రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు ‘కృష్ణా’ కేటాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రానికి 140 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 84 టీఎంసీల నీటిని గురువారం ఇక్కడ జలసౌధలో సమావేశమైన కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి మే 31గా బోర్డు గడువు విధించింది. కృష్ణానీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇఎన్‌సీలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఇరు రాష్ట్రాల నుంచి కృష్ణానీటి కేటాయింపుల కోసం పెట్టుకున్న ఇండెంట్లపై చర్చించిన అనంతరం తెలంగాణకు 140, ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు కేటాయించినట్టు బోర్డు ప్రకటించింది. ఇరు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇండెంట్ల కంటే ఎక్కువ నీటినే కేటాయించినట్టు త్రిసభ్య కమిటీ సభ్యుడు పరమేశ్ మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరిపినట్టు చెప్పారు. ఇప్పటి వరకు కృష్ణానీటిని ఆంధ్రప్రదేశ్ 511 టీఎంసీలు, తెలంగాణ 158 టీఎంసీలు వినియోగించుకున్నట్టు ఆయన వివరించారు. ఇరు రాష్ట్రాల నీటి వినియోగం, టేలిమెట్రీల ఏర్పాటు, బోర్డుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై బోర్డు చర్చించింది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తరఫున సమావేశానికి ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారు వెంకటేశ్వర్‌రావు హాజరు కావడం పట్ల తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ నీటిపారుదలశాఖ సలహాదారుగా ఉన్న దివంగత విద్యాసాగర్‌రావు సమావేశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. గతంలో పాటించిన విధానాన్ని అనుసరించి ఇక నుంచి సలహాదారులను బోర్డు సమావేశాలకు అనుమతించమని బోర్డు స్పష్టం చేసింది.
'చిత్రం... కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇఎన్‌సీలు