలి. అలా జరుగుతున్నదా? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు వంద మందిని పొట్టనపెట్టుకున్నది. వీరిలో ఆర్‌ఎస్‌ఎస్, భాజపా, విహెచ్‌పీ, సీపీఎం వంటి భిన్న సంస్థలకు చెందిన వ్యక్తులున్నారు. మృతుల్లో దళితులు కూడా అధిక సంఖ్యలో ఉండటం విశేషం. బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులకు ఆమె రక్షణ ఇస్తున్నది. దసరా ఉత్సవాలపై నిషేధం విధించింది. చంద్రబాబు, కుమార స్వామి, స్టాలిన్ వంటి ప్రాంతీయ నాయకులకు మమత మద్దతు పలుకుతోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్నాటకల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపితే మమత ప్రధాని మోదీపై నిప్పులు కురిపించింది. ఈమె ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నది. అదే జరిగితే బెంగాల్ భవిష్యత్ ఎలా ఉంటుందో? శారదా చిట్‌ఫండ్, నారదా టేపుల కుంభకోణాల్లో మమతపై ఎన్నో ఆరోపణలున్నాయి. శారదా చిట్‌ఫండ్ కంపెనీ దివాలా తీయటంతో అట్టడుగు వర్గాల వారు రోడ్డునపడ్డారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో హత్యలు చేస్తున్నారు. ‘ఇంత రక్తపాతం ఎందుకు?’ అంటే- ‘విశ్వశాంతి కోసం’ అని సమాధానం. ఆమధ్య బెంగాల్‌లో దళితుడైన భాజపా కార్యకర్తను చెట్టుకు ఉరితీశారు. మొన్న ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ ఎమ్మెల్యే భీం మాండవిని మావోయిస్టులు కాల్చి చంపారు. బెంగాల్‌లోని పురూలియాలో శిశుపాయ్ అనే భాజపా కార్యకర్తను ప్రత్యర్థులు ఉరితీశారు. ఇదంతా విశ్వశాంతి కోసమేనట! లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్న భాజపా ఏం చేస్తున్నట్టు? బెంగాల్, కేరళ సీఎంలైన మమత, పినరయి విజయన్‌లను మోదీ సర్కారు ఎందుకు అరెస్టు చేయలేకపోతోంది? ఎవరైనా మరణిస్తే సంతాప సభలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించి చేతులు దులుపుకుంటున్న దుస్థితికి భాజపా దిగజారింది.
*

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్