శిప్ర వాక్యం

వోటు వేసే ముందు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సమయంలో ప్రజలు సహజంగా ఏవో భావోద్రేకాలకు లోనై వోటు వేస్తుంటారు లేదా ఆర్థిక ప్రలోభాలకు లొంగి తమ ఓటును దుర్వినియోగం చేసుకుంటారు. ఇక విద్యాధికుల కథ మరో రకంగా ఉంటుంది. వీరు పత్రికలు చదువుతారు, టీవీలు చూస్తారు. పాలకుల దుష్ప్రవర్తనకు ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్లు తిట్టుకుంటూ ఉంటారు. కాని పోలింగ్ రోజున ఓటింగ్‌కు వెళ్లరు. ‘పోటీలో ఉన్నవాళ్లంతా పనికిమాలిన వాళ్లే.. నా ఒక్క ఓటు లేకపోతే కొంపలేమీ మునిగిపోవు..’ అంటూ ఇంట్లో కూర్చుంటారు. ఈ విధంగా చాలా నియోజకవర్గాలలో యాభై శాతం మించి ఓటింగ్ జరగదు. దీనిని వైబ్రెంట్ డెమోక్రసీ అనలేము.
తెలంగాణలో శాసనసభ ఎన్నికలు గత ఏడాది డిసెంబర్‌లో జరిగాయి. అప్పుడు కొన్ని చోట్ల ఓటుకు రెండువేల నుండి ఐదువేల వరకు ఇచ్చిన సందర్భాలున్నాయి. అంతేకాదు ఎన్నికల సభలకు జనాలను తరలించేందుకు బిర్యానీ పొట్లాలు, రోజుకూలి ఇచ్చారు. డబ్బు పంచకుండా ఓట్లురావు అనే విశ్వాసం అన్ని రాజకీయ పార్టీల్లోనూ బలంగా ఏర్పడింది.
రాయలసీమలో ఒక రైతు ఇలా అన్నాడు.. ‘నా జీవితకాలంలో నేను ఇప్పటివరకు బాలెట్ పత్రం ఎలా ఉంటుందో చూడలేదు. నా ఓటు ఎవరో వేసి వెళ్తుంటారు’. ఇది నేటి మాట కాదు వై.బి.చవాన్ సతారా (మహారాష్ట్ర) నియోజకవర్గంలో పోటీచేసేటప్పుడు ఆయనపై ఎవరూ నిలబడడానికి వీలులేదు. బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి ప్రత్యర్థులను విత్‌డ్రా చేయించేవారు. అంతేకాదు ఒక పోటీదారుణ్ణి హత్యచేసి ఎన్నికలు వాయిదా వేయించిన సందర్భాలు మనకు తెలుసు. ఇవన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రుగ్మతలు. ఈ అవలక్షణాలు కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో నేడు తీవ్రంగా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో అసత్య ప్రచారాలు చేయటం. గణాంకాలను తారుమారు చేసి చెప్పటం. కులమతాల పేరుతో ఓట్లు అడగటం. తెలంగాణలో మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మూకుమ్మడిగా ముస్లిములు టిఆర్‌ఎస్‌కు ఓటువేయాలని ఆదేశించాడు. టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం ‘నేను హిందువును- భాజపా వారు దొంగ హిందువులు’ అని మహబూబ్‌నగర్ బహిరంగ సభలో అన్నారు. 2014లో కల్వకుంట్ల వారు హైదరాబాద్‌లో ఒక సభలో మాట్లాడుతూ.. ‘‘నాది బిర్యానీ కల్చర్- నాది షర్వానీ కల్చర్’’ అని చెప్పటం మరచిపోకూడదు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘‘నేను బ్రాహ్మణుణ్ణి. బ్రాహ్మణులంతా నాకు ఓటువేయాలి’’అని ఉత్తరప్రదేశ్‌లో విప్ర సమ్మేళనంలో కోరాడు. తాను ధరించిన యజ్ఞోపవీతం కూడా చూపించాడు. యజ్ఞోపవీతం బ్రాహ్మణులు మాత్రమే కాదు ఇంకా చాలా కులాల వారు ధరిస్తారు. దళితులు, బంజారాలు, స్ర్తిలు కూడా ఆర్యసమాజ మందిరాలలో యజ్ఞోపవీతం ధరించి యజ్ఞం చేస్తారు. స్వామి అగ్నివేశ్‌కు యజ్ఞోపవీతం ఉంది. ఐనా అతడు చైనా ఏజెంటు అన్న ప్రచారం ఉంది. సారాంశం ఏమంటే కేవలం యజ్ఞోపవీతం మాత్రమే బ్రాహ్మణ లక్షణం కాదు. త్యాగం, దేశభక్తి, బ్రహ్మజ్ఞానము కలిగిన సత్యగుణ సంపన్నుడు బ్రాహ్మణుడు అని అంటారు.
