రాష్ట్రీయం

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 12: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రాతఃకాల సమయంలో ఆగమ శాస్త్రానుసారం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రామారావు, అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్దంగా యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణం గావిస్తూ వేదస్వస్తి నిర్వహించారు. శివ సంకల్పం అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలంటూ మహాగణపతి పూజ నిర్వహించారు. చండీశ్వరుడికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. అలయ కార్యనిర్వహణ అధికారి, అర్చక స్వాములు కంకణాలకు పూజలు చేసి వాటిని ధరించారు. ఋత్వికులకు దీక్షావస్త్రాలు అందజేశారు. ఆఖండ దీప స్ధాపన, వాస్తుపూజ, హోమం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం వద్ద పతాకావిష్కరణ చేశారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ధ్వజస్తంభాన్ని పూలతో అందంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.