రాష్ట్రీయం

భద్రాద్రి రాముడి వైకుంఠ వైభోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: జగదభిరాముని వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. ముక్కోటి ఏకాదశి వేళ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వైకుంఠాన్ని తలపించేలా ధూప, దీప, సాంబ్రాణి పొగల మధ్య గజ, గరుడ, హనుమత్ వాహనాలపై సీతా, లక్ష్మణ సమేతుడై సాక్షాత్కరించిన స్వామివారిని చూసిన భక్తులు ఒక్కసారిగా భక్తిపారవశ్యంతో జయజయ ధ్వానాలు చేశారు. వైకుంఠ ఏకాదశి వేళ ఉత్తరద్వారంలో రామయ్య దర్శనం భక్తుల మధుర క్షణాలకు వేదికగా నిలిచింది. అర్ధరాత్రి నుంచే భక్తులు జాగారం చేస్తూ ఉత్తరద్వార దర్శన ముహూర్తానికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు గర్భగుడిలో స్వామివారికి రెవెన్యూ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భగుడి నుంచి ఉత్తరద్వారానికి స్వామి ఊరేగింపుగా బయలుదేరారు. ముందుగా తిరునామ సంకీర్తన నిర్వహించారు. 4.30 గంటల నుంచి 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి వైభవంపై దేవస్థానం పండితులు వివరించారు. సరిగ్గా 5 గంటలకు మంగళవాయిద్యాల నడుమ వైకుంఠద్వారం తెరుచుకుంది. ఉత్తరద్వారంలో స్వామివారు దర్శనం ఇచ్చారు. స్వామివారికి చతుర్వేదాల విన్నపాల అనంతరం గద్యత్రయ విన్నపం, తిరుప్పాళ్లాండు మంగళాశాసనం, 108 వత్తులతో హారతి నిర్వహించారు. చివరగా అడుగో కోదండపాణి కీర్తనతో శ్రీస్వామి వారు వైకుంఠ ద్వారం నుంచి రాజవీధిలో తిరువీధి సేవకు బయలుదేరారు. కాగా సోమవారం రాత్రి నుంచి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని వివిధ మండపాల్లో స్వామికి రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్ తదితరులు హాజరయ్యారు.

'చిత్రం..భద్రాద్రిలో గజ, గరుడ, హనుమత్ వాహనాలపై ఉత్తర ద్వారంలో ఆశీనులైన శ్రీ సీతా రామలక్ష్మణ స్వాములు