శిప్ర వాక్యం

అనైక్యతే జాతికి శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికన్లు అమెరికాను ప్రేమిస్తారు... రష్యన్లు రష్యాను ఆరాధిస్తారు... బ్రిటీషువారు ‘రవి అస్తమించని’ సామ్రాజ్యం కోసం తహతహలాడుతారు... కానీ- భారతీయులు మాత్రం అమెరికాను, చైనాను, రష్యాను, సౌదీ అరేబియాను, జెరుసలేంను ప్రేమిస్తారు. జెరుసలేం ముత్తయ్యలు, వోల్గాలు, వాహెబ్ జరీనాలు ఇండియన్లు పెట్టుకునే గౌరవప్రదమైన పేర్లు. భారతీయులు భారత్‌ను ఎందుకు ప్రేమించడం లేదు? ఈ జాతి చేసుకున్న పాపం ఏమిటి? అమెరికాలో నిర్మించిన ‘టెన్ కమాండ్‌మెంట్స్’ సినిమాకు ఇండియాలో శత దినోత్సవ వేడుకలు జరిపించిన కళాపోషణ మనది.
ఈ విషయాలు ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే- మన దేశంలో జాతీయవాదం గోరంత అభివృద్ధి చెందినా దానిని అణచివేయడానికి కొం డంత ప్రయత్నాలు జరుపుతున్నది భారతీయులే. హైదరాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ వంటి భాజపా నాయకులు ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతే కొందరు విజయోత్సవాలు జరుపుకున్నారు. ‘తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా ఓడింది.. నరేంద్ర మోదీ కూడా ఓడిపోవాలి...’ ఇలా శాపనార్థాలు పెడుతున్నారు కొందరు. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఫలానా పార్టీ వారు, కొందరు నేతలు ఓడిపోతే- ఒకే జాతిగా ఉన్న వారిలో ఇంతటి విద్వేషాలెందుకు? 1977లో ఇందిరాగాంధీ రాజ్‌నారాయణ్ అనే రాజకీయ విదూషకుడి చేతిలో ఓడిపోయింది. ముఖ్యంగా హిందువుల్లో అనైక్యత ఎక్కువ కావడంతో ఇలాంటి జాతి వ్యతిరేక భావాలు, విద్వేషాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి.
‘హిందువులు అభివృద్ధి చెందకూడదు. హిందూ మతం సర్వనాశనమైపోవాలి. హిమాలయ పర్వతశ్రేణి రాజ్యాలను చైనా ఆక్రమించుకోవాలి- భారతీయులందరినీ క్రైస్తవులుగా మార్చాలి. ఇండియా మరొక పాకిస్తాన్‌గా మారాలి..’ - ఇదీ శత్రువుల వ్యూహ రచన. ఆ శత్రువులే జాతి వ్యతిరేకతను, అనైక్యతను రెచ్చగొడుతున్నారు. ఈ ధోరణి ఇంకా ముదిరిపోతే- జాతి భవిష్యత్ ఏమిటి?
1947కు ముందు ఇండియాను బ్రిటీషు దొరలు పరిపాలిస్తూ ఉండేవారు. అంతకుముందు 600 సంవత్సరాలు అరబ్బులు, ఫ్రెంచివారు పోర్చుగీసువారు, డచ్చివారు, మొగలులు పరిపాలించారు. ఇప్పుడు భారతదేశాన్ని మళ్లీ వాటికన్ పోప్ పరిపాలిస్తాడు లేదా సౌదీ అరేబియా షేక్ పాలిస్తాడు. ఈ పరిస్థితి వచ్చేందుకు రాత్రింబవళ్లు మన దేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, సెక్యులర్ వాదులు శక్తివంచన లేకుండా కృషిచేస్తారు.
మన దేశంలో హిందువులు 80కోట్ల మంది ఉన్నారు. వీ రంతా ఎందుకు అణచివేతకు గురికావాలి? మెజారిటీ వర్గమైన హిందువులను కాదని, మైనారిటీ మతస్థులను మన నాయకులు ప్రసన్నం చే సుకునేందుకు అనేక రాయితీలు ఇస్తుంటారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ప్రతి గ్రామంలో చర్చిలు నిర్మిస్తానని ఇటీవల నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓటమి చెందిన కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి ప్రచార సభల్లో హామీలిచ్చారు. తాము అధికారం చేపడితే చర్చిలకు, మసీదులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాగ్దానం చేశారు. మరి హిందూ దేవాలయాలు ఏం పాపం చేసుకున్నాయి?
ఔను..! హిందువులలో ఐకమత్యం లేదు. ఈ దేశంలో వెలమలు, రెడ్లు, కాపులు, కమ్మ, బ్రాహ్మణ, వైశ్యులు ఉన్నారు. మాల మాదిగ, యాదవులు ఉన్నారు. కాని ‘హిందువులు’ లేరు. ఇదే వేయేండ్ల భారతదేశ చరిత్ర! ఒక సిద్ధాంతంగా కమ్యూనిజం ఫ్రపంచవ్యాప్తంగా విఫలమైంది. కమ్యూనిజం ఆచరణ సాధ్యం కాదని రష్యా, చైనాలు నిరూపించాయి. చైనాలో నేడు కమ్యూనిజం లేదు, కేవలం వలసవాదం ఉంది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదం వుంది. కాని ఇండియాలో మాత్రం చైనాను ఆరాధించేవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. బీజింగ్‌లో వర్షం పడితే హైదరాబాద్‌లో గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు. భారతదేశంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ వంటి అనేకానేక విభాగాలు కమ్యూనిజంలో ఉన్నాయి. వీరిలో ఒకరిని చూస్తే మరొకరికి ఉప్పూ నిప్పూ. ఐనాసరే స్థూలంగా అందరూ ఇండియాను ద్వేషిస్తారు. బ్రాహ్మణులను, వైశ్యులను కించపరచిన కంచె ఐలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో సన్మానాలు చేస్తుంటారు. ఈ దేశాన్ని ముక్కలు చేయండని నినాదాలిచ్చిన జెఎన్‌యూ విద్యార్థి నేత కన్హయకుమార్‌కు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరి వంటి నేతలు బాహాటంగా మద్దతు పలుకుతారు. ఇదీ మన దేశ ఆధునిక దృశ్యం.
తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడానికి ఎటువంటి సైద్ధాంతిక సామరస్యం, సమభావం లేని పార్టీలు ఏకమై, అనైతిక బంధాన్ని చాటుకున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం, ఆర్.కృష్ణయ్య, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, చాడ వెంకటరెడ్డి వంటి నేతలు ‘ప్రజా ఫ్రంట్’ పేరిట ఓట్ల పండగలో జత కట్టారు. వీరిమధ్య భావసారూప్యత ఏమిటి? కేసీఆర్ పాలనాపరంగా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కాని ఆయన దేశభక్తిని, దైవభక్తిని ఎవరూ సంశయింపవలసిన పనిలేదు. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో సోనియా గాంధీ పాదాల చెంత ఎన్‌టిఆర్ ఫొటోను పెట్టినవారిని దేశభక్తులు అనగలమా? యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు ముఖ్యం. వాటిని అనుకున్నంత స్థాయిలో మోదీ ప్రభుత్వం ఏర్పరచలేక పోతోంది. అంతమాత్రాన భాజపా దేశభక్తిని శంకించే అర్హత విపక్ష పార్టీలకు గానీ, ‘సెక్యులర్ వాదుల’మని చెప్పుకొనే నేతలకు గానీ లేదు.
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్