శిప్ర వాక్యం

మన స్వాతంత్య్రం నిలుస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విన్‌స్టన్ చర్చిల్ ఎందుకు గొప్పవాడు? సమర్ధవంతంగా బ్రిటన్‌ను పాలించినందుకా? జాతిని చైతన్యపరిచే ప్రసంగాలు చేసినందుకా? కాదు.. సత్యం చెప్పినందుకు. మహాత్మా గాంధీతో ఆయన ఓ సందర్భంలో- ‘్భరతీయులు తమను తాము పరిపాలించుకోజాలరు. మీరు ఇతరుల చేత పాలించబడేందుకే పుట్టారు. ఒకవేళ మేం స్వాతంత్య్రం ఇచ్చినా దాన్ని మీరు నిలుపుకోజాలరు’ అన్నాడు. ఏడు దశాబ్దాల క్రితం చర్చిల్ చెప్పిన మాటలు ముమ్మాటికీ సత్యం అని భారతీయులు నిరూపించారు. మాకు ఇండియా పాలన వద్దు- మా చైర్మన్ మావో అని బహిరంగంగా ప్రకటించారు.
‘భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయండి’- అని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కన్నయకుమార్ అనే విద్యార్థి నాయకుడు బహిరంగంగా ప్రకటిస్తే- కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద కేజ్రీవాల్, కమ్యూనిస్టు నేత ఏచూరి సీతారాం బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ- కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మావోయిస్టులకు మద్దతునిస్తున్నదని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన భీం-కోరెగాం అల్లర్ల సందర్భంగా రోనా విల్సన్ అనే అర్బన్ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ల్యాప్‌టాప్‌లో ఆరు లేఖలు దొరికాయి. అవి మరాఠీ, హిందీ భాషలలో ఉన్నాయి. భారత ప్రధాని మోదీ, భాజపా నాయకులు యం.వెంకయ్యనాయుడు, మనోహర్ పారీకర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతలను ఎన్నికల ప్రచార సభలలో స్వేచ్ఛగా తిరుగుతున్న సమయం చూచి హత్యచేయవలసిందిగా ఆ లేఖా సారాంశం. ‘మనకు ఆయుధాల నిమిత్తం కాంగ్రెస్ నుండి నిధులు అందుతాయి’’ అని కూడా ఆ లేఖలలో పేర్కొనబడింది.
నిధులు, ఆయుధాల సేకరణకు కొందరు అర్బన్ మావోయిస్టుల సహకారం ఉంటుందని కూడా మావోయిస్టుల లేఖల్లో వెల్లడైంది. హైదరాబాదులో ‘విరసం’ నేత వరవరరావు, అహ్మదాబాదులో జిగ్నేశ్ మెమన్ వంటి వారి ద్వారా నిధులు, ఆయుధాలు జంగిల్ మావోయిస్టులకు అందుతున్నట్లు పోలీసులు ఆధారాలను సేకరించారు. అర్బన్ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేస్తే, వారిని విడిపించడానికి రొమిల్లా థాపర్ (చరిత్ర అధ్యాపకురాలు) ప్రశాంత్ భూషణ్ (లాయర్) వంటివారు కేసులు నడిపారు. అరుంధతీ రాయ్, జ్ఞాన్ దయాళ్ వంటి అంతర్జాతీయ ఆమ్నెస్టీ నాయకులు ఈ అరెస్టులను ఖండించారు. వీరికి తోడు కొన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, వామపక్ష నేతలు మావోయిస్టులకు బాహాటంగా మద్దతు పలికారు. సుధా భరద్వాజ్ వంటి అర్బన్ మావోయిస్టులు ఆదివాసీల కోసం ఎంతో కృషిచేస్తున్నారనేది వీరి వాదన. అయితే, కొన్ని వేల మంది వనవాసీ కల్యాణాశ్రమం కార్యకర్తలు శివల పద్మ, సుభద్ర, సోమయాజులు, రామచంద్రయ్య, పిరాట్ల శివరామకృష్ణ, శ్రీ్ధర్‌జీ.. ఇలా ఎందరెందరో జీవితాలను త్యాగం చేసి వనవాసుల అభ్యున్నతికి దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు. వీరం తా దేశభక్తులు. మహాశే్వతాదేవికి వచ్చినట్లు వీరందరికీ ఆదివాసీల సేవ పేరుతో ‘జ్ఞానపీఠ’ పురస్కారాలు రాలేదు.
మన దేశంపైన చైనా బహుముఖీనమైన దాడిని చేస్తున్నది. మన దసరా, దీపావళి, క్రిస్ట్‌మస్‌కు చైనా టపాసులు పంపుతున్నది. అంటే ఇండియాను (పాకిస్తాన్‌ను కూడా) చైనా తన వ్యాపారానికి కాలనీగా మార్చుకుంది. ఇది సరిగ్గా ఈస్టిండియా కంపెనీ నాటి వలస వాదం (కలోనియలిజం).
