రాష్ట్రీయం

భక్తులకు ధర్మబద్ధంగా వైకుంఠ ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: హైందవులు అత్యంత భక్తితత్వంతో ఆచరించే తొలి పర్వదినాన శ్రీవారి ఆలయంలో ధర్మబద్ధంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంలో అధికారులు భక్తుల మన్ననలు పొందగలిగారు. అందుకు ప్రధానకారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం లఘుదర్శనం ద్వారా శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించడమే. సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కేటాయించాలని టీటీడీ యాజమాన్యం ముందు నుంచే ఒక ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి మహాలఘు దర్శనానికి సహకరించి సామాన్య భక్తులకు దర్శనం కోసం ఎక్కువ సమయం కేటాయించడంలో భాగస్వాములు కావాలని, వైకుంఠ ద్వార దర్శనం కోసం పేరు నమోదు చేసుకున్న ప్రతి ప్రముఖుడికి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విన్నవించారు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా ఉప ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేకమంది వివిధ రంగాలకు చెందన ప్రముఖులు కూడా ధర్మబద్ధ దర్శనానికి సహకరించారు. మాజీ పాలక మండలి చైర్మన్ కూడా టీటీడీ నిర్ణయానికి సానుకూలత వ్యక్తం చేశారు. ఇది సామాన్య భక్తులకు సంతోషకరమైన అంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిదర్శనం కన్నా ఉత్తర ద్వార ప్రవేశమే మిన్న అన్న సూక్తిని ప్రముఖులకు చేరవేయడంలో టీటీడీ చైర్మన్ ఎన్‌వీ సుబ్బారెడ్డి, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ప్రత్యేక దృష్టిసారించారు. గత యేడాది కన్నా వీఐపీల సంఖ్యను తగ్గించడమే కాకుండా సామాన్యులకు దర్శనాన్ని అరగంట ముందే దర్శనానికి అనుమతించగలిగారు. సోమవారం తెల్లవారుజామున 1.15 గంటలకు వీఐపీలను టీటీడీ ఆన్‌లైన్‌లోకి అనుమతించింది. 3.45 గంటలకు పూర్తిచేసింది. అటు తరువాత నిరంతరాయంగా సామాన్య భక్తులను అనుమతించారు. రాత్రి సమయానికి లక్ష మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. ఆదివారం నుంచి తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండటం, వాతావరణం చల్లబడటంతో చలి తీవ్రత పెరిగింది. అయితే సుమారు రూ.26 కోట్లు వ్యయం చేసి నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, క్యూలైన్లవద్ద భక్తులు చలి వాతావరణానికి పూర్తిగా ఇబ్బంది పడకుండా చేసిన ఏర్పాట్లు సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. చలికోసం ఇబ్బంది పడకుండా ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీలో కూర్చొన్న భక్తులకు ఉచితంగా బెడ్‌షీట్‌లు కూడా అందించారు. అన్నపానీయాలు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ వంటివి నిరంతరాయంగా అందించారు. కాగా సోమవారం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పంచాయతీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, దేవదాయ శాఖామంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ విప్‌లు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌లతో పాటు ఎంపీలు రెడ్డెప్ప, మిధున్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్,
మాజీ ఎంపీ కవిత, విజయనగరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్, కర్ణాటక ఎంపీ సుమలత, నటుడు సునీల్, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని, గాలి జనార్థన్ రెడ్డి.. ఇలా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ అమరనాథరెడ్డి, మానవేంద్రనాథ్ రాయ్, వెంకటరమణ, సీతారామమూర్తి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల మాడ వీధుల్లో వైకుంఠ నాథుని విహారం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి, భూదేవీ సమేతుడై వైకుంఠ నాథుడే స్వర్ణరథంపై కొలువుదీరి తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారి స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో కలియుగ వైకుంఠంగా మారిన తిరుమలలో స్వామివారు స్వర్ణరథంపై కదలి వస్తుంటే భక్తులు తన్మయులై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవిందనామ స్మరణలతో తిరుమల క్షేత్రం మారుమోగిందనే చెప్పాలి. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డిలు స్వయంగా స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. అలాగే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.

'చిత్రం...ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు