శిప్ర వాక్యం

విపత్తుల వేళ.. వాదనలేల..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో ఇటీవలి జల ప్రళయాన్ని ‘మానవుడి స్వయం కృతాపరాధం’ అన్నారు పర్యావరణ శాస్తవ్రేత్తలు. ఆ రాష్ట్ర బయో డైవర్సిటీ సంస్థ చైర్మన్ వి.ఎస్.విజయన్ మాత్రం- ‘గాడ్గిల్ నివేదికను తిరస్కరంచటమే ఈ జల ప్రళయానికి కారణం’ అని తేల్చారు. పడమటి కనుమలలో ఏటవాలు ప్రాంతాల్లో పంటలకు బదులు పండ్లచెట్లను పెంచి ఉండాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుకు రమేష్ చెన్నితల మాట్లాడుతూ, ‘జలాశయం నుండి నీరు వదిలేటప్పుడు రెడ్ ఎలర్ట్ ప్రకటించక పోవటంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి’ అని ఆరోపించగా, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ వాదనను కొట్టిపడేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విడుదల చేసిన ‘పడమటి కనుముల’ నివేదికలో కూడా ఇది ‘మానవ తప్పిదం’ అని పేర్కొన్నారు. పాలకులు రాజకీయ, వ్యక్తిగత స్వార్థాలకు లొంగిపోయి ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలు దేశానికి అపకారం తెస్తున్నాయి. ఇలా ఎన్నిసార్లు జరిగినా నేతలు గుణపాఠం నేర్చుకోలేదు.
* * *
బక్రీద్ నాడు కశ్మీరు రాజధాని శ్రీనగర్‌లో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మసీదులో ప్రార్థనలకు వెళ్లగానే ఆయనపై కొందరు చెప్పులు విసిరారు. ఇంకొందరు పాకిస్తాన్ జెండాలను ఎగురవేసి, ఐసిస్ జెండాలను పట్టుకొని తిరిగారు. ఇదంతా పాకిస్తాన్ చేయిస్తున్నది వేరే చెప్పనక్కరలేదు. ‘్భరత్ మాతాకీ జై- జైహింద్..’ అని ఫరూక్ నినాదాలివ్వడాన్ని పాక్ ప్రేరిత ఉగ్రవాదులు సహించలేకపోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ- ‘పాపం నిరుద్యోగ యువకులు తిండి లేక పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐసిస్)లో చేరుతున్నారు..’ అన్నారు. గతంలో కశ్మీరుకు చెందిన మహిళా న్యాయవాది షబ్నం లోనీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తిండిలేక కశ్మీర్ యువకులు ఉగ్రవాదులుగా, ఐసిస్ కార్యకర్తలుగా మారుతున్నారన్న వీరి వాదన తార్కాకమైనదేనా? ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తిండి లేకే ఉగ్రవాద చర్యలకు దిగాడని భావించలా? బాధ్యత గల రాజకీయ నేతలు, మేధావులు ఇలా మాట్లాడితే దేశం ఎటుపోతుంది?
***
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు కేరళ ప్రభుత్వం ఇప్పుడు నెపాలను ఇతరుల మీద నెడుతోంది. వరద బాధితులకు కేంద్రం తగిన సహాయం అందించలేదని ఆక్షేపించడమే గాక మరోవైపు తమిళనాడుతో కయ్యానికి కాలు దువ్వింది. తమిళనాడులోని ములపెరియ డ్యామ్ నీరు కేరళలోకి ప్రవేశించటం వల్లనే వరదలు వచ్చాయని కేరళ సీఎం నిందలు వేశారు. ఈ నిందల్లోని నిజానిజాలను ఇరగేషన్ శాఖ నిపుణులు నిగ్గుతేల్చాల్సి ఉంది. కేంద్రం ఇచ్చే నిధులు సరిగ్గా వినియోగమవుతున్నాయా? అన్నది సందేహం. కేరళకు భారీగా సాయం చేస్తే, మా సంగతేమిటని కర్నాటక సీఎం కుమారస్వామి అడుగుతున్నారు. నిజమే.. ఏ ప్రాంతంలో కష్టాలు వచ్చినా ఆదుకోవాల్సిందే. తెలంగాణలోని ఆదిలాబాద్ మాటేమిటి? ఆంధ్రపదేశ్‌లోనూ ఇటీవల కొన్ని జిల్లాల్లో తుపాను బీభత్సం పెను నష్టాన్ని కలిగించింది. కృష్ణా జిల్లాలో ఎంతోమంది పాము కాట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. వీరిని కూడా కేంద్రం ఆదుకోవాలి కదా?