భారత్ ఇటీవల ‘అరిహంత్’ పేరుతో న్యూక్లియర్ సబ్ మెరైన్‌ను నిర్మించింది. పాకిస్తాన్‌కు ఈ స్థోమత లేదు. ఐతేనేం, చైనా తన అణ్వస్త్ర సామర్థ్యం గల సబ్ మెరైన్‌ను పాకిస్తాన్‌లోని కరాచీ రేవులో ఉంచింది. ఇక నేపాల్ మీదుగా ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, నల్లమల, వైనాడ్ (కేరళ), జాఫ్నా (శ్రీలంక)ల మీదుగా రెడ్ కారిడార్‌ను చైనా నిర్మించింది. ఇలా బహుముఖీనమైన వ్యూహంతో భారత్‌ను ధ్వంసం చేయడానికి చైనా సిద్ధపడింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాదు నుండి సాంస్కృతిక సాహిత్య బృందాలను, వామపక్ష భావాలుగల వారిని చైనా ఆహ్వానించింది. ప్రొఫెసర్ ఎన్.గోపీ, మహాకవి శ్రీశ్రీ వంటివారు ఇలా చైనా వెళ్లివచ్చినవారే. కానీ, ఇపుడు భారత్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తమ విద్యార్థి సంఘాలను నిర్మించి చైనా అరాజకాన్ని సృష్టిస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మావోయిస్టు మద్దతుదార్లను కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా సమర్ధించడం మరొక ఎత్తు.
***
శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేసింది. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ జన సమితి నాయకుడు, అర్బన్ మావోయిస్టు సానుభూతిపరుడు ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కమ్యూనిస్టులు చాలాకాలం క్రితమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పదవులు అలంకరించారు. ఈ పరిణామాలన్నీ చైనా వ్యూహంలో భాగమేనా? ఇప్పటికే కేంద్ర సాహిత్య, సంగీత, నాటక అకాడమీలను వామపక్షాల వారు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అవార్డులు పొందినవారిలో కొందరు మోదీ నిరంకుశ పాలన నశించాలంటూ తమ పురస్కారాలను వదులుకున్నారు.
***
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం అలిపిరి (తిరుపతి) వద్ద మావోయిస్టులు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యాప్రయత్నం చేశారు. ఐతే ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అధికారాన్ని కోల్పోయిన పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు. కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదిపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఇపుడు కొత్తదారి పట్టించాడు. కాంగ్రెస్ పార్టీతో ఆయన చేతులు కలపడం పట్ల విమర్శలు వస్తున్నాయి. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైనా కాంగ్రెస్ వైఖరిలో మార్పు రావడం లేదు. మావోయిస్టులకు నిధులు, ఆయుధాలను ఆ పార్టీ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వరద వచ్చినప్పుడు గడ్డిపోచ దొరికినా పట్టుకొని ప్రాణరక్షణ చేసుకోవాలని అనుకోవటం సహజం. ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడు చంద్రబాబు నాయుడి పరిస్థితి అలా ఉంది. ఆయన తన రాజకీయ అస్తిత్వం కోసం సిద్ధపడ్డాడు. కాంగ్రెస్‌తో జట్టు కట్టడమే కాదు, దేశంలోని అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాలుగు సంవత్సరాలు బిజెపితో సహజీవనం చేసి, ఇపుడు రాజకీయ మనుగడ కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ నీడకు చేర్చాడు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులపైనా వందలాది అవినీతి ఆరోపణలున్నాయి. దేశంలో దొంగల ముఠాలన్నీ మళ్లీ కలుస్తున్నాయి. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతాడా? కాదా? అనే సంగతి ఎలా ఉన్నా- దేశంలో ప్రస్తుత పరిణామాలను చూసి చైనా, పాకిస్తాన్‌లు పండుగ చేసుకుంటాయని వేరే చెప్పనక్కరలేదు.
* * *
అగర్వాల్ అనే ఓ పెద్దమనిషి భారతదేశపు క్షిపణి నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్‌కు అమ్ముతూ మొన్న పట్టుబడ్డాడు. సరిహద్దుల్లో భారత సైనికుల మోహరింపును ఫొటోలు తీసి పాకిస్తాన్‌కు పంపుతూ తాజాగా ఒక ముస్లిం సైనికుడు పట్టుబడ్డాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కరాచీ వెళ్లి నరేంద్ర మోదీని ఓడించడానికి సహాయం చేయాలంటూ పాక్ సైనిక ప్రతినిధిని అభ్యర్థించాడు. ‘ఎన్నికల్లో నాకు సీటు రాకపోతే ప్రాణాలు తీసుకోను. ప్రాణాలు తీస్తాను’ అన్నాడొక తెలంగాణ ప్రాంత నాయకుడు. ఇదీ మన భారతదేశ వర్తమాన ముఖచిత్రం. *

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్