బిజినెస్

ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఎగుమతుల వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం
న్యూఢిల్లీ, నవంబర్ 22: దాదాపు ఏడాది కాలంగా ఎగుమతులు తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు మళ్లీ ఎగుమతులను గాడిలో పడేస్తాయన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. జపాన్, అమెరికా, ఐరోపా దేశాల్లో తగ్గిన డిమాండ్, ముడి చమురు, కమాడిటీస్, ముఖ్యమైన లోహాల ధరల పతనం వంటివి భారత ఎగుమతులకు ప్రతిబంధకమయ్యాయన్నారు. పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 3 శాతం వడ్డీ రాయితీ పొడిగింపు ఎగుమతుల వృద్ధికి దోహదపడగలదని ఆశాభావం వెలిబుచ్చారు.
ఎగుమతుల బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. కాగా, గత ఏడాది డిసెంబర్ నుంచి ఎగుమతులు నెలనెలా పడిపోతుండగా, గత నెల అక్టోబర్‌కుగాను విడుదలైన గణాంకాల్లో ఎగుమతులు 17.53 శాతం క్షీణించి 21.35 బిలియన్ డాలర్లుగా నమోదైయ్యాయి. వాణిజ్య లోటు కూడా పెరిగింది.