తెలంగాణ

పురాతన శివలింగం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకతీయుల కాలంనాటిదని చెబుతున్న పండితులు
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

సూర్యాపేట, డిసెంబర్ 28: కాకతీయులకాలం నాటి పురాతన శివలింగం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో సోమవారం లభ్యమైంది. ఈ శివలింగాన్ని పరీక్షించిన వేదపండితులు సాలగ్రామ శివలింగమని నిర్ధారించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని తాళ్లగడ్డలో నివాసం ఉండే ఎల్గూరి శ్రీనివాస్‌గౌడ్, వెంకన్న ఇద్దరు అన్నదమ్ములు. వీరి నివాసంలో సోమవారం హోమం, పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్రాహ్మణులను పిలిపించారు. ఈక్రమంలో కొబ్బరికాయ కొట్టేందుకు తెచ్చిన రాయిని పరిశీలించిన బ్రాహ్మణులు ఎల్లంభట్ల కృష్ణమూర్తి, రమేష్ అది రాయి కాదని, సాలగ్రామ శివలింగమని నిర్ధారించారు. సుమారు ఐదుకిలోల బరువున్న ఈ శివలింగం సుమారు మూడు, నాలుగు వందల ఏళ్లక్రితం నాటిదని, కాకతీయల కాలంలో ఇలాంటి సాలగ్రామ శివలింగాలు ఉండేవని చెప్పారు. ఈ శివలింగంపై శివుడు గరళం సేవించినట్లుగా గుర్తులు ఉంటాయని, అందువల్లే సాలగ్రామ శివలింగమంటారన్నారు. ఈ శివలింగం ఎక్కడిదని శ్రీనివాస్‌ను అడుగగా తన తండ్రి సైదులు వద్ద ఎన్నోఏళ్లుగా ఈ శివలింగం ఉందని, తాము రాయిగా భావించి తమ ఇంట్లో దేవుని వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఉపయోగిస్తున్నామని, తన తండ్రి పదిహేనేళ్ల క్రితం మృతి చెందినా, అనవాయితీగా తాము కొబ్బరికాయలు కొడుతున్నామని చెప్పారు. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున సాలగ్రామ శివలింగమని నిర్ధారణ జరిగిందని చెప్పిన బ్రాహ్మణులు వెంటనే శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృత అభిషేకాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంతోశక్తి కలిగిన శివలింగాన్ని ఇంట్లో ఉంచవద్దని, లింగానికి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించాలని బ్రాహ్మణులు చెప్పా రు. ఈవిషయంపై తాళ్లగడ్డ ప్రాంత పెద్దలు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.