రాష్ట్రీయం

పదవులు కాదు.. క్యారెక్టర్ ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 8: మనిషికి పదవులు ముఖ్యం కాదని వ్యక్తిత్వం ముఖ్యమని శ్రీ విద్యానికేతన్ చైర్మన్, దర్శక నిర్మాత, ప్రముఖ హీరో మంచు మోహన్ బాబు అన్నారు. దేశప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలను మంచు మోహన్ బాబుతోపాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో కలిసిన విషయం విదితమే. కాగా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో బుధవారం 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంత రెడ్డి పాల్గొన్నారు. వార్షికోత్సవం అనంతరం మోహన్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని తన కుటుంబ సభ్యులతోకలిసి 40 నిమిషాలు మాట్లాడానన్నారు. మోదీ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదన్నారు. 70 సంవత్సరాలుగా ఏ ప్రధాని చేయలేని అభివృద్ధి ప్రధానిగా మోదీ చేసి చూపిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ, బిడ్డల భవిష్యత్తు మోదీ, అమిత్‌షాలతోనే సాధ్యమన్నారు. ప్రధానిని కలవడానికి ఉన్న కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.