రాష్ట్రీయం

సంక్రాంతి ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం సొంత ఊళ్లకు ప్రయాణికులు తరలివెళ్లడానికి సిద్ధం కావడంతో రైల్వే, బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. అటు రైల్వే ఇటు ఆర్టీసీ చార్జీలను ఎడాపెడా పెంచడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు చార్జిలను మార్చడంతో ఏమిటని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణాన్ని తలపించే విధంగా ఆర్టీసీ చార్జీలు వసూళ్లు చేయడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురవడం సంక్రాంతికి కలవచ్చింది. గ్రామీణా ప్రాంతల్లో పంటపొలాలు కళకళలాడుతున్నాయి. దీంతో సొంత ఊళ్లకు బయలుదేరడానికి నగరవాసులు ఉత్సాహం చూపించారు. దీంతో సొంత ఊళ్లకు బంధువులను సైతం ఆహ్వానించారు. తొలి ఏడాది తొలి పండుగ సంక్రాంతికి పండుగు సంబరాల్లో పాల్గొనడానికి భారీగా తరలివెళుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రయాణికులతో సందడి వాతావరణ కన్పించింది. రైల్వే , బస్టాండ్‌లలో మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి రైల్వే పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వృద్దులు, పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురైయ్యారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వు బోగీల్లో ఎక్కడానికి ప్రయత్నించడంతో ప్రయాణికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఎవరికి వారు తమకు రిజర్వేషన్ ఉందని రైలు ఎక్కడానికి పోటీ పడ్డారు. దీంతో అరుపులు, కేకలతో మధ్య రైల్వే స్టేషన్లు దద్దరిల్లాయి. బయలుదేరే రైళ్ల కోసం ప్లాట్‌ఫారం పైకి పరుగులు పెటట్డంతో ఎక్కడ పట్టాలపై పడతారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ప్రయాణికుల రద్దీతో రైళ్ల సమయాల ప్రకటన విన్పించకపోవడంతో ప్రయాణికులు తికమక పడ్డారు. దీంతో వచ్చేపోయే రైళ్లు ఏవో తెలియక ప్రయాణికులు అటుఇటు పరుగులు పెట్టడం కన్పించింది.
టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణికులు సైతం రైలు ఎక్కడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానాకి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది బయలుదేరడంతో ఎటుచూచినా ప్రయాణికుల సందడి కన్పించింది. శనివారం ఉదయం నుంచే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలోకి ప్రయాణికులు రావడంతో రద్దీ కన్పించింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా ప్రయాణికుల సందడి కన్పించింది. రైల్వేతో పాటు తెలంగాణ, ఏపీకి చెందిన వేలాది ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చినా టికెట్ల దొరకక ప్రయాణికులు నానాహైరానా పడ్డారు.
హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్‌లో ప్రయాణికులు టికెట్ల కోసం బారులుతీరారు. ఒక్కసారిగా ప్రయాణికులు బస్టాండ్‌కు భారీగా తరలిరావడంతో ఆర్టీసీ అధికారులు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. టికెట్ల కోసం పోటీ పడడంతో కౌంటర్ల వద్ద ఉద్రిక్తత, తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు భాయభ్రాంతులకు గురైయ్యారు. ప్రయాణికులను ఎక్కించడానికి తెలంగాణ, ఏపీ ఆర్టీసీ అధికారులు పోటీ పడ్డారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లింగంపల్లి- కాకినాడకు జనసాధరణ రైళ్లను అదనంగా నడుపుతున్నారు. ఈ రైళ్లు రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 12,13 తేదీల్లో జనసాధరణ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్ట్యా తెలంగాణ, ఏపీ ఆర్టీసీ బస్సులను మరిన్ని పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఇష్టంవచ్చినట్లు చార్జిలను పెంచడాన్ని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'చిత్రం... హైదరాబాద్ రైల్వేస్టేషన్లులో రైలు ఎక్కడానికి అష్టకష్టాలు