రాష్ట్రీయం

ఉమ్మడి ఖమ్మంలో 5 మున్సిపాలిటీలకు 11 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల పరిధిలో తొలిరోజున 11మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనప్పటికి టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆయా డివిజన్‌లలో నామినేషన్లు దాఖలు చేశారు. సత్తుపల్లి మున్సిపాల్టీలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఒక్కో నామినేషన్ దాఖలు చేయగా, ఇల్లందులో బీజేపీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీలు ఒక్కో చోట నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేయగా, మధిరలో బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వైరాలో టీఆర్‌ఎస్ తరఫున ఒకరు నామినేషన్ దాఖలు చేయగా మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించనుండటంతో చివరి రోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.