శిప్ర వాక్యం

ఢిల్లీలో దుర్జనోపాఖ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీహైకోర్టు మొన్న ఒక తీర్పు వెలువరించింది. నేటికి ముప్పది నాలుగు సంవత్సరాల క్రితం - అంటే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి నేరస్థులకు శిక్ష ఖరారు చేసింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాహుల్‌గాంధీకి ప్రియమిత్రుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన సజ్జనకుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకుడు కాల్చి చంపాడు. అతడు సిక్కు మతస్థుడు. దానితో ఢిల్లీ, పంజాబు ప్రాంతాల్లో కొన్ని వేల మంది అమాయక సిక్కులను కాంగ్రెస్ నాయకులు కత్తులతో పొడిచి చంపారు. అలాంటి వారిలో ఈ సజ్జనకుమార్ ఒకడు. ఈ దుర్మార్గాలను స్వయంగా చూచినవారు నేటికీ సజీవంగానే ఉన్నారు (ఐ విట్‌నెస్). ఢిల్లీ అల్లర్లకు సంబంధించి కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు అప్పుడు నమోదు చేయబడ్డాయి. నానావతి కమిటీ విచారణ జరిగింది. ఐతే తర్వాతి కాలంలో శ్రీమతి సోనియాగాంధీ ఈ కేసులన్నింటినీ నీరుకార్చింది. సజ్జనకుమార్‌కు ఇప్పుడు డెబ్బదిమూడు ఏండ్లు. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు అతనికి ముప్పది ఏండ్లు. ‘నాకు పదిహేనేండ్లు. అందుకని ఆ వివరాలు అంతగా తెలియదు’ అన్నారు రాహుల్‌గాంధీ. అసలు ఈ కేసు ఇన్ని దశాబ్దాలు ఎందుకు పట్టింది?? ఇప్పుడు కూడా సజ్జనకుమార్‌కు న్యాయ సహాయం అందించడానికి మళ్లీ కాంగ్రెస్‌వారు ముందుకు వచ్చారు. 1984లో ఎఫ్‌ఐఆర్ నమోదుచేయబడిన వారిలో జగదీశ్ టైట్లర్- కమల్‌నాథ్ వంటి మరికొందరు కాంగ్రెసులో నేడు ఉన్నారు. ఈ కమల్‌నాథ్ తర్వాతి కాలంలో కేంద్రమంత్రిగా పనిచేశాడు. నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఇది తప్పు అని ఎవార్డ్ వాపసీ బ్రిగేడ్ అనలేదు. ఎందుకని? కమలనాథ్ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగబోతున్నాయి.
***
అతి కష్టంమీద అగస్తా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో సూత్రధారి మిషేల్ జేమ్స్ క్రిస్ట్ఫర్‌ను అరబ్ ఎమిరిటస్ నుండి మొన్న ఇండియాకు తెప్పిస్తే అతనిని విడుదల చేయించటంకోసం కాంగ్రెసు నాయకుడు జోసఫ్ అనే లాయర్ వకాల్తా తీసుకున్నాడు. ఇది దేనిని తెలియజేస్తున్నది??
మహాత్మాగాంధీ నడిపిన కాంగ్రెసు పార్టీ ఎప్పుడో అంతరించిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇటాలియన్ మాఫియా గాంగ్ పార్టీ.
***
ఎక్కడ సమ్మెలు, ఆందోళనలు ఉంటాయో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. బెంగాల్, త్రిపుర దివాలాతీయడానికి ఇదే కారణం. ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షురాలు బి.విజయలక్ష్మి విశాఖపట్నంలో మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్త సమ్మెతో మోడీకి గుణపాఠం చెప్పండి’ అని పిలుపునిచ్చింది. ఇలాంటి దేశవ్యాప్త సమ్మెలు చైనాలో ఎవరైనా చేస్తాము- అంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇండియాలో డెమోక్రసీ పేరుతో మాబోక్రసీని ప్రోత్సహించారు. ఫలితంగానే ఈ సమ్మెలు, ఆందోళనలు. భారతదేశాన్ని ముక్కలుముక్కలు చేయండి అని పిలుపునిచ్చిన న్యూఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయకుమార్‌ను విశాఖపట్నం పిలిచి సన్మానించారు. చైనాను ముక్కలు చేయండి అని బీజింగ్‌లో ఎవరైనా పిలుపునిస్తే అతనిని షంఘై తీసుకుపోయి సన్మానం చేస్తారు?
