జాతీయ వార్తలు

షార్‌లో విస్తత్ర గాలింపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాకేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో కేంద్ర బలగాలు విస్తత్ర గాలింపు చర్యలు చేపట్టారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతాబలగాలను పెంచారు. షార్‌కు 50 కిలోమీటర్ల మేర బంగాళాఖాతం తీరం ఉంది. ఈ తీరప్రాంతమంతా గస్తీని ముమ్మరం చేశారు. షార్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సంచార వాహనాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తీరంలో తిరిగే పడవులు, మత్స్యకారుల వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే షార్ అటవీ ప్రాంతంలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉండే దర్గా వద్ద కూడా నిఘా ఉంచి కొత్తవారి రాకపోకలను గమనిస్తున్నారు. ఇక్కడ సీఐ వేంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.