రాష్ట్రీయం

బాధ్యతలు స్వీకరించిన దక్షిణ మధ్య రైల్వే ఏజిఎం ఎస్‌ఎన్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్‌గా ఎస్‌ఎన్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1980వ, బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఎన్ సింగ్ మూడు దశాబ్దాలుగా వివిధ శాఖల్లో పనిచేశారు. స్వీడన్, జపాన్, జర్మన్ దేశాలకు వెళ్లి అక్కడి టెక్నాలజీ, రైల్వే ట్రాక్ సిస్టంపై అధ్యయనం చేసి భారత రైల్వే ట్రాక్ విధానాన్ని మెరుగుపరిచారు. ఈ సందర్భంగా ఏజిఎం ఎస్‌ఎన్ సింగ్ మాట్లాడుతూ రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

ఇద్దరు డిఎస్పీల బదిలీ
హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో ఇద్దరు డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయంలో వెయిటింగ్‌లోవున్న డిఎస్పీ బి రాజామహేంద్ర నాయక్‌ను వరంగల్ జిల్లా (రూరల్) మహబూబాబాద్ ఎస్‌డిపిఓగా నియమిస్తూ, అక్కడ పనిచేస్తున్న డి నాగరాజును పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాల్సిందిగా డిజిపి ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఆరుగురు ఐఎఎస్‌లకు పోస్టింగ్
హైదరాబాద్, డిసెంబర్ 10: ఆరుగురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‌గా కృష్ణ భాస్కర్‌ను నియమించారు. మెదక్ జిల్లా పరిషత్తు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా అలుగు వర్షిణిని నియమించారు. భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా రాజీవ్ గాంధీ హన్మంతును, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్‌సింగ్‌ను, జగిత్యాల సబ్ కలెక్టర్‌గా శశాంక, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా శృతి ఒజాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పిఎఫ్ అధికారికి రెండేళ్ల జైలు
విశాఖపట్నం, డిసెంబర్ 10: లంచం తీసుకున్న కేసులో విజయవాడ సూర్యాపేట ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి జయలతకు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. విజయవాడ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా జయలత పనిచేస్తున్నారు. అభియోగాలు రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.