రాష్ట్రీయం

ఎస్‌వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎస్‌వీబీసీ చానల్‌కు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు చైర్మన్ పృథ్వీరాజ్ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుట్రపూరితంగానే తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఈరకమైన ప్రచారాలతో తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని తెలిపారు. వైఎస్సార్‌పై అభిమానంతో పార్టీ కోసం పనిచేసిన తనను గుర్తించి ముఖ్యమంత్రి జగన్ ఎస్‌వీబీసీ చానల్
చైర్మన్‌గా పని చేసే అవకాశం కల్పించారని ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చానల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వచ్చానని, తనకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపతాపాలు లేవని ఆయన తెలిపారు. ఏపీ రాజధాని మార్పును నిరసిస్తూ జరుగుతున్న పోరాటాల నేపథ్యంలో పెయిడ్ ఆర్టిస్టులు అని తాను చేసిన వ్యాఖ్యలు కేవలం కార్పొరేట్ రైతులను ఉద్దేశించి చేసినవేనని ఆయన స్పష్టం చేశారు. ఆ మాటలు నిజమైన రైతులకు ఇబ్బంది కలిగించి ఉంటే వారికి క్షమాపణ కోరుతున్నానని అన్నారు. తాను ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడలేదని, ఆ వాయిస్ తనది కాదని అన్నారు. విచారణలో తన తప్పు ఉందని తేలితే మీడియా సమక్షంలో చెప్పుతో కొట్టించుకుంటానని అన్నారు. ఈ అంశంపై తానే స్వయంగా విచారణకు ఆదేశించి స్వచ్ఛందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ అంశంపై విజిలెన్స్ విచారణలో క్లీన్‌చిట్ పొందిన తర్వాతే మళ్లీ ఎస్‌వీబీసీలో అడుగుపెడతానని అన్నారు.
'చిత్రం... హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న ఎస్‌వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్