రాష్ట్రీయం

జగదభిరాముడి జల విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: జగదభిరాముడి జలవిహారం ముచ్చట గొలిపింది. అశేష భక్తకోటిని తరింపజేసింది. స్వర్ణకాంతులీనే విద్యుల్లతల శోభలో, పావన గౌతమీ పాయల్లో ఓవైపు వేదఘోష మార్మోగుతుం టే.. అంబరాన వెలుగు పూలవాన వర్షించగా భద్రగిరి వేలుపు శ్రీ సీతారామచంద్రస్వామి వారు పావన గౌతమీ గోదావరి నదిలో హంస వాహనంపై విహరించారు. ఈ దృ శ్యాన్ని చూసిన భక్తజనం పులకించిపోయారు. జై శ్రీరామ్.. జైజై శ్రీ రామ్ అంటూ జయజయధ్వానాలు చేశారు. ముకుళిత హస్తాలతో నమస్కరించి భక్తులు పరవశించిపోయారు. ఉభయ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో భద్రాద్రి లో సందడి నెలకొంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టిన తెప్పోత్సవం ఆదివారం సాయం త్రం వైభవంగా సాగింది. స్వామివారికి మధ్యాహ్నం 3గంటలకు ఆలయంలో దర్బారు సేవ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు రామాలయం నుంచి భారీ ఊరేగింపుగా సీతారామచంద్రులు గోదావరి నదీ తీరానికి బయలుదేరారు. భక్తుల సంప్రదాయ నృత్యా లు, కోలాటాలు, జయజయధ్వానా ల మధ్య ఉత్సవమూర్తులను ఊరేగింపుగా హంస వాహనంపై ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించా రు. ఈ వేడుకలో సీతారామచంద్రస్వామికి భక్తులు నీరాజనం పలికారు. హంస వాహనంపై ఉన్న స్వామివారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ
అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు రాగా ఉత్సవం వైభవంగా జరిగింది. వేద పాఠశాల విద్యార్థులు వేదాలు పఠిస్తూ రాముడిని కొలిచారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం స్వామివారు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేడుకను తిలకించేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు భద్రాచలం వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

'చిత్రం... భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం
*హంస వాహనంలో పూజలందుకుంటున్న భద్రాద్రి రామయ్య (ఇన్‌సెట్‌లో)