జాతీయ వార్తలు

రహస్య ప్రదేశానికి బాలనేరస్థుడి తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్భయ కేసులో నేడు విడుదల కానున్న జువనైల్ ఖైదీ
పునరావాస పథకం సిద్ధం చేసిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్థుడు మూడేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని ఆదివారం విడుదల కానుండగా, శనివారం అతడ్ని జువనైల్ హోమ్‌నుంచి గుర్తు తెలియని రహస్య ప్రాంతానికి తరలించారు. అతని ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానాలలు, ఈ వ్యవహారంపై పలు ఏజన్సీలు దృష్టిపెట్టి ఉన్న కారణంగా ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న అతడ్ని రహస్య ప్రదేశానికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న చట్టాలను పాటిస్తూ ఆదివారం అతడ్ని ఆ రహస్య ప్రదేశంనుంచే విడుదల చేస్తారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసులో బాల నేరస్థుడి పునరావాసానికి సంబంధించిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఆ యువకుడికి ఒక టైలర్ షాపు పెట్టుకోవడానికి వీలుగా పదివేల రూపాయల ఏకకాల ఆర్థిక సహా యం అందజేస్తారని, ఒక కుట్టుమిషన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 2012 డిసెంబర్ 16న నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన వారిలోఒక బాల నేరస్థుడు కూడా ఉండడంతో అతనికి కోర్టు జువనైల్ చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష మాత్రమే విధిస్తూ, అతన్ని జువనైల్ హోమ్‌కు పంపించింది. ఆదివారంతో ఆ శిక్షాకాలం పూర్తి కానుంది. అయితే అతను పాల్పడింది అమానుషమైన నేరం గనుక ఈ సమయంలో అతడ్ని విడుదల చేయడం భావ్యం కాదన్న వాదనలు వినిపిస్తుండడం, దీనిపై కొందరు కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే. అయితే కోర్టు అతని విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కాగా, బాల నేరస్థుడ్ని విడుదల చేయకూడదని కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టులో వాదించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బాల నేరస్థుల సవరణ చట్టం లోక్‌సభలో ఆమోదం పొందిందని, అయితే కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డం కారణంగా అది అక్కడ ఆగిపోయిందని ఆయన తెలిపారు.
రెండుగా చీలిపోయిన స్వగ్రామం
కాగా, తమ కుమారుడి రాకకోసం ఉత్తర ప్రదేశ్ బడౌనీ జిల్లాలోని అతని కుటుంబ సభ్యులు ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పటికీ, చాలా మంది గ్రామస్థులు మాత్రం ఇంతటి దారుణమైన నేరానికి పాల్పిడిన ఆ యువకుడికి తమ గ్రామంలో స్థానం లేదని అంటున్నారు. అంతేకాదు, అతని చర్య ప్రపంచం దృష్టిలో గ్రామానికి, దేశానికి కూడా ఎంతో అప్రతిష్ఠను తీసుకు వచ్చిందని కూడా వారు అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం తాను చేన నేరానికి అతను శిక్ష అనుభవించాడని, శిక్షాకాలంలో అతను పెద్ద గుణపాఠం కూడా నేర్చుకున్నాడని, అందువల్ల కొత్త జీవితం ప్రారంభించడానికి అతనికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయ పడుతున్నారు.