శిప్ర వాక్యం

విషం చిమ్ముతున్న ‘ఉగ్రనాగు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సెక్యులరిజం’ ముసుగులో మన రాజకీయ పార్టీలు గత డెబ్బది సంవత్సరాలుగా విషనాగును పాలు పోసి పోషించాయి. మరి.. అది కాటు వేయకుండా ఉంటుందా? మన దేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న విషయం తాజాగా బహిర్గతం కావడంతో ప్రజలంతా మరోసారి నివ్వెరపోయారు. జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఇటీవల 16 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లోను, పలు చోట్ల ఆరెస్సెస్ కార్యాలయాలపైన రాకెట్ లాంచర్లతో, గ్రెనేడ్లతో దాడులు చేసేందుకు వీరు వ్యూహరచన చేశారని నిఘా విభాగం అధికారులు కనుగొన్నారు.
మొత్తం 17 ప్రదేశాల్లో విధ్వంసానికి ‘టైమ్‌బాంబులు’ అమర్చాలని ఉగ్రవాదులు వ్యూహం పన్నారట! భారీ ఎత్తున ఆయుధాలను, విధ్వంసక సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పాకిస్తాన్, సిరియా వంటి దేశాల నుండి భారత్‌లోని ఉగ్రవాదులకు అందుతున్నాయనేది సుస్పష్టం. ప్రముఖ రాజకీయ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఇంజనీరింగ్ విద్యార్థిని సహా కొందరు వెల్డర్లను నిఘా విభాగం అధికారులు పట్టుకున్నారు. నిందితుల్లో కొందరు ఇస్లామిక్ మదర్సాల్లో శిక్షణ పొందారు. ఉత్తర ప్రదేశ్‌లోని పలు చోట్ల ఉగ్రవాద కార్యకర్తలను అరెస్టు చేశాక పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూశాయి. నిజానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తరప్రదేశ్‌లో సిమీ, హైదరాబాద్‌లో ఎంఐఎం, కేరళలో ముస్లిం లీగ్ వంటి మతోన్మాద ఉగ్రవాద సంస్థలను ఓటుబ్యాంకు రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషించింది. భారత్‌ను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలన్న పన్నాగంతో పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందన్నది బహిరంగ రహస్యం. ఉగ్రవాదులను అరెస్టు చేయడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. భారత్‌లోని ముస్లిం, క్రైస్తవ మతస్థులను, మావోయిస్టులను, వామపక్ష కార్యకర్తలను దేశభక్తులుగానూ మార్చడమే ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం కాగలదు.
***
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ, మావోయిస్టు పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. కేసీఆర్ ప్రభంజనంలో చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్ వంటి వారంతా కొట్టుకొని పోయారు. ఇప్పుడు సీమాంధ్రలో మధు, రామకృష్ణ, జానకీరాములు వంటి నేతల ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, ఆర్‌ఎస్‌పి వంటి పార్టీలు ఆందోళనలు మొదలుపెట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలను తాము అడ్డుకుంటామని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. సీమాంధ్రులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే మోదీ ఏపీలో అడుగు పెట్టాలని వీరు హెచ్చరిస్తున్నారు. వీరి వాదం ఏమిటంటే రైతులకు మోదీ ఎలాంటి న్యాయం చేయలేదు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు.
కమ్యూనిస్టు పార్టీలను ఇప్పటికే త్రిపుర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు పార్టీలకు తప్ప ఉభయ కమ్యూనిస్టులకు మనుగడ లేకుండా పోయింది. సాక్షాత్తూ దేశ ప్రధాని పర్యటనకు వస్తానంటే నల్లజెండాలు చూపిస్తామనడం రాజ్యాంగ బద్ధమేనా? ‘మాకు రాజ్యాంగం మీద, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఎట్టి నమ్మకమూ లేదు’ అని గతంలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ వంటి కమ్యూనిస్టు అగ్రనేతలు అన్నారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీతో తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీపీఐ వారు జతకట్టడం ఎంతవరకూ నైతికం..?
***
మన దేశంలో మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, అరసం, విప్లవం వంటి సాహిత్య సంస్థలకు కమ్యూనిస్టులు ‘ఫ్రంట్ ఆర్గనైజర్లు’గా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేరుతో జాన్‌దయాళ్, కవితాకృష్ణ, అరుంధతీ రాయ్ వంటి సెక్యులర్ వాదులు సాగిస్తున్న కార్యకలాపాలు అందరికీ తెలిసిందే! వీరికి కనువిప్పు కలిగించే ఒక వార్త ఇటీవల చైనాలో వెలుగులోకి వచ్చింది. క్యూజాన్ జియన్ అనే విద్యార్థి మావో జయంతిని జరుపుతుంటే అతడిని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించారు. ఈ సంఘటన పెకింగ్ యూనివర్సిటీలో జరిగింది. ఇలా ఎందుకు జరిగిందో భారత కమ్యూనిస్టులు ‘వివరణ’ ఇస్తారా? తియాన్‌జిన్ (చైనా) నుండి వచ్చిన మరో వార్త ఇది.. 42 ఏళ్ల వయస్సుగల వాంగ్ క్వాంగ్ జంగ్ అనే మానవ హక్కుల నాయకుణ్ణి అరెస్టుచేసి పోలీసులు కోర్టుకు పంపారు. అతడు చేసిన నేరం ఏమిటంటే భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాడటం. వాంగ్ న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. రాజ్యాధికారాన్ని ధిక్కరించి భూపోరాటాలు చేస్తున్నాడని ఈయనపై అభియోగం మోపారు. భారత మానవ హక్కుల సంఘం వారు దీనికి ఏం సమాధానం చెపుతారు?
***
ఎన్నికల్లో ప్రజలు భావోద్రేకాలతో ఓటు వేస్తారు. అంటే ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను బట్టి పార్టీల సిద్ధాంతాల్లో మంచిచెడులను నిర్ణయించలేం. ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఇటీవల భాజపా ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ నేతల దేశభక్తిని శంకించలేం. కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన వారి అవినీతి, విదేశీ భక్తి ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో కమ్యూనిజం పూర్తిగా ఓడిపోయింది. అందుకు కారణం వారి హింసాప్రవృత్తిని సమాజం అసహ్యించుకోవటం. వారి వర్గ కలహ సిద్ధాంతాన్ని జనం తిరస్కరించటం. అంతమాత్రాన ఆర్థిక అసమానతలు నివారించడంలో కమ్యూనిస్టుల పాత్ర లేదని చెప్పలేము. ఆర్థిక శోషణ ఉన్నంతవరకు ఏదో ఒక పార్టీ నేతృత్వంలో ఏదో ఒక ఉద్యమం పుట్టుకొని వస్తూనే ఉంటుంది.

***
‘ట్రిపుల్ తలాక్ బిల్లు దుర్మార్గం.. ఇది షరియత్ మతచారం’ అని కొందరు ముస్లిం పెద్దలు సమర్ధించటం వారి మత ఛాందస వాదానికి నిదర్శనం. తలాక్ బిల్లును లోక్‌సభలో మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించడం సరే. మరి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎఐడిఎంకెలు ఎందుకు దీన్ని వ్యతిరేకించాయి? తలాక్ అనే అమానవీయ సాంఘిక దురాచారాన్ని సోనియా గాంధీ అనుచరులు ఎందుకు బలపరుస్తున్నారు?
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్