శిప్ర వాక్యం

ఔను! ఆర్.. అంటే రాహుల్‌గాంధీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిషేల్ జేమ్స్ క్రిస్టియన్ బ్రిటీషు పౌరుడు. అమెరికాలోని స్పింక్స్ మెకానికా సంస్థకు దళారీగా పనిచేస్తున్నాడు. ఇతడు ఇండియాతో సహా చాలా దేశాలకు తన సంస్థ తరఫున హెలీకాప్టర్లు సరఫరా చేస్తుంటాడు. ఆ సందర్భంలో కొందరు ప్రముఖులకు తగిన రీతిలో ముడుపులు (కమీషన్లు) సమర్పించి కాంట్రాక్టులు తెచ్చుకుంటుంటాడు. ఇది అతని వ్యాపార రహస్యం.
ఈ ముడుపుల బాగోతంలో అతనిని మిలన్ కోర్టు అభిశంసించింది. ఈయన అరబ్ ఎమిరిటస్ పారిపోయి అక్కడ దాక్కున్నాడు. ఇండియాకు కావలసిన హెలీకాప్టర్ల కొనుగోలు శ్రీమతి సోనియాగాంధీ తన సౌకర్యార్థం కొనుగోలు చేసింది. ‘‘ఎతె్తైన విమానాలు నేను ఎక్కలేను’’ అని విమానం ఎత్తును తగ్గించి కాంట్రాక్టు ఇప్పించింది. మిషేల్ తండ్రి (బ్రిటన్) ఈమెకు సన్నిహితుడు. ‘‘నా కొడుకుకు ఏదైనా పెద్ద కాంట్రాక్టు ఇప్పించండి’’ ఆయన సోనియాగాంధీని వేడుకున్నాడు. ఆ మేరకు అగస్తా వెస్ట్‌లాండ్ రక్షణ విమానాల కొనుగోలు కాంట్రాక్టు వీరికి లభించింది. ఇది 300 కోట్ల వ్యవహారం. ఇందులో మిషేల్ భారీగా కొందరికి ముడుపులు అందజేశాడు. ఈ విషయం తర్వాత పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ఆనాటి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ ‘ముడుపులు కొందరికి అందిన మాట వాస్తవమే- అందుకే కాంట్రాక్టు రద్దుచేస్తున్నాము’ అని పార్లమెంటులోనే ప్రకటించాడు.
ఇంతకూ ఈ ముడుపులు ఎవరెవరికి అందాయి? ఆనాటి రక్షణాధికారి త్యాగి కుటుంబానికి అందినట్లు నిర్ధారణ అయింది. ఇంకా కొందరి పేర్లు మిషేల్ డైరీ నోట్‌లో దొరికాయి. అవి కోడ్ నేమ్స్- అంటే పొడి అక్షరాలల్లో ఉన్నాయి. ‘‘ఎ-పి’’ అంటే ఎవరు?
1) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకుడు కావచ్చు. అప్పుడు ఎ.పి వ్యక్తి రక్షణ ఉపమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరు పళ్లంరాజు. ఐతే వ్యక్తిగతంగా పళ్లంరాజు నిజాయితీకి పర్యాయ పదం కాబట్టి ఈ ఎ-పి కేంద్ర మంత్రి ముడుపులు తీసుకున్నాడు- అని ఎవరూ నమ్మరు.
2) ఎ-పి అంటే అడ్మిరల్ ప్రకాశ్ ఇతడు రక్షణ శాఖాధికారి. ఈ కోణంలో విచారణ జరుగుతున్నది.
3) ఎ-పి అంటే అహ్మద్‌పటేల్. ఇతడు సోనియా ఇటాలియాకు రాజకీయ సలహాదారు. ఆర్థిక బినామీలను చూచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎ-పి. అంటే అహ్మద్‌పటేల్ అని నిఘా విభాగం వారు నిర్ధారించుకుంటున్నారు.
