జాతీయ వార్తలు

శత్రువుకు శత్రువు.. మిత్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి స్వామి
వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్న బిజెపి
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడి బిజెపి ఔపోసన పట్టి లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ను ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడేసి ఇక్కట్ల పాలు చేయటానికి భారతీయ జనతాపార్టీ ఇప్పుడు సుబ్రహ్మణ్యస్వామిని పావుగా ప్రయోగిస్తోంది. స్వామి బిజెపిలో గత ఏడాదే చేరారు. కాంగ్రెస్ పేరు చెప్పినా నెహ్రూ కుటుంబం అన్నా నిప్పులు కురిపించే స్వామి ఇప్పుడు కమలనాధుల శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. తనకు కేటాయించిన భద్రతాసిబ్బందికి తగినంతవసతి కల్పించే వీలు ఇప్పుడున్న నివాస గృహంలో లేనందున ప్రభుత్వం రాత్రికి రాత్రి ఓ పెద్ద ఇంటిని స్వామికి కేటాయించటం అత్యంత వివాదాస్పదంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రభుత్వం ఇంటిని కేటాయించింది. ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఈకేటాయింపును చేసింది. ఒక సాధారణ పౌరుడైన స్వామికి ప్రభుత్వం ఇంటితోపాటు అదనపు భద్రతను కల్పించే చర్యలలో భాగంగా సిఆర్‌పిఎఫ్ బలగాన్ని ఏర్పాటు చేసింది. స్వామికి ప్రభుత్వం వసతి కల్పించటం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ విరుచుకుపడ్డారు.