* * *
లక్ష్యసాధన కోసం నిరంతరం వ్యూహాలను మార్చడం ప్రపంచ చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాము. యూరోపియన్ రాజ్యాలు పారిశ్రామిక యుగం తర్వాత తమ ఉత్పత్తులకు మార్కెట్లను అనే్వషిస్తూ వలస దేశాలను వెతుక్కున్నారు. ఇండియా వంటివి వారికి అనుకూలంగా కనపడ్డాయి. బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా, పోర్చుగల్, డచ్ వంటి ఎన్నో దేశాలు ఇండియాను తమ కాలనీగా మార్చాయి. ఆ దశలో వారు ద్విముఖ వ్యూహం అనుసరించారు. ఒకటి- క్రైస్తవ మత వ్యాప్తిలో హిందూ బౌద్ధమతాలను నిర్మూలించటం, రెండవది- స్థానిక మతాలలో ఆర్య ద్రావిడ విభేదాలు సృష్టించటం. ఈ రెండు వ్యూహాలూ ఫలించాయి. 1947లో ఇండియా స్వాతంత్య్రం పొందిన తర్వాత క్రైస్తవ మత వ్యాప్తి పెరిగిందే కాని తగ్గలేదు. తమిళనాడులో ద్రవిడ వాదం ఎక్కువై ప్రత్యేక ద్రవిడ దేశం కోరుకునే దశకు చేరింది. కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా మొదటి దశలో స్వతంత్ర పోరాటాలు జరిపారు. 1948లో తెలంగాణ సాయుధ పోరాటం విఫలమైన తర్వాత వారు వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో అంచెలు అంచెలుగా చేరిపోయారు. ఈ ధోరణి నెహ్రూ యుగంలో మొదలైంది. 1950వ దశకంలో భూస్వామ్య వ్యవస్థ, సంస్థానాధీశుల వ్యవస్థ రద్దు కావడం, ఇందిరాగాంధీ హయాంలో రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు కమ్యూనిస్టులు సాధించిన విజయాలే.
***
ప్రస్తుత తెలంగాణ రాజకీయాలను అర్థం చేసుకోవటానికి కొంత చారిత్రక దృష్టి అవసరం. 1948లో తెలంగాణ భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేయగా, భూస్వాములు రజాకార్లతో కుమ్మక్కయ్యారు. 2000-2014 మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమంలో భూస్వామ్యవర్గాలు, కమ్యూనిస్టులు కలిసి సీమాంధ్ర వలస దారులకు వ్యతిరేకంగా పోరాడారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కమ్యూనిస్టులు మళ్లీ కాంగ్రెస్ భూస్వాములతో కలిసి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇది 2018లోని మూడవ దశ. ఈ ఉద్యమానికి ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్ వంటి వారు నాయకులు. ‘విదేశీ వలసవాదులను ఎదుర్కోవాలంటే స్వదేశీ భూస్వామ్య వర్గాలతో కలిసి వ్యూహాత్మకంగా పోరాడండి’ అని లెనిన్ చెప్పాడు. ఇదే వర్తమాన తెలంగాణ రాజకీయ అంతర్గత సిద్ధాంతం అంటే- సీమాంధ్రులను ఓడించినట్లే. కాంగ్రెస్‌ను తర్వాతి దశలో ఓడించాలన్నది తెలంగాణ కమ్యూనిస్టుల వ్యూహం.
***
మోజెస్ నాయకత్వంలో ఈజిప్టు నుండి సినాయ్ పర్వతం వరకు ఇజ్రాయిలీలు సుదీర్ఘ ప్రయాణం చేశారని బైబిల్‌లో ఉంది. ఇలాంటిదే చైనాలో ఒక ప్రయాణం జరిగింది. దానినే ‘లాంగ్‌మార్చ్’ అంటారు. దాదాపు 6000 మైళ్లు మావో సేటుంగ్ నాయకత్వంలో చైనా కమ్యూనిస్టులు సుదీర్ఘ యాత్ర జరిపారు. ఈ ‘లాంగ్‌మార్చ్’ 1934లో జరిగింది. తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరాం తన యాత్రకు లాంగ్‌మార్చ్, మిలియన్ మార్చ్ అని పేర్లు పెట్టడంలో అంతరార్థం ఏమంటే- కేసీఆర్ ప్రభుత్వాన్ని- ఆనాడు (1933లో) కొమింటాంగ్ ప్రభుత్వాన్ని మావో ఎదుర్కొన్నట్లు పోరాడాలని. అర్మన్- రూరల్- జంగిల్ అతివాద వర్గాలకు కాంగ్రెస్ నుంచి సహాయం అందటం వర్తమాన రాజకీయం. దీనిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు?
***
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం ద్వారా తెలంగాణలో కేసీఆర్ విజయావకాశాలను చంద్రబాబు ఏ మేరకు దెబ్బతీస్తాడన్నది ఇప్పుడే చెప్పలేం. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్- తెదేపాల మధ్య పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే అక్కడ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం ఇక పగటికలే. పవన్ కల్యాణ్, వైఎస్ జగన్‌లను ఎదుర్కొనేందుకు చంద్రబాబుకు ఈ పొత్తు మేలు చేస్తుందా? జగన్ గెలిస్తే- ఆ తర్వాత తెదేపా, కాంగ్రెస్‌ల భవిష్యత్ ఏమిటి? ఇక, కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం అంపశయ్యపైనే ఉంది. కేవలం 37 సీట్లు గెలిచిన జెడిఎస్‌కు- సీఎం పీఠం అప్పగించడం ప్రజాస్వామ్యంలోని ఒక వికృతి. అధికారం కోల్పోయాక సిద్ధరామయ్య (కాంగ్రెస్) కుమారస్వామిని నిద్రపోనీయటం లేదు. కర్నాటకలోని ప్రధాన పార్టీల ముఖ్యనేతలందరూ కులం బలంతోనే అన్నీ సాధ్యమని భావిస్తున్నారు. కుమారస్వామి సర్కారు ఏ క్షణంలోనైనా పడిపోవచ్చునని విశే్లషకుల అంచనా. *

ప్రొ. ముదిగొండ శివప్రసాద్