ఇక ఆర్ అంటే ఎవరు? ఇది రాహుల్‌గాంధీ పేరు పొడి అక్షరం. ‘సిగ్నోరా గాంధీ’ అంటే శ్రీమతి గాంధీ అని అర్థం. ఇక ఈ సందర్భంలో రెండు ఉత్తరాలు దొరికాయి. వాటిల్లో ‘జి’ అనే అక్షరానికి గాంధీ అని అర్థం. ‘ఇటాలియన్ వనిత కుమారుడు భవిష్యత్తులో భారత ప్రధాని కాబోయేవాడు’ అని 2010నాటి ఆ లేఖలో ఒక వాక్యం ఉంది. అంటే ‘ఆర్’ అనే పొడి అక్షరానికి రాహుల్ గాంధీ అని అర్థం. ‘‘ఆర్.వి.’’ అంటే రాబర్ట్ వద్రా అని తాత్పర్యం. ఇతనికి ముట్టిన సంపద ఎంత?? అది ఏ విదేశీ బ్యాంకులో జమచేయబడింది??
లోగడ బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి రాజీవ్‌గాంధీకి లభించిన ముడుపులు ఆయన స్వయంగా పాకిస్తాన్‌కు చెందిన ఒక బ్యాంకులో జమ చేశాడు. ఆ పాకిస్తాన్ బ్యాంకు బ్రాంచీ బొంబాయిలో ఉంది. అక్కడికి రాజీవ్‌గాంధీ ఒక నల్ల సూట్‌కేసులో డబ్బును తీసుకొని పోయి జమ చేశాడు.
ఇప్పుడు అరబ్ ఎమిరిటస్‌నుండి ఇండియాకు తరలింపబడ్డ మిషేల్‌ను సిబిఐ విచారిస్తుంటే ఆయనను విడిపించటంకోసం జోసఫ్ అనే న్యూఢిల్లీ కాంగ్రెసు నాయకుడు (లాయర్) వకాల్తా పుచ్చుకున్నాడు. ఈయన వాదం ఏమిటంటే. ఈ డైరీలు ప్రామాణికం కాదు. లోగడ జైన్ హవాలా కేసులోను సహారా కేసులోను కోర్టులు డైరీ వ్రాతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు అంటే డైరీలో ఎవరైనా ఈ పొడి అక్షరాలు వ్రాయవచ్చు. ఈ వాదం బాగుంది కదూ!!
సోదికోసం సోదికి పోతే పాత రంకులు బయటపడ్డాయి అని తెలుగులో ఒక జానపద సామెత ఉంది. అగస్తా వెస్ట్‌లాండ్ ఛాపర్ డీల్‌లోని ముడుపులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేటు మిషేల్ జేమ్స్ క్రిష్టియన్‌ను విచారిస్తుంటే కేవలం వెస్ట్‌లాండ్ ఛాపర్స్‌ల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలే కాకుండా లోగడ జరిగిన మరికొన్ని రక్షణ కొనుగోళ్ల సందర్భంలో ముట్టిన ముడుపుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. వాటిని ఇ-డి, సిబిఐ దర్యాప్తు కోర్టుకు లిఖిత పూర్వకంగా జనవరి మొదటివారంలో సమర్పించింది.
న్యాయమూర్తి అరవిందకుమార్‌కు అందిన సమాచారం ప్రకారం రక్షణశాఖ పరికరాల కొనుగోళ్లను 25 మిలియన్ యూరోలు ముట్టాయి. అగస్టా వెస్ట్‌లాండ్ ఛాపర్ల కొనుగోళ్లలో 16096245 పౌండ్ల మేరకు ముడుపులు అందాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డి.పి.సింగ్- ఎన్‌కె మిట్టాల్ అందించిన సమాచారం ప్రకారం మిషేల్ రహస్య సమాచారాన్ని క్రమక్రమంగా వెల్లడిస్తున్నట్లు అవగతమవుతున్నది. ఈ పాపం నుండి ఇక సోనియాగాంధీ తప్పించుకోజాలదు. మిషేల్‌కు బెయిల్ ఇప్పించి ఇండియా నుండి తప్పించాలని జోసఫ్ అనే కాంగ్రెస్ నాయకుడు ప్రయత్నిస్తున్నాడు. అదే జరిగితే మిషేల్ తన స్వదేశమైన బ్రిటన్‌కు పారిపోతాడు అని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు.