2019లో జరుగబోయే పార్లమెంటు ఎన్నికలలో బెంగాల్ రాష్ట్రంలో మమతాబెనర్జీ 32 స్థానాలు, బిజెపి 10 స్థానాలు గెలుచుకోబోతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. అలాగే కేరళలో కాంగ్రెసు 16 స్థానాలు, సిపియం 4 స్థానాలు గెలుచుకోబోతున్నది. పిన్నరాయ్ విజయన్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నది. అంటే 2019లో కమ్యూనిస్టు ముక్త్భారత్ సాకారం కాబోతున్నదని అర్థం. అందుకే బాబూసుప్రియో, బి.వి.విజయలక్ష్మి, కామ్రెడ్ కె.నారాయణ, ఏచూరి సీతారాం వంటివారు ‘మోడీ హఠావో’ ఉద్యమం మొదలుపెట్టారు.
***
బెంగాల్‌లో బిజెపి ధార్మిక రథయాత్రలను మొదలుపెడితే అక్కడి టిఎంసి ప్రభుత్వం నిషేధం విధించింది. దానితో బిజెపివారు కోర్టుకెక్కారు. ప్రజాస్వామ్యంలో ధార్మిక ప్రచారం చేసుకునే అధికారం ఎవరికైనా ఉన్నదని హైకోర్టు బిజెపికి అనుకూలంగా తీర్పువెలువరించింది. ఇప్పుడు మమతాబెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లి అయినాసరే ధార్మిక రథయాత్రలను ఆపాలని ప్రయత్నిస్తున్నది. ఎందుకని? ఆమె తల్లి ముస్లిం. తండ్రి బ్రాహ్మణుడు అంటే మమతాబెనర్జీలో ఇస్లామిక్ మత ఛాందసవాద (్ఫండమెంటలిజం) లక్షణాలు ఉన్నాయి. మరే ఇతర మతాన్ని సహించకపోవటం ఫండమెంటలిజం లక్షణం. మాల్దా ప్రాంతంలో రెండు కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులున్నారు. వారి ఓట్లమీద మమత ప్రభుత్వం ఆధారపడి పాలన సాగిస్తున్నది. దేశ రక్షణ- సమగ్రత ఎవడికి కావాలి? బ్రతికినంత కాలం ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చాలు- అనుకునే ధోరణి మన నాయకులలో ప్రబలింది. ‘చొరబాటుదారులను బంగ్లాదేశ్‌కు పంపండి’ అని కేంద్రం కోరితే ‘అంతర్యుద్ధం వస్తుంది జాగ్రత్త’ అని మమతాబెనర్జీ హెచ్చరించింది. కమ్యూనిస్టు మహిళా కార్యకర్తలను గ్యాంగ్‌రేప్ చేయండి అని టిఎంసి నాయకుడు ఎంపీ తపస్ తేజ్‌పాల్ లోగడ పిలుపునిచ్చాడు. ఇలాంటి తృణమూల్ పార్టీకి సిపియం మద్దతు తెలుపుతున్నది. ఎందుకు??
‘అందరం కలిసి మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేద్దాం’ అంటున్నారు. ఇక ఈ దేశానికి దిక్కెవరు??
