రాష్ట్రీయం

శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సర్వదర్శనాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రస్నాన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి పుష్కరణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలిసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.

'చిత్రం...వైకుంఠ ద్వాదశి పురస్కరించుకుని మంగళవారం తిరుమలో శ్రీవారికి చక్రస్నానం