సోనియా గాంధీ రోమన్ కాథలిక్ మతస్థురాలు. రాజీవ్ గాంధీ పార్శీ మతస్థుడు. వారి కుమారుడు రాహుల్ గాంధీ హిందూ బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? న్యూయార్క్‌లో వీరు బాప్టిజం క్రైస్తవ పుణ్యస్నానం పుచ్చుకున్నారు. అంతేకాదు.. రాబర్ట్ వాద్రాతో ప్రియాంకా గాంధీకి వివాహమైన తర్వాత పాతికమందితో ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఆ సభలో ఇద్దరు ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఇద్దరు హాజరయ్యారట! వారి పేర్లు ఫరీదా అతేలా, సల్మాన్ మున్మాద్ అతేలా. ఆనాటి సమావేశానికి ఫరీదా అతేలా అధ్యక్షత వహించి ప్రియాంక, రాబర్ట్ వాద్రాలను ఆశీర్వదించాడు. ఈ చారిత్రకాంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
***
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని చెపుతున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి చాలు అని 2014లో ఆయన అన్న మాట నిజమా? కాదా?? ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించండి అని సోనియాగాంధీకి మొదటి లేఖ చంద్రబాబు నుండి వెళ్లినమాట నిజమా? కాదా?
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అప్పుడు వేదికపైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సోనియా పాదాల కింద ఎన్‌టిఆర్ చిత్రపటం ఉంచిన మాట నిజమా? కాదా??
కాంగ్రెస్ వ్యితిరేక ఉద్యమ నాయకుడు ఎన్‌టీఆర్. మరి నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఎన్‌టిఆర్‌ను పదవీ భ్రష్టుణ్ణి చేశారు. వారు ఎన్‌టీఆర్‌కు ఎలా రాజకీయ వారసులు కాగలుగుతారు? ‘తెలుగుదేశం పార్టీని స్థాపించి చాలా తప్పుచేశాను’ అని నాదెండ్ల భాస్కరరావు చేసిన ప్రకటనలో అంతరార్థం ఏమిటి?
కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ముస్లిములంతా జేడీఎస్- కాంగ్రెస్ కూటమికే ఓటువేయాలని, ఎందుకంటే తమది ముస్లిముల పార్టీ కాబట్టి అని మతం పేరుతో ఓట్లు అడిగాడు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ‘కాంగ్రెస్ అంటే ముస్లిముల పార్టీ- అలాంటప్పుడు ముస్లిములు వేరే పార్టీకి ఎలా ఓట్లువేస్తారు?’ అని గతంలో వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనలపై ఎన్నికల సంఘం ఎందుకు వౌనం వహిస్తోంది?
‘నా గొంతుమీద కత్తిపెట్టినా సరే నేను వందేమాతరం పాడను. భారత్ మాతాకీ జై అనను’ అని మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నాడు. మరి ఈయన భారతీయ పౌరసత్వం ఉన్న వారేనా? హిందువులను చంపి వారి శవాలను ముక్కలుచేసి ఉప్పుపాతర పెడితే తప్పేమిటి?- అని బహిరంగంగా సీపీఎం నాయకుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఇలా అనడం రాజ్యాంగ బద్ధమేనా? ఇలాంటివారికి ఓట్లు అడిగే అధికారం ఉందా??
జమ్మూ కశ్మీరులో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి జరగడానికి కారణం అన్న ఆరోపణలున్నాయి. గతంలో ఆమె జవాన్ల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించింది.
బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను గుర్తించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘మిడ్నాపూర్, మాల్దా ప్రాంతాల్లోకి అక్రమ చొరబాటుదార్లపై చర్య తీసుకుంటే అంతర్యుద్ధం వస్తుంది జాగ్రత్త’ అని బెదిరించింది. కనీసం 100 మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, సిపిఎం కార్యకర్తలు ఈమె ముఖ్యమంత్రిగా ఉండగా గత నాలుగేళ్ల కాలంలో హత్యకు గురయ్యారు. ఇప్పుడామె భారత ప్రధాని కావాలని అనుకుంటున్నది. ప్రజలు పోలింగ్‌కు బయలుదేరేటప్పుడు- గుడ్డిగా, మూకుమ్మడిగా భావావేశాలకులోను కాకుండా ఆలోచించి దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓట్లు వేయాలి.
పాక్ ఆక్రమిత కశ్మీరులోని బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడిచేస్తే అందుకు ఎంతగానో బాధపడిన భారతదేశంలోని పార్టీలను ఏమనాలి? దేశరక్షణ కాదు, ప్రజలకు ఉపాధి ముఖ్యం. ఇది స్వయంగా లక్నోలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచార సభలోని సూక్తి ముక్తావళి. శత్రు దేశాల రహస్య ఉపగ్రహాలను కూల్చివేస్తే క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తే దానిని నిరసించినవారు దేశద్రోహులా? దేశభక్తులా? ఆలోచించండి. పంజాబ్‌లో డ్రగ్స్ పాకెట్లు ఇంటింటికీ పంచేవారికే ఓటువేస్తామని అక్కడ కొందరు కోరుతున్నారట! ఇలాంటి వారు మంచి నేతలను ఎలా ఎన్నుకుంటారు?
*

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్