***
కేరళలో కాసరగోడ్ నుండి తిరువనంతపురం వరకు సిపియం మహిళలతో మానవ హారం నిర్వహించింది. ఈ ర్యాలీకి ఒకవైపు పినరాయ్ విజయన్ మరొకవైపు బృందాకారత్ నిలబడ్డారు. శబరిమలై దేవాలయంలోకి వయోభేదంతో సంబంధం లేకుండా అందరూ ప్రవేశించాలి అనేది సిపియం లక్ష్యం. విచిత్రమేమంటే ఈ మానవ హారంలో పాల్గొన్న సిపియం కార్యకర్తలు ఎవరూ ఎప్పుడూ దేవాలయాలకు వెళ్లేవారుకారు సరికదా ‘‘మతం మత్తుమందు’’ అని ప్రచారం చేసినవారే. మరి ఈ భారీ మానవహారం ఎందుకు నిర్వహించినట్లు? అంటే మరొక నూరు రోజుల తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికలలో విజయంకోసం చేస్తున్న ప్రచారంలో ఇది అంతర్భాగం. దాదాపు అన్ని సర్వేలు కేరళ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో సిపియం అధికారాన్ని కోల్పోతున్నదని కాంగ్రెస్ అధికారం చేపట్టబోతున్నదని జోస్యం చెప్పాయి. 16 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలు సిపియం, 0 స్థానాలు బిజెపి గెలుచుకోబోతున్నదని తెలుస్తున్నది. శబరిమలై సమస్య మరో అయోధ్య సమస్యలాగా రగిలించటంద్వారా రాజకీయ పక్షాలు లబ్ధిపొందుతున్నాయి. పినరాయ్‌విజయన్‌కు ప్రజాస్వామ్యం మీద కానీ శబరిమలేశుని మీద గానీ ఎట్టి విశ్వాసమూ లేదు. ఐనా అతనిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. త్రిశూర్ జిల్లాలో రిగ్గింగ్ చేసి హత్యలు చేసి అతడు బాలకృష్ణన్‌పిళ్ళై అధికారంలోకి వచ్చారు. 2019 తర్వాత అక్కడ కమ్యూనిజం అంతరించబోతున్నది. మొన్నట కేరళ వరదలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో లభించిన సహాయ సామగ్రి సిపియం కార్యకర్తలు ఇళ్లకు చేరవేసుకున్నట్లు కాంగ్రెస్- ఇతర పార్టీలు ఆరోపించాయి!
ఫ్రాంకో ములక్కల్ అనే జలంధర్ ఏరియా బిషప్ దశాబ్దాలుగా నన్స్‌మీద లైంగిక వేధింపులు జరుపుతుంటే ఈ ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకున్నాడు.
***
మధ్యప్రదేశ్‌లో కొద్దిరోజుల క్రితం కాంగ్రెసు పార్టీ కమలనాథ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి పని ‘వందేమాతరం’ గీతాన్ని పాఠశాలల్లో పాడకుండా నిషేధించటం. ఇలా ఎందుకు చేశారు? అంటే ఆ గీతం ముస్లింలకు ఇష్టంలేదు అని కమలనాథ్ సమాధానం చెప్పాడు. ఇతడు 1984 సిక్కుల హత్యకేసులో ముద్దాయి. ఇతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను శ్రీమతి సోనియాగాంధీ నీరుగార్చింది. భారతదేశంలో వందేమాతరం గీతం పాడటం పాపకార్యమైంది. దేశ విభజన తర్వాత కూడా పాకిస్తాన్ అనుకూల వర్గాల గుప్పెట్లో భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ జాతి ఎంత పాపం చేసుకున్నదో దీనినిబట్టి నిర్ధారించుకోవచ్చు. బంకించంద్ చటర్జీ రచించిన వందేమాతర గీతం స్వాతంత్య్రోద్యమాన్ని నడిపింది. ఇవ్వాళ ఆ గీతంపై కాంగ్రెసువారు నిషేధం విధించారు. అంటే ఆ పార్టీ ఎంత పతనమైందో తెలుస్తున్నది.
గుజరాత్‌లోని హైస్కూళ్లలో విద్యార్థులు ‘జైభారత్’ అని అనకూడదు అంటూ హార్థిక్‌పటేల్ వంటి ప్రతిపక్ష నాయకులు వాదిస్తున్నారు. ఇతడు అహమ్మదాబాదులో సెక్సు స్కాండల్‌లో ఓ హోటల్లో రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. వీళ్లా మన నాయకులు?? ఈ దేశానికి భవిష్యత్తు ఉందా??

-ప్రొ. ముదిగొండ శివ్రపసాద్