రాష్ట్రీయం

నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్ల నిర్మాణంపై మంత్రి శిద్దా హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబర్3 : రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రోడ్లు, భవనాల మంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లోనూ రోడ్ల నిర్మాణంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్మాణ సమయంలోనే తరచూ తనిఖీలు చేస్తుండాలని, ఎక్కడైనా నాణ్యత లోపించినట్టు తేలితే వెంటనే పరిస్థితి సరిదిద్దాలన్నారు. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్ ఎంతటి వాడైనా ఉపేక్షించవద్దని, నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచబ్యాంకు నిధులతో నిర్మిస్తున్న రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం జరగాలని, లేని పక్షంలో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయస్థాయిలో పరువు పోతుందన్నారు. రోడ్లతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యుబి), రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌ఓఆర్) లను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇసుక మాఫియాతో బాబు సర్కార్ కుమ్మక్కు
వైకాపా నేత బొత్స ధ్వజం
హైదరాబాద్, డిసెంబర్ 3: ఇసుక మాఫియాతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కైందని, ఇసుక తవ్వకాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ వైకాపా ప్రధాన కార్యాలయం లోటస్‌పాండ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం ఇసుక విధానమంటూ, ఇసుక మాఫియాకు రాష్ట్రప్రభుత్వం తోడ్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన లెక్కలు చూస్తే ఇసుక తవ్వకాల వల్ల మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలన్నారు. కాని కేవలం రూ.850 కోట్లను చూపించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో క్యూబిక్ మీటర్ ఇసుక ధరను రూ. 40 నుంచి రూ.550కు పెంచారన్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక ధరను తగ్గించారన్నారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే అరెస్టు చేయడం టిడిపి ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి, ప్రజా సమస్యలపై నిలదీసినందుకు వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారన్నారు. విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్‌ను కలుసుకోవడానికి వెళితే అరెస్టు చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడుందన్నారు. పోలీసులు అరెస్టు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలను వేరువేరు పోలీసు స్టేషన్లకు తరలించి వేధించారన్నారు. చెన్నైతో పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో తుపాను, వరద బాధితుల కోసం సమగ్రమైన చర్యలు తీసుకోవాలన్నారు.

క్షయ వ్యాధికి చెక్
కొత్త బ్యాక్టీరియా ప్రొటీన్ ఆవిష్కరణ
సిడిఎఫ్‌డి శాస్తవ్రేత్తల పరిశోధన

హైదరాబాద్, డిసెంబర్ 3: మానవాళికి పెనుశాపంగా మారిన క్షయవాదిని నిర్మూలించే దిశగా నగరానికి చెందిన శాస్తవ్రేత్తల బృందం వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ఇప్పటి వరకూ అనుసరించిన పద్ధతుల్లో కాకుండా క్షయవాదిని కొత్త మార్గంలో పటిష్టంగా నిర్మూలించే మైకోబ్యాక్టీరియా ప్రొటీన్‌ను డిఎన్‌ఎ ఫిగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్ కేంద్రం (సిడిఎప్‌డి) శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. డాక్టర్ సంజీవ్ ఖోస్లా నేతృత్వంలో శాస్తవ్రేత్తల బృందం ఈ నూతన పరిశోధనా ఫలితాన్ని ఆవిష్కరించింది. నావెల్ మైకోబాక్టిరియా, ట్యూబర్ క్లోసెస్‌పై జరిపిన పరిశోధనతో టిబి ఇనె్ఫక్షన్ నియంత్రణకు నావెల్ మైకో బాక్టిరియల్ ప్రొటీన్ ఆర్‌వి1 988ను కనుగొన్నారు. ఇది మానవ శరీరంలోని టిబి ఇనె్ఫక్షన్‌కు నియంత్రణకు ఉపకరిస్తుందని డాక్టర్ సంజీవ్ ఖొస్లా తెలిపారు. ఈ పరిశోధన ఇంకా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే టిబిని ఎదుర్కొనేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని వివరించారు. మానవ శరీర భాగంలోని అవయవాలపై ప్రభావం చూపే ఇనె్ఫక్షన్‌ను నివారణకు సెంటర్ ఫర్ డిఎన్‌ఏ కృషి చేస్తుందని పేర్కొన్నారు. క్షయ వ్యాధి రోగ నిర్ధారణకు హిస్టన్ హెచ్-3 ఉపయోగపడుతుందని, మానవ శరీరంలో ఇనె్ఫక్షన్ విస్తరించకుండా ప్రొటీన్ ఆర్‌వి1 988 ఎంతో దోహదపడుతుందని డాక్టర్ సంజీవ్ ఖొస్లా వివరించారు.