జాతీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌లో తెరుచుకున్న స్కూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: ఈ రోజు జమ్మూకశ్మీర్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు సైతం తెరుచుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి పలు చోట్ల ఆంక్షలు విధించింది. అంతేకాకుండా విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు తలెత్తటంతో ఈ రోజు నుంచి స్కూళ్లను పునఃప్రారంభించారు. శ్రీనగర్‌లో 190 స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇదిలావుండగా శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో హాజ్ యాత్రికులు తిరిగివచ్చిన సందర్భంగా ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జమ్ములోని ఐదు జిల్లాల్లో 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని అధికారులు నిలిపివేశారు. సోషల్‌మీడియాలో తప్పుడు సందేశాలు, వీడియోలతో దుష్ర్పచారం జరుగుతుందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పుడు ప్రచారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.