రాష్ట్రీయం

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నర్సాపూర్ - సికింద్రాబాద్, విజయవాడ - సికింద్రాబాద్, కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపబోతున్నది. నర్సాపూర్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07412) ఈ నెల 17వ తేదీ రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక ఈ ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండలలో ఆగుతుంది.
విజయవాడ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07711) ఈ నెల 16వ తేదీ రాత్రి 11 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు ఒక్క కాజీపేట స్టేషన్‌లోనే ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో ఏపీ టూటైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ఇక లింగంపల్లి నుంచి కాకినాడకు జన సాధారణ్ ప్రత్యేక రైలు (07198) 12, 13 తేదీల్లో రాత్రి 8.45 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలులో అన్నీ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.