శిప్ర వాక్యం

ప్రజాస్వామ్యం విఫలమైందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆందోళనలే, అల్లర్లే. గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్టల్రో మరాఠీ రిజర్వేషన్లు, అస్సాంలో చొరబాటుదారులకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు, రాంచీలో మదర్ థెరిసా సంస్థలో పసిపిల్లల అమ్మకాలు, కేరళలో క్రైస్తవ బిషప్‌ల అత్యాచారాలు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమాలు, బెంగాల్‌లో హత్యా రాజకీయాలు, రాజస్థాన్‌లో గుజ్జర్ల అల్లర్లు, కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం, ఉత్తరాదిలో రైతుల ఆందోళనలు.. ఇవన్నీ ఎందుకు? నిజంగా ప్రజాసమస్యలను పరిష్కరించడానికి నాయకులు నడుపుతున్న ఉద్యమాలేనా? అంటే- కావు అనే సమాధానం వస్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవాలన్నదే రాజకీయ నాయకుల తాపత్రయం.
గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత పేరుతో హడావుడిగా ఒక చట్టం తెచ్చింది. ఓట్ల రాజకీయం కోసమే ఈ చట్టం అన్నది సుస్పష్టం. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను విభజిద్దామని గతంలో భాజపా అగ్రనేత ఎల్.కె.అద్వానీ అన్నారు. అధికసంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలన్న దురాశతో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన చేసింది. ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణంగా ఓడిపోయింది.
మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు- ఇలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచివేయాలని కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు. తమిళనాడుకు ఒక నీతిని, ఆంధ్రప్రదేశ్‌కు మరొక నీతిని కాంగ్రెస్ పార్టీ పాటించింది. 130 సంవత్సరాల చరిత్రగల కాంగ్రెసు పార్టీ ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలలో అసమర్ధ నాయకత్వంతో తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇప్పుడు ‘కాషారుూకరణం- కాషాయోగ్రవాదం’ అనే నినాదాలతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రంగంలోకి దిగాయి. కేరళ మినహా మరెక్కడా వామపక్ష పార్టీలు కనపడడం లేదు. ఒకప్పుడు ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తాం అని ధీమాగా చెప్పిన కమ్యూనిస్టులు బెంగాల్‌లో, త్రిపురలో, ఏపీ, తెలంగాణాల్లో ఎందుకు ఓటమిపాలు కావలసి వచ్చింది? ఇందుకు వారు ఆత్మవిమర్శ చేసుకున్నారా? కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్టీలు. ఇపుడు వీటికి ఈ దు ర్గతి ఎందుకు పట్టింది? బిజెపిలో నిత్యం వేలాది కొత్త కార్యకర్తలు పుట్టుకొని వస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో కొత్తగా క్రియాశీల కార్యకర్తలు రావడం లేదు. విశ్వవిద్యాలయాల్లో అల్లర్లు చేసి, దేశాన్ని ముక్కలు చేయండని కన్నయ్యకుమార్ వంటి విద్యార్థి నాయకుల చేత నినాదాలు ఇప్పిస్తే పార్టీ నిర్మాణం జరుగుతుందా?