***
2019 జనవరి మొదటివారంలో మంగళగిరిలో భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించే కార్యక్రమం ఏర్పాటయింది. ‘ఈ మోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఎలా అడుగుపెడతాడు?’ అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొన్న సిబిఐ నిఘా విభాగంవారు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడానికి వీలులేదు అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ‘ఈ జివిఎల్ అచ్చోసిన ఆంబోతులా ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతున్నాడు’ అని ఒక తెలుగుదేశం నాయకుడు టి.విలో అన్నాడు. జివిఎల్ స్వస్థలం మాచర్ల ప్రాంతం. అంటే ఆయన తెలుగువాడు. పైగా రాజ్యసభ సభ్యుడు. మరి జివిఎల్ ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించకూడదు? ఇదంతా చూచిన తర్వాత ఇండియాలో ఫెడరలిజం విఫలమయింది-అని తేలుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం భాషాప్రయుక్త రాష్ట్రాలను రద్దుచేయటం. లేకుంటే ఇండియా మరొక రష్యాలాగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది.
***
దెబ్బతిన్న పాము కాటువేయక మానదు. తెలంగాణాలో ప్రజాకూటమి ఎన్నికలలో ఓడిపోయింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని వారు ఎదురుచూస్తున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలని ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.
ఒకటి మాత్రం నిజం. కెసిఆర్-కెటిఆర్‌లను ఈ ప్రజాకూటమి సుఖంగా నిద్రపోనివ్వరు. ఏదో సమస్యను సృష్టిస్తారు. దానిని తెలంగాణా ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుందో వేచి చూడాలి. కాంగ్రెసేతర బిజెపి ఇతర ఫ్రంటు పెట్టాలని కెసిఆర్ దేశమంతా తిరగాలి అనుకుంటున్నాను. సంతోషం. ముందు హైదరాబాద్‌లో ఉత్తమకుమార్‌రెడ్డి, కోదండరామిరెడ్డి సృష్టించబోయే సమస్యలను ఎదుర్కోవటం అవసరం!!
***
మెషిల్ జేమ్స్ క్రిస్టియన్ డైరీలో కోడ్‌నేమ్స్ ఉన్నాయి. వాటిని నిపుణులు డికోడ్ చేస్తున్నారు. సిగ్నోరా అనేది ఇటాలియన్ భాషలో శ్రీమతి అని అర్థం. సిగ్నోరాగాంధీ అంటే శ్రీమతి గాంధీ అని మిలన్ కోర్టు నిర్ధారించింది. మరి ఎపి అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ కాదు. ఎ.పి. అంటే అహ్మద్‌పటేల్. ఈయనగారు శ్రీమతి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు. అంటే అగస్తా వెస్ట్‌లాండ్ ఛాపర్ డీల్‌లో మిడిల్‌మన్ ద్వారా బీనామీ లావాదేవీలు నడిపింది ఈ అహ్మద్‌పటేల్ అని పరిశీలకులు భావిస్తున్నారు.
***
అఫ్జల్‌గురు కేసు 25 సంవత్సరాలు నడిచింది. యూనియన్ కార్బయిడ్ (్భపాల్ గాస్) కేసు 30 సంవత్సరాలు సాగదీశారు. సజ్జనకుమార్ కేసు 34 ఏండ్లు పట్టింది. ప్రస్తుతం పి.చిదంబరం కార్తి, రాహుల్, సోనియా నేషనల్ హెరాల్డ్ కేసు వాయిదాలమీద వాయిదాలు పడుతున్నాయి. ఇవి మరో పాతికేళ్లు పట్టవచ్చు. న్యాయస్థానాలను ఎవరూ ప్రశ్నించకూడదు. అది కోర్ట్ధుక్కారం కిందికి వస్తుంది.
యువర్ ఆనర్!
ముప్ఫై వారాలు అయితే ఫరవాలేదు కాని ముప్పది సంవత్సరాలు కేసులు సాగటం ‘‘న్యాయమా?’’

ప్రొ.ముదిగొండ శివప్రసాద్