రాష్ట్రీయం

ఏపీ లాక్కున్న ఆ ఐదు గ్రామాలను మళ్లీ తెచ్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 6: అకారణంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతం నుండి లాక్కున్న ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుండి తిరిగి తెచ్చుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
పువ్వాడ అజయ్‌కుమార్ ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌లోని దుమ్ముగూడెం మండలంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నర్సపురం గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి సభలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను లాక్కున్నారని, వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి సాధించుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించిందని, తొలి దశలో 30 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. తిరిగి 12 రోజుల పాటు జరుగుతున్న రెండో దశ కార్యక్రమంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ 250 కోట్లతో గిరి వికాస్ పథకం ద్వారా గిరిజన రైతులకు అవసరమైన విద్యుత్ స్తంభాలు, బోర్లు వేసి మెరుగైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి మరికొంత మందికి ఉద్యోగాలు ఇస్తామని, తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఉద్యోగం తీయబోదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా గ్రామాల్లో ఆర్థికంగా బలంగా ఉన్నవారు గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ నెలకు ఒక్కరోజు శ్రమదానం చేస్తే గ్రామాలు అందంగా, పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మన గ్రామాలను మనమే బాగుచేసుకోవాలనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉంటున్నదని, ఎవరికి వారు తమ గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. పూర్తిగా ఏజన్సీ ప్రాంతంలో జరిగిన మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

'చిత్రం... ఖమ్మం జిల్లా నర్సాపురం గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