ఎంతసేపూ పురస్కారాలు కొనుక్కొని తమ వ్యక్తిగత కీర్తిప్రతిష్టలను పెంచుకోవాలనే తపన తప్ప ఎవరికైనా దేశం గూర్చిన ఆలోచన ఉందా? అనంతపురంలో కొత్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయం శాఖ ఏర్పాటుచేస్తే అక్కడ ఉద్యోగాల్లో చేరాలనే తపన. పైరవీలు చేసుకొని కేంద్ర సాహిత్య ఎకాడమీ కన్వీనర్‌లు కావాలనే దుగ్ధ. మరోవైపు ‘అవార్డు వాపసీ’ ఉద్యమంతో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయాలని కొంతమంది దుష్టవ్యూహం. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెడితే కాపులకు రిజర్వేషన్ సౌకర్యం వస్తుందని, న్యూఢిల్లీకి వెళ్లే నీటిపైపులను పగలగొడితే హర్యానాలో జాట్‌లకు రిజర్వేషన్లు ఇస్తారా? తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం వెనుక ఉగ్రవాదులు సైతం ఉన్నారని ఇటీవల ఓ నివేదికలో తేలింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసైనా తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని కొందరు నేతలు యత్నిస్తున్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ విధానాన్ని విపక్ష నేతలు వ్యతిరేకించారు. ‘ఒకే దేశం- ఒకే పన్ను’ అంటే వద్దన్నారు. బంగ్లాదేశ్, బర్మాల నుండి వచ్చిన అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపేయాలంటే వ్యతిరేకించారు. సిమీ, మజ్లిస్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను అదుపుచేయాలంటే వ్యతిరేకించారు. ఉమ్మడి పౌరసత్వం విధానం మంచిది కాదన్నారు. త్రిపుల్ తలాక్‌ను సైతం వ్యతిరేకించారు. ఇవేమి రాజకీయాలు?
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఎన్నో సమస్యలు కొనసాగుతున్నాయి. భారతీయులు తమను తాము పాలించుకోవడానికి అనర్హులని అన్నాడు ఆనాటి బ్రిటీషు ప్రధాని విన్‌స్టన్ చర్చిల్. ఇవాళ ఏమయింది? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని సోనియా గాంధీ పాదాల దగ్గర తాకట్టు పెట్టాడు. దీనిని దేశభక్తి అంటారా? ‘ఎంతకైనా తెగించండి.. మోదీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించండి..’ అని గతంలో సోనియా గాంధీ పిలుపునిచ్చింది. తెలంగాణలో కేసీఆర్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి మంచి పథకాలు అమలుచేశారు. వాటిని కూడా వ్యతిరేకించటం ఎందుకు? ఈ పథకాల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు. నిజమే కావచ్చు. మరి కాంగ్రెస్ కాలంలో హెలికాప్టర్ల కుంభకోణం, బొగ్గు కుంభకోణం, పనామా బ్యాంక్ అకౌంట్లు, జలాంతర్గాముల కొనుగోళ్ళ కుంభకోణం, కార్తి చిదంబరం, రాబర్ట్ వాద్రా, పి.చిదంబరం, రాహుల్‌గాంధీల అక్రమాస్తుల కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ అమ్మకం కుంభకోణం- సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ, లండన్ హవుస్, 2జీ స్పెక్ట్రం కేటాయింపులు- ఈ కుంభకోణాలన్నీ యుపీఏ హయాం నాటివే. వీటికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ వంటి నేతలు ఏం సమాధానం చెపుతారు?
ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను భారతీయులే భ్రష్టుపట్టిస్తున్నారు. చైనాలో, బర్మాలో, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదు. ఇండియాలో కూడా చేజేతులా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తే మిలిటరీ పాలన వస్తుందేమో? రాఫెల్ జెట్ కొనుగోళ్ల వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని, 130 లక్షల కోట్ల ముడుపులు అంబానీలకు అందాయన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. ఇది నిజమైతే- ఎంత పెద్దవారినైనా శిక్షించవలసిందే. రాఫెల్ ఒప్పందం 2007లో జరిగింది. అప్పుడు కేంద్రంలో యుపీఏ ప్రభుత్వం వుంది.
