రాష్ట్రీయం

విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తమకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఎరుకల సంఘం రాష్టశ్రాఖ ప్రతినిధులు ప్రణాళికా సంఘం వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్‌ను కోరారు. సంఘం ప్రతినిధుల బృందం శనివారం వినోద్‌కుమార్‌ను ఇక్కడ కలిసి వినతిపత్రం అందచేశారు. గ్రామాల్లో ఉంటూ తట్టలు, బుట్టలు, చీపుర్లు, అమ్ముకుంటుంటామని, మరికొంత మంది ‘ఎరుకల సోది’ చెబుతుంటారని, మరికొంత మంది పందుల పెంపకాన్ని ప్రధానవృత్తిగా చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. తమకు లభించే కొద్దిపాటి ఆదాయంతో జీవిస్తున్న తమ కులం వాళ్లు విద్య, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా వెనుకంజలో ఉన్నామన్నారు. తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు గిరిజన గురుకులాల్లో, హాస్టళ్లలో తగినన్ని సీట్లు కేటాయించాలని కోరారు. ఎస్టీల జాబితాలో ఉన్న తాము మైదాన ప్రాంతాల్లోనే జీవిస్తున్నామని, దాంతో అటవీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు లభించే సౌకర్యాలు తమకు అందడం లేదని, ఈ సౌకర్యాలను అందించాలని కోరారు. పందుల వ్యాపారం చేసుకునేందుకు గిరిజన శాఖ ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వాలని ఎరుకల సంఘం ప్రతినిధులు కోరారు. రాజకీయంగా కూడా తమకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
వినోద్‌కుమార్‌ను కలిసిన వారిలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, గౌరవ అధ్యక్షుడు కుతాడి రాములు, రాష్ట్ర నాయకులు బాబురావు, మధుసూదన్, మహిళా విభాగం కన్వీనర్ మల్లేశ్వరి తదితరులు ఉన్నారు.