***
భాజపా తన మూల సూత్రాలకు చాలాదూరంగా వెళ్లిపోయింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తాం, అయోధ్యలో రామాలయం నిర్మిస్తాం, యువతకు సైనిక శిక్షణ ఇప్పిస్తాం, అఖండ భారత్ సాధిస్తాం, హిందీని జాతీయ భాషగా చేస్తాం, ‘్ధర్మరాజ్య’ స్థాపన చేస్తాం.. ఇలాంటి ఆశయాలన్నీ నాటి జనసంఘ్ నేటి భాజపా మానిఫెస్టోల్లో ఉన్నాయి. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, మైకేల్ క్రిస్ట్ఫర్, దావూద్ ఇబ్రహీంలను ఇండియాకు తెప్పించటంలో భాజపా ప్రభుత్వ నేతలు విఫలమయ్యారు. ప్రతి రోజూ ఏ టీవీ చానల్ చూసినా ఇదే చర్చ. ప్రజలకు ఇదొక ఉచిత వినోదం. ‘మోదీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం మీ ఐఎస్‌ఐ వారు మాకు సహకరించాలి’ అని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ బహిరంగంగా కరాచీలో ప్రకటించారు. మరి దేశద్రోహ నేరం కింద ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు? ‘దేశంలో అంతర్యుద్ధం వస్తుంది’అని బహిరంగంగా ప్రకటించిన మమతా బెనర్జీని ఎందుకు అరెస్టుచేయలేదు??
‘మళ్లీ మాకు మరొక ఐదేళ్లు అవకాశం ఇవ్వండి. భారతదేశపుదశ-దిశ మారుస్తాం’ అని బిజెపి నాయకులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మరి గత నాలుగున్నరేళ్లలో దశ-దిశ ఎంత మారింది? ప్రధాని మోదీ ఆ మధ్య పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ తల్లిని పలకరించి ఆమె పాదాలకు మొక్కారు. చైనావెళ్లి జింగ్‌పింగ్‌కు షేక్‌హాండ్ ఇచ్చి వచ్చారు. ఇవ్వాళ ఇమ్రాన్ ఖాన్‌కు మంగళహారతి పడుతున్నారు. కులదీప్ జాదవ్‌ను పాకిస్తాన్ జైలునుండి విడుదల చేయండని అడిగే ధైర్యం మన నేతలకు లేదు. మన క్రికెటర్లు, కొందరు నాయకులు పాకిస్తాన్ వెళ్లి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారాన్ని తిలకించి వచ్చారు.
***
దేశంలో రాజకీయ రంగం భ్రష్టుపట్టినట్లే ఆధ్యాత్మిక రంగం కూడా అపఖ్యాతి పాలైంది. కేరళ, ఝార్ఖండ్, బెంగాల్‌లలో క్రైస్తవ వర్గాల లైంగిక దుర్మార్గాలు వెలుగులోకి వచ్చాయి. పసిపిల్లల అమ్మకాలు, విదేశీ నిధులతో మతమార్పిడి కార్యకలాపాలు మీడియా కథనాల్లో చర్చనీయాంశాలైనాయి. హిందూ సాధువుల ముసుగులో రాం రహీం బాబాలు, కల్కి భగవానులు, ఆశారాం బాబాలు చేస్తున్న లీలలు ప్రజలు తెలుసుకున్నారు. రాముడిని ఒక క్రైస్తవ మత ప్రచారకుడు నోటికి వచ్చినట్లు తిడితే ఒక వైష్ణవ పీఠాధిపతి కూడా నోరెత్తలేదు. పరిపూర్ణానంద స్వామిని బలపరచడానికి చిన్న జీయరులు, పెద్ద జియ్యరులు రాలేదు.
***
గత కొద్దికాలంగా ఓట్లుకొనటంతోపాటు ఎం.ఎల్.ఎ.లను కొనటం చూస్తున్నాం. దీనిని అవినీతి అనటం చాలా చిన్నమాట. పార్టీ మారేవారు తమ పదవులకు రాజీనామా చేసేటట్లు కోర్టులు కట్టడి చేయలేకపోవటం దురదృష్టకరం. దేశ భద్రతను తాకట్టుపెట్టి యుద్ధప్రమాద సమయంలోకూడా కొందరు నేతలు ఎన్నికల్లో గెలుపుకోసం చైనా, రష్యా నేతలతో మంతనాలు చేయటం భారత ప్రజాస్వామ్య దుర్గతికి సంకేతం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నరేంద్ర మోదీ వంటి నాయకులను చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు హత్యచేయాలనుకోవటం ప్రజాస్వామ్య పునాదులనే కదిలించి వేసింది!

ప్రొ. ముదిగొండ శివప్